
Ira Khan Reveals How She Suffers With Anxiety: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. ఆమె రిలేషన్షిప్, విజయాలు, సినిమా విషయాలు, ఫ్యామిలీతో ఉండే అఫెక్షన్ వంటి తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా తనకున్న మానసిక ఆరోగ్య సమస్య గురించి ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది.
'నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను. దీనివల్ల హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరి కూడా సరిగా తీసుకోలేను. పదేపదే ఏడుపొస్తుంది. యాంగ్జైటీ లక్షణాలు పెరిగి పెద్దగా ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో నిత్యం డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది ఐరా ఖాన్. కాగా ఐరా ఖాన్ సినిమాల్లోకి రావడం లేదని ఇటీవల పేర్కొన్ని విషయం తెలిసిందే.
చదవండి: నేను సినిమాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన స్టార్ హీరో కూతురు
Comments
Please login to add a commentAdd a comment