ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్‌లు, గాడ్జెట్‌లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్‌కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.
రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌నే సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్‌లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్‌సైజ్‌ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు.
ఈ టెక్నిక్‌లో ఏదోక ఒక వర్డ్‌ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..
నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడం
నిర్ణిత సమయానికి నిద్రించడం
సిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.
సాయం సమయాల్లో వ్యాయామం చేయడం
మద్యానికి దూరంగా ఉండటం.
టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటం
యోగా, ధ్యానం వంటివి సాధన చేయడం
తదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.
(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment