Mental Health Problem
-
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్‌ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్‌కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్‌లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
ఈ మెంటల్ ఎక్సర్‌సైజ్‌తో మంచి నిద్ర షురూ..!
ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్‌కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌నే సాగిస్తున్నారు.ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్‌లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్‌సైజ్‌ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్‌లో ఏదోక ఒక వర్డ్‌ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడంనిర్ణిత సమయానికి నిద్రించడంసిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.సాయం సమయాల్లో వ్యాయామం చేయడంమద్యానికి దూరంగా ఉండటం.టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటంయోగా, ధ్యానం వంటివి సాధన చేయడంతదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!) -
ఆ వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు..
Ira Khan Reveals How She Suffers With Anxiety: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. ఆమె రిలేషన్షిప్, విజయాలు, సినిమా విషయాలు, ఫ్యామిలీతో ఉండే అఫెక్షన్ వంటి తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా తనకున్న మానసిక ఆరోగ్య సమస్య గురించి ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది. 'నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను. దీనివల్ల హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరి కూడా సరిగా తీసుకోలేను. పదేపదే ఏడుపొస్తుంది. యాంగ్జైటీ లక్షణాలు పెరిగి పెద్దగా ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో నిత్యం డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది ఐరా ఖాన్. కాగా ఐరా ఖాన్ సినిమాల్లోకి రావడం లేదని ఇటీవల పేర్కొన్ని విషయం తెలిసిందే. చదవండి: నేను సినిమాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన స్టార్ హీరో కూతురు -
Covid-19: ఒత్తిడి... కుంగుబాటు
►మానసిక ఒత్తిడిని తగ్గించే మాత్రల వినియోగం ఒక ఏడాది కాలంలోనే రూ.40 కోట్లకు పైగా పెరగడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. ►మానసిక సమస్యల నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన హెల్ప్లైన్లు, కౌన్సెలింగ్ సెంటర్లకు ఫోన్ల తాకిడి గణనీయంగా పెరిగింది. సాక్షి, హైదరాబాద్: ప్రజల మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి దశలో ప్రారంభమైన ఈ సమస్య.. రెండో దశలో మరింత తీవ్రమయ్యింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు వంటివన్నీ భయాందోళనలకు కారణమయ్యాయి. కరోనా పరిస్థితుల్లో వైరస్ బారినపడిన వారితో పాటు పడని వారిలో కూడా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆదుర్దా వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ మహమ్మారి మొదలయ్యాక గతేడాది కాలంలో యాంటీ డిప్రెసెంట్ (ఒత్తిడిని తగ్గించేవి) మాత్రల వినియోగం దాదాపు 25 శాతం దాకా పెరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఫార్మసిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన పరిశోధక బృందం జరిపిన పరిశీలనలో.. భారత మార్కెట్లో అతి ఎక్కువగా అమ్ముడయ్యే ఐదు యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్ల అమ్మకాలు 2020 ఏప్రిల్‌లో రూ.177 కోట్లు (వార్షిక వినియోగం) ఉంటే, తదుపరి ఏడాదిలో అంటే 2021 ఏప్రిల్ నాటికి రూ.218 కోట్లకు పెరిగినట్లు తేలింది. మరోవైపు దేశవ్యాప్తంగా మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులు, సైకాలజిస్ట్‌లు వెల్లడిస్తున్న అంశాలు కూడా ఈ గణాంకాలకు బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి. గతంతో పోల్చితే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో భయం, ఆందోళన, ఆదుర్దా, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలతో తమను ఫోన్లో, ఇతరత్రా సంప్రదిస్తున్నవారు (డైలీ డిస్ట్రెస్ కాల్స్) అంతకుముందుతో పోల్చుకుంటే గత ఒక్క (మే) నెలలోనే 40 శాతం దాకా పెరిగినట్టు వారు చెబుతున్నారు. వైరస్ బారినపడినవారు కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎదురయ్యే ఆరోగ్యం, ఇతర సమస్యలతో కుంగుబాటు, ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు మహమ్మారి తీవ్రంగా విరుచుకు పడడం వల్ల ఎదురయ్యే సమస్యలు, కుటుంబసభ్యులు..ఆప్తులు మరణించడం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం వంటి వాటితో మానసిక ఆరోగ్యం దెబ్బతిని, ఒత్తిళ్లకు గురై మరో వర్గం ప్రజలు మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. దాదాపు నెలన్నర క్రితం గాంధీ మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగం వివిధ వర్గాల కోవిడ్ రోగులపై నిర్వహించిన అధ్యయనం.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి పేషెంట్లకు శారీరక స్వస్థత చేకూర్చే వైద్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపరిచే చికిత్స అందించాల్సిన అవసరముందని సూచించింది. ఈ పరిస్థితిపై సైకియాట్రిస్ట్ డాక్టర్ నిషాంత్ వేమన, సీనియర్ సైకాలజిస్ట్ సి.వీరేందర్ తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. తమను సంప్రదిస్తున్న వారికి కౌన్సెలింగ్‌లో భాగంగా పరిష్కార మార్గాలు, సమస్య తీవ్రతను బట్టి మందులు సూచిస్తున్నట్లు వారు తెలిపారు. పిల్లల గురించీ ఆందోళన రెండు దశల కరోనా, బ్లాక్ ఫంగస్ కేసులు, ఒంటరితనం, ఇంట్లో ఒకేచోట ఏడాదికి పైగా నిరాశ, నిస్పృహల మధ్య గడపడం, ఎక్కడ కోవిడ్ సోకుతుందోనన్న భయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వంటి వాటి వల్ల చాలా మందిలో ఆదుర్దా, ఆందోళన, కుంగుబాటు సమస్యలు తలెత్తాయి. దీంతో ఫోన్లలో లేదా స్వయంగా సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లను సంప్రదిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మొదటి దశలోనైతే ఆత్మహత్యల వంటివి కూడా చోటుచేసుకున్నాయి. ఇక కోవిడ్ తగ్గిపోయాక కూడా ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుటపడక పోవడం, ఒళ్లునొప్పులు, చురుకుదనం లేకపోవడం, నీరసం వంటి సమస్యలతో ఒత్తిడికి గురవుతూ మా దగ్గరకు వస్తున్నారు. జ్ఞాపకశక్తి సమస్యలు, పనిమీద ఏకాగ్రత కొరవడడం, ఉత్పాదకత తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకువస్తున్నారు. థర్డ్‌వేవ్ వస్తే పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుందా, పిల్లలను స్కూళ్లకు పంపొచ్చా లేదా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సమస్యల భారం.. భవిష్యత్ బెంగ చుట్టూ భయం, ఆందోళనతో కూడిన పరిస్థితులు ఉన్నపుడు మెజారిటీ ప్రజల్లో గందరగోళం, ఎటూ తోచని స్థితి ఏర్పడుతుంది. దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన బంధాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, కింది తరగతి వారిని ఈ పరిణామాలు కోలుకోలేని దెబ్బతీశాయి. దిగువ మధ్యతరగతికి చెందిన పలువురి ఉద్యోగాలు, ఉపాధి పోవడంతో ఆర్థికస్థితి దిగజారి కింది తరగతికి చేరుకున్నారు. కరోనాకు ముందే దేశంలో 20 నుంచి 30 కోట్ల మంది దారిద్య్రంలో మగ్గుతున్నారు. కోవిడ్ ప్రభావం, తదనంతర పరిణామాల కారణంగా మరో 40 కోట్ల మంది దారిద్య్రంలోకి ప్రవేశించినట్టు ‘ఇండియన్ ఎకనమిక్ ఫోరం’అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం కోల్పోవడం, నెలవారీ వచ్చే ఆదాయం రాక దాచుకున్న కొంత డబ్బు ఖర్చయిపోవడం, నెల నెలా కట్టాల్సిన ఈఎంఐల భారం పెరిగిపోవడం.. వీటికి తోడు కుటుంబం కరోనా బారిన పడటం వంటి అంశాలు పెనుప్రభావం చూపాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న ఆందోళన, భవిష్యత్ గురించిన భయం వెరసి మానసిక ప్రశాంతత, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబాల్లో కీచులాటలు, ఇంటి సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి. – సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
ఒళ్లంతా చెమటలు, ఆ క్షణం చచ్చిపోతున్నా అనుకున్నా
ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కూడా ఒకానొక సమయంలో మానసిక వేదన అనుభవించిన వ్యక్తే. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. మానసిక సమస్యలతో తానో యుద్ధమే చేశానంటూ దానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడిచింది. "టీనేజర్‌గా ఉన్నప్పుడు అంటే 13-14 ఏళ్ల వయసులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనయ్యాను. ఇదేం నా జీవితాన్ని నాశనం చేసేంత ఇబ్బంది పెట్టలేదు. ఒక్కసారి బలంగా అనుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు, అది మన చేతుల్లోనే ఉందని నమ్మాను. కానీ డిప్రెషన్‌కు గురైనప్పుడు మాత్రం ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేకపోయాను. అప్పుడు చాలా భయమేసింది. నవంబర్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నేను కుంగుబాటుకు లోనయ్యాను. తెలియకుండానే కన్నీళ్లు జలజలా రాలేవి. నా బతుకుకు అర్థం లేదు అనుకునేంతవరకు వెళ్లాను. అసలు ఎందుకు బతకాలి? దేనికోసం బతకాలి? అని పిచ్చిపిచ్చిగా ఆలోచించాను. ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు నన్ను ఆసుపత్రి బెడ్ మీదకు చేర్చాయి. నా పరిస్థితి చూసి పేరెంట్స్ కంగారుపడ్డారు. వెంటనే వాళ్లు ఇండియా నుంచి అమెరికాకు వచ్చారు. నా ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మామూలు మనిషి అయ్యేవరకు నా వెంటే ఉన్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మార్చిలో నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది సడన్‌గా నేను బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోయాను, స్నానం చేయకుండా, పిడికెడు మెతుకులైనా తీసుకోకుండా అచేతనంగా ఉండిపోయాను. ఒళ్లంతా చెమటలు, మరోవైపు గుండె వేగం పెరిగింది. ఆ క్షణం నేను చచ్చిపోతున్నా అనుకున్నా.. హాస్పిటల్‌కు తీసుకెళ్తే ఇది యాంగ్జైటీ అటాక్ అని చెప్పారు. ఏ కారణం లేకపోయినా తీవ్రంగా ఆందోళన చెందేదాన్ని. ఇలా ఆందోళన చెందిన ప్రతిసారి నాకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని, ఛాతీలో నొప్పి నన్ను కుదిపేసేది. అప్పుడే మంచి సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అతడి దగ్గరకు వెళ్లాక నా పరిస్థితి కొంత మెరుగైంది" అని ఆలియా కశ్యప్ చెప్పుకొచ్చింది. చదవండి: ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్ కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు! -
సుశాంత్ ఆత్మహత్య లాంటివి పునరావృతం కాకూడదంటే
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజల మానసిక ఆరోగ్యం గురించి మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. సుశాంత్ సింగ్ మరణంలో కుట్ర కోణం గురించే ఎక్కువ చర్చ జరిపారు అది వేరే విషయం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ‘మంచి ఆరోగ్యం’కు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రజలు శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా మంచిగా ఉండడం. అందుకేనేమో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ‘ప్రోగ్రెసివ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్’ తీసుకొచ్చింది. అందులోని కొన్ని నిబంధనలు ఇప్పటికీ అమలు కావాల్సి ఉంది. ‘లాన్సెట్ సైకియాట్రి’ 2017లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయ ప్రజల్లో 14.3 శాతం మంది, అంటే 19.73 కోట్ల మంది ప్రజలు మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కాగా నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (అక్టోంబర్ 10). చదవండి: మానసిక ఆరోగ్యంలో మార్పులు ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2019 సంవత్సరంలో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దేశంలో ఆత్మహత్యలు 3.4 శాతం ఎక్కువ. ‘ప్రోగ్రెసివ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్’ రావడంతో ఈ ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావించాం. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్లో గతేడాదిలాగే ‘నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’కు 40 కోట్ల రూపాయలను కేటాయించారు. వాస్తవానికి బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’కు గత కన్నా నిధుల కేటాయింపుల్లో కోత విధించారు. దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కనుక ఆరోగ్య రంగానికి ఎక్కువ స్థాయిలో నిధులను కేటాయించలేదని భావించవచ్చు. చదవండి: మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..! ‘నేషనల్ ఏడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు ఇదే బడ్జెట్లో 2,900 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం, ఆఖరికి పొగాకు నియంత్రణకు 40 కోట్ల రూపాయలను కేటాయించి ప్రజల మానసిక ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం ఎందుకివ్వలేక పోతున్నారన్నదే ప్రశ్న. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్‌ను అమలు చేయడానికి 94,073 కోట్ల రూపాయలు అవసరమని నిమ్హాన్స్ వైద్యులు అంచనా వేశారు. మొత్తం హెల్త్ కేర్ బడ్జెట్లో 0.05 శాతం నిధులను మాత్రమే మానసిక ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు. అదే అభివద్ధి చెందిన దేశాలు నాలుగు నుంచి ఐదు శాతం ఆరోగ్య రంగం నిధులను మానసిక ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను తమ రాజకీయాల కోసం ఉపయోగించుకునే భారత రాజకీయవేత్తలకు అలాంటి ఆత్మహత్యలను నిజంగా నిర్మూలిద్దామనే ఆలోచన ఎందుకు కలగదో వారికే తెలియాలి. -
నా గుండె వేగం అమాంతం పెరిగేది: ధోని
చెన్నై: మైదానంలో ధనాధన్ ఎంఎస్ ధోని బంతిని ఎదుర్కోవడానికి భయపడతాడంటే ఎవరైనా నమ్మగలరా? కానీ నమ్మాలి. ఎందుకంటే స్వయంగా ఈ విషయాన్ని అతనే బయటపెట్టాడు కాబట్టి! అంతేకాకుండా ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో కనిపించే మహీ... మైదానంలో ఒత్తిడికి కూడా గురవుతానని చెప్పాడు. భారత మాజీ ఆటగాళ్లు ఎస్.బద్రీనాథ్, శరవణ కుమార్ నెలకొల్పిన ‘ఎంఫోర్’ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో వీడియో కాల్ ద్వారా ధోని, కోహ్లి, అశ్విన్‌లు మానసిక ఆరోగ్యం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్య సమస్యలని అంగీకరించే పరిస్థితి లేదన్నాడు. వాటిని ఆరోగ్య సమస్యలుగా భావిస్తారని పేర్కొన్నాడు.(పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..) ‘ఇది ఎవరూ బయటకు చెప్పరు... కానీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా. నేను క్రీజులోకి వెళ్లిన ప్రతీసారి తొలి ఐదు–పది బంతులు ఎదుర్కొనే వరకు నా గుండె వేగం పెరుగుతుంది. ఆ సమయంలో భయం వేస్తుంది. ఒత్తిడికి కూడా గురవుతా. సహజంగా అందరికీ ఇదే అనుభవం ఎదురవుతుంది. దీన్నెలా ఎదుర్కోవడం? ఇది చాలా చిన్న సమస్యే. దాచిపెట్టకుండా తరచూ మెంటల్ కండిషనింగ్ కోచ్‌తో మన సమస్యలు పంచుకుంటే వీటి నుంచి బయటపడొచ్చు. అందుకే తప్పనిసరిగా అతను జట్టుతో ఉండాలి’ అని ధోని అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లి మానసిక స్పష్టత అనేది క్రీడల్లోనే కాదు మొత్తం జీవితానికే ఎంతో ముఖ్యమైందని చెప్పాడు. మానసిక స్థైర్యం పెంచుకుంటేనే క్రీడల్లో క్లిష్టపరిస్థితుల్ని అధిగమించవచ్చని పేర్కొన్నాడు. -
మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోంది!
సాక్షి,ముంబై: మొహబ్బతే, ధూమ్ 3 లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన నటుడు, ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా తనయుడు ఉదయ్ చోప్రా మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. తాను డిప్రెషన్లో ఉన్నానని, ఎంత ప్రయత్నించినప్పటికీ దీన్నుంచి బయటపడలేకపోతున్నాని ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. మరణానికి దగ్గరగా వెళ్లినట్టు అనిపిస్తోందని, ఆత్మహత్యకు ఇది సరైన దారిగా భావిస్తున్నట్టు ఉదయ్ చేసిన కొన్ని ట్వీట్లను అతడి కుటుంబ సభ్యులు తొలగించారు. ఇంతకు ముందు జూన్ 2018లో కూడా ఉదయ్ ఇలాంటి ట్వీట్లే చేశారు. డిప్రెషన్ (కుంగుబాటు)కు సమాజ బహిష్కరణ, వ్యక్తుల భిన్న ప్రవర్తనలు, ఆహారపు అలవాట్లు, డ్రగ్స్ లాంటివే కారణమని.. అలాంటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘బాలీవుడ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ విభిన్న కలలుంటాయి. నేనూ నంబర్ వన్ అవ్వాలనుకున్నాను. కానీ నా సరిహద్దులు ఏంటో నాకు త్వరగానే తెలిశాయ’ని ఉదయ్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో భారత్‌లో గంజాయిను చట్టబద్ధం చేయాలని.. ఈ డ్రగ్‌ను మన సంప్రదాయంలో భాగం చేయాలని, దీని వాడకం ఆరోగ్యానికీ మంచిదని చేసిన పోస్ట్ అప్పట్లో దుమారం రేపింది. ఈ ట్వీట్‌తో ముంబై పోలీసులు అతడిపై మండిపడ్డారు. అయితే భారత పౌరుడిగా తన భావాలను అందరితో స్వేచ్ఛగా పంచుకునే హక్కు తనకు ఉందని ఉదయ్ ట్వీట్ చేశాడు. -
ఒత్తిడిలో ఉన్నారా.. ఐతే పిచ్చేమో చూయించుకోండి..
కలెక్టరేట్: మనసు నిర్మలంగా ఉందంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ఏదైనా పనిచేసేముందు ప్రశాతంగా ఆలోచించాలంటారు. మనం చేసే ఆలోచనలు.. వాటి ఆచరణ వల్ల వచ్చే ఫలితాలు ఆ పనిచేసినవారితో పాటు చుట్టు పక్కలవారిపై ప్రభావం చూపిస్తాయి. అయితే మనసు బయటకు కనిపించకపోయినా దాని మూలంగా వచ్చే ఫలితాలు మాత్రం కనిపిస్తాయి. అది మంచైనా.. చెడైనా సరే అంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలోచించే మెదడు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే గల్లంతవుతుంది. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించాలంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి. నేడు ‘ప్రపంచ మెంటల్ హెల్త్ డే’ సందర్భంగా మానసిక ఆరోగ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై మరొకటిæ ఆధారపడి ఉంటాయి. మనిషిలోని దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే శారీరక అనోగ్యానికి కారణమవుతుంది. మానసిక రోగం పేరు చెబితే చాలా మంది భిన్నంగా ఆలోచిస్తుంటారని, ఆ సమస్యను ‘పిచ్చి’గా భ్రమ పడుతుంటారని ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఉమాశంకర్ వివరించారు. పొరపాటున అలాంటి వ్యాధి తమకున్నట్టు వారు భావిస్తే జబ్బు తీవ్రత కంటే వీరి ఆలోచనల్లో సంఘర్షణ వల్ల మానసిక అనారోగ్యం కాస్త వింత ప్రవర్తనకు దారితీస్తుందంటున్నారు. 70 శాతం మందికి ఒత్తిడి ప్రస్తుత సమాజంలో దాదాపు 70 శాతం మంది రకరకాల ఒత్తిళ్లతో జీవిస్తున్నారు. పని ఒత్తిడి లేని రంగం అంటూ లేదు. వీరిలో 20 శాతం మంది మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సతో వాటి నుంచి బయటపడున్నారని డాక్టర్ ఉమాశంకర్ చెబుతున్నారు. మానసిక రగ్మతల్లోనూ లక్షణాలను బట్టి వైద్య పరిభాషలో వివిధ పేర్లతో పిలుస్తారు. డిప్రెషన్, యాంగ్జయిటీ, న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్ (ఇన్సోమ్నియా), ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్.. ఇలాంటివన్నీ మానసిక సంబంధమైనమే. ఈ ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోతే రుగ్మతను తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలకు చాలా కారణాలు ఉంటాయంటున్నారు మానసిక వైద్యులు. సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనుభవాలు మానసికారోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ప్రారంభంలోనే వాటిని గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే ఓకే గాని.. పట్టించుకోకుంటే మాత్రం అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆయా వ్యక్తులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు బాసటగా నిలిస్తే వారు త్వరగా కోలుకుంటారు. లక్షణాలను గుర్తించడమూ కష్టమే.. శారీరక అనారోగ్యాలను నిర్ధారించేందుకు ఎన్నో వైద్య పరికరాలు ఉన్నాయి. కానీ మానసిక వ్యాధులను అంత సులువుగా గుర్తించలేమంటున్నారు మానసిక వైద్యనిపుణులు. వ్యక్తిత్వ వైఫల్యాలు, అసహజ ప్రవర్తన, విపరీత ధోరణులు, ప్రతికూల ఉద్వేగాలు ఇతర లోపాలను పరిశీలించాకే మానసిక రుగ్మతలను అంచనా వేయగలమంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషిలోను ప్రేమ, కోపం, చిరాకు, భయం వంటివి ఉంటాయి. అవి మితిమీరితే మాత్రం మానసిక రుగ్మతకు దారితీస్తుంది. నిరంతరం తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి, ఆత్మన్యూనత, స్వీయ సానుభూతి, ఆత్మ నిందలతో కుంగిపోవడం, నేర ప్రవృత్తి, మాదకద్రవ్యాలు తీసుకోవడం, వ్యభిచారం తదితర దుర్వ్యసనాల పట్ల మొగ్గు చూపడం, బాధ్యతలను తప్పించుకుంటూ, బంధాలకు దూరమవడం, విపరీతమైన సిగ్గు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే ఊహించుకుంటూ కాలం గడపడం వంటివన్నీ ఆ కోవకు చెందినవేనంటున్నారు వైద్యులు. చాలా జాగ్రత్తలు అవసరం మానసిక, శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి గనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండోదాని క్కూడా తీసుకోవడం మంచిది. మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సిలింగ్, తర్వాత మందులతో చికిత్స చేస్తాం. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది.– డాక్టర్ ఆర్.అనిత, ఇనిస్టిట్యూట్ఆఫ్ మెంటల్ హెల్త్, ఎర్రగడ్డ ఆహార నియమాలూ ముఖ్యమే.. మనం తీసుకునే ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజువారీ ఆహారంలో కొద్దిగా ఆలివ్ నూనె తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను సక్రమంగా ఉంచుతుంది. ముఖ్యంగా మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు సమృగా లభించే చేపలు ఆహారంలో భాగం కావాలి. యాపిల్, పాలకూర, డ్రైఫ్రూట్స్, బీన్స్, గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిది.– డాక్టర్ ఎం. ఉమాశంకర్,ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్సూపరింటెండెంట్ -
ఒత్తిడిని అధిగమిస్తేనే జీవితం
మానవ జీవితంలో మానసిక ఒత్తిడి అనేది సహజమే అరుునా.. శృతిమించడం వల్లే సమస్యలు అధికమవుతున్నాయి.. ఎల్కేజీ చదివే చిన్నారి నుంచి తల నెరిసిన తాతయ్య వరకు అందరికీ సమస్యలే. చదువు, ఉద్యోగం, కుటుంబరీత్యా, ఒంటరితనం ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో అనేక సమస్యలపై పోరాడుతున్నవారే. ప్రేమించిన యువతి దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాదిగా మారడం, అనుకున్నది సాధించలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన, భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం వంటివి సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మానసిక సమస్యలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మానసిక అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాలంతో పాటు పరుగెడుతున్న సిటీ లైఫ్‌లో మానసిక ప్రశాంతత లోపించింది. గతంలో ఇళ్ల వద్ద అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, బాబాయి ఇలా పెద్దలనే వారు ఉండేవారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు ఇలా చిన్నవాళ్లు కలహించుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా ఆదిలోనే పరిష్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారిని ఓదార్చేవారు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏటా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే వారోత్సవాల్లో మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు అంటే 16 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో మానసిక వైకల్యం (స్కిజోఫ్రీనియా), నివారణోపాయూలపై డబ్ల్యూహెచ్‌వో అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో అధికశాతం మంది డిప్రెషన్‌కు గురవుతుండగా, మరికొంతమంది పర్సనాలటీ డిజార్డర్స్, లైంగిక సమస్యలు, భాగస్వామితో విభేదాలు, స్మోకింగ్, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. పారానాయిడ్ సైకోట్రిక్ అనే సమస్యకు గురయిన వారికి సకాలంలో చికిత్స అందించనట్లయితే సైకోలుగా మారడం, కుటుంబసభ్యులను హింసించడం, హత్యాయత్నం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సంతోషంగా ఉండాలంటే.. మానసిక ఒత్తిడిని గురవరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. ఈర్ష, ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులను చిరునవ్వుతో పలకరించండి.. అభినందించంది.. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి. సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్‌కు లోనుకావద్దు. జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి. పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి, పొరపాట్లు సరిదిద్దండి. మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు. తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి. భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. దానిని సరిచేసుకుంటే అది మీకు దూరంగా ఉంటుంది. ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు. పిల్లలతో సరదాగా గడపండి.. మాట్లాడండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండండి.