బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు. కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా.. అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment