అమీర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
అమీర్ ఖాన్(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్ ఖాన్, ఇరా ఖాన్. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది.
అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది.
అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా.
అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్ తన ప్రియడు ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment