
‘బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమలో పడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది’ గత కొన్ని నెలలుగా ఈ వార్త సోషల్ మీడియాతో హల్‌చల్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇరా ఖాన్ భాయ్ ప్రెండ్ ఎవరు? ఇంతకి ఆమె ప్రేమలో పడింది నిజమా కాదా? అనే చర్చ కూడా అటు బాలీవుడ్‌లోను, ఇటు సోషల్ మీడియాలోనూ బాగానే జరిగింది. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ.. ‘అవును నేను ఒకరిని ప్రేమిస్తున్నా. ఆయనతో డేటింగ్‌లో ఉన్నా’ అని కుండబద్దలు కొట్టింది అమీర్ ముద్దుల కుమార్తె ఇరాఖాన్. ‘మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మ్యూజిక్ కంపోజర్ మిషాల్‌ను హగ్ చేసుకున్న ఫోటోను ఇరా పోస్ట్ చేసింది.
అయితే ఇది మిషాల్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం ఇరా ఖాన్ ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. గతంలో ఇరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేస్తూ ‘‘హోప్ యువర్ స్ప్రింగ్ బ్రేక్ వాజ్ సన్నీ అండ్ స్మైలీ’’ అంటూ ట్యాగ్ తగిలించింది.అలాగే మిషాల్ పాట పాడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోను రెండు మూడు వారాలకొకసారైనా వింటా. ఆ పాటతోనే ఆ ఆరోజు మొదలవుతుంది. అని ట్యాగ్ తగిలించింది.
Comments
Please login to add a commentAdd a comment