Mental exercise
-
12th ఫెయిల్ హీరో షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!
స్టార్డమ్ కోసం నటులు పడే కష్టం అంతా.. ఇంతా కాదు. అయితే బుల్లి తెర నుంచి బాలీవుడ్ వెండితెరపైకి చేరి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విక్రాంత్ మాస్సే. పైగా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన అతని ప్రయాణం స్ఫూర్తిదాకయం కూడా.. అలాంటి వ్యక్తి కెరీర్ మంచి పీక్‌లో ఉండగా.. ఊహకందని నిర్ణయంతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. ఏంటిది అర్థాంతరంగా కెరీర్‌కి బ్రేక్ చెప్పడమనేది సరైనదా..! అనే కదా డౌటు. ఆ నిర్ణయం లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే..నచ్చినట్లుగా బతకడం అంటే ఇదే అంటూ విక్రాంత్ అనూహ్య నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు మానసిక నిపుణులు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో హీరోగా ఉండే యత్నం చేశాడని అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకుందాం.. 👉ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రభావితమవ్వుతూనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతలా నా లైఫ్ నాది అన్నట్లుగా ఉంటున్నట్లు నటించినా..చాలావరకు తన వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే భయంతోనే ఇష్టంలేని నిర్ణయాలను తీసుకునే యత్నం చేస్తారు. అలానే జీవిస్తారు కూడా. కొద్ది మందే వ్యక్తిగతానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ల నిర్ణయాలు ఇలా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 👉కెరీర్ ఎంతో ముఖ్యమో.. జీవితం అంతే ముఖ్యం. కొన్ని కెరీర్లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీని కారణంగా మన స్నేహితులు, మనపై ఆధారపడినవాళ్లు చెప్పుకోలేని బాధకు, అభద్రతాభావానికి గురవ్వుతారు. 👉చాలామంది ఇటు కెరీర్‌ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు కూడా. అలాంటప్పుడూ వాళ్లు తీసుకునే సరైన నిర్ణయాలే వారి జీవితాన్ని ఆనందమయంగా చేస్తాయి. 👉ఇక్కడొక వ్యక్తి ఎదుటి వారి ప్రమేయానికి లోను కాకుండా తనకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నప్పుడే..ఇలా అద్భుతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇక్కడ విక్రాంత్ కూడా అదే పనిచేశారు. 👉చెప్పాలంటే విక్రాంత్‌గా హీరో మంచిగా నిలదొక్కుకోవాల్సిన కీలక టైం. అలాగే ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఓ భర్తగా, తండ్రిగా సరికొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన కీలకమైన సమయం. కుటుంబానికి తన అవసరం ఎంతో ఉంది. 👉కానీ ఇక్కడ విక్రాంత్ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందరూ ఇది కరెక్ట్ కాదని వ్యతిరేకించినా..తనకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా తన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసి హాయిగా ఉండాలనుకున్నాడు. అందుకే ఇలాంటి షాకింగ్‌కి గురిచేసే డేరింగ్ నిర్ణయాన్నితీసుకున్నాడు. 👉ఇది చాలా పెద్ద త్యాగంగా అభివర్ణిస్తారు గానీ, ఇది అలాంటిది కాదు తన బాధ్యతలకు, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతే అలాంటి నిర్ణయానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. 👉ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి, నచ్చినట్లుగా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎంతో గట్స్ ఉండాలి. అలాంటి వాళ్లే అసలైన హీరోలుగా అందరి మనసులలోనూ నిలిచిపోతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన వ్యక్తిగత జీవితం కోసం లేదా సరికొత్తగా కెరీర్లో దూసుకుపోవడానికి అప్పడప్పుడూ ఇలాంటి బ్రేక్ కూడా అవసరమేనని అంటున్నారు నిపుణులు. 👉కొందరికీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉండొచ్చు. అలా అందరికీ సాధ్యం కాదనేది గమనించదగ్గ విషయం. అయితే హీరో విక్రాంత్ త్వరలో తన నిర్ణయం వెనక్కు తీసుకుని మళ్లీ కెరీర్లో దూసుకుపోయే అవకాశం ఉందనేది అంతరంగీక వర్గాల సమాచారం. (చదవండి: జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?) -
ఈ మెంటల్ ఎక్సర్‌సైజ్‌తో మంచి నిద్ర షురూ..!
ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్‌కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌నే సాగిస్తున్నారు.ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్‌లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్‌సైజ్‌ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్‌లో ఏదోక ఒక వర్డ్‌ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడంనిర్ణిత సమయానికి నిద్రించడంసిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.సాయం సమయాల్లో వ్యాయామం చేయడంమద్యానికి దూరంగా ఉండటం.టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటంయోగా, ధ్యానం వంటివి సాధన చేయడంతదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!) -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
బ్యాడ్మింటన్ ఆరోగ్యానికి విటమిన్
శారీరక ఉల్లాసంతో పాటు మానసిక వినోదానికీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల క్రీడలున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ వయసుతో సంబంధం లేకుండా ఆడే ఆట. చిన్నతనం నుంచే ఈ ఆటను పిల్లలకు నేర్పిస్తుంటారు. దీంతో శారీరకంగానే, మానసికంగా చురుగ్గా ఉండొచ్చు. భారతీయులకు గత రెండు దశాబ్దాల కిందట బ్యాడ్మింటన్‌తో అంతగా పరిచయం లేదు. కానీ ఇటీవల కాలంలో యావత్ దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి చూసేటట్టు చేసింది మన తెలుగు క్రీడాకారిణీ పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించి తన సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ఆటతో ప్రయోజనాలు తెలుసుకుందాం! - సాక్షి, స్కూల్ ఎడిషన్ సాధారణంగా ఆటలన్నీ మొదట్లో వినోదం కోసం ఆవిర్భవించినవే. అనంతరం శారీరక వ్యాయామంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో బ్యాడ్మింటన్ మూలాలను బ్రిటీష్ ఇండియాలో గమనించవచ్చు. బ్రిటిష్ వారు ఈ క్రీడను భారతదేశంలో ఆడినట్లు పలు ఆధారాలు ఉన్నాయి. సైనికుల శిక్షణలో భాగంగా బ్యాడ్మింటన్‌ను నేర్పించేవారు. దీంతో శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయం నాటి నుంచే ఉంది. తదనంతర కాలంలో బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ఆడే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఇది వినోదంతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను అందిస్తుంది. - సాక్షి, స్కూల్ ఎడిషన్ బరువు తగ్గొచ్చు బ్యాడ్మింటన్ ఆడేవారిలో గంటకు 480 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇంత ఎక్కువ మొత్తం శక్తి ఉపయోగపడేది కేవలం బ్యాడ్మింటన్‌లోనే. నిత్యం నిర్ధిష్ట కాలం కేటాయించి ఇంత శక్తిని ఖర్చు చేస్తే.. బ్యాడ్మింటన్ ఆటతో నెలరోజుల్లో 4 కిలోల బరువు తగ్గవచ్చు. మానవ శరీరంలో ఉన్న అన్ని కండరాలు పనిచేసేంది కూడా ఈ ఆటలోనే. పరిగెత్తేవారిలో కంటే బ్యాడ్మింటన్ ఆడే వారిలో రెట్టింపు శక్తి ఖర్చవుతుంది. కండరాల దృఢత్వం.. సాధారణంగా కండరాలు గట్టిపడాలంటే జిమ్‌లో డంబెల్ ఉపయోగించి వ్యాయామం చేస్తుంటాం. కాని బ్యాడ్మింటన్ క్రీడతో సులభంగా కండర సామర్థ్యం పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతి షాట్ ఒక మినీ ఫిగర్ టోనింగ్ అవుతుంది. అంటే భుజవలయం, మోచేతి వలయంలో కదలికలు పెరగడంతో కండరం గట్టిపడుతుంది. ఈ ఆటతో అలిసిపోవడంతో శరీరం కావాల్సినంత నిద్ర తీసుకుంటుంది. దీంతో నిద్ర లేమి సమస్య ఉన్నవారికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శరీరంలో అన్ని ఎముకలు బ్యాడ్మింటన్‌తో ధృడంగా తయారవుతాయి. శ్వాసక్రియా రేటునూ.. ఏదైన పని వేగంగా చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు సహజంగా అలసట వస్తుంది. అయితే ఈ సమయంలో శ్వాసక్రియా రేటు పెరుగుతుంది. దీంతో ఎక్కువ శక్తి వెంటనే విడుదలవుతుంది. ఈ శక్తిని తక్షణమే ఉపయోగించుకోవచ్చు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో శ్వాసక్రియా రేటు పెరిగి శక్తి వెంటనే విడుదలవుతుంది. ఇదే శక్తి వెంటనే ఉపయోగించుకోవడంతో ..ఎప్పటికప్పుడు జీవక్రియా సమస్యలు తగ్గిపోయి శరీరం చురుగ్గా పనిచేస్తుంది. గుండె పనితీరులో... స్థూలకాయుల హృదయంలోని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికి పర్యవసానంగా గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చేస్తాయి. దీనికి చికిత్స కేవలం కొవ్వు తగ్గించడమే. ప్రత్యేకంగా గుండెకు శస్త్రచికిత్స నిర్వహించి కొవ్వు తొలగించడంతో ఈ సమస్యకు పరిష్కారం. అయితే బ్యాడ్మింటన్ ఆడే వారిలో గుండె కండరాల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. నిత్యం వ్యాయామంగా ఆడేవారిలో మాత్రం పూర్తిగా కొవ్వు లేకుండా ఉండి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కండరాలు కూడా ధృడంగా ఉంటాయి. డయాబెటీస్‌కు ఆమడ దూరం.. ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు వ్యక్తులు ఉంటారు. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో డయాబెటీస్ వచ్చేస్తుంది. బ్యాడ్మింటన్ వ్యాయామంగా నిత్యం ఆడే వారిలో రక్తంలో షుగర్ పరిమాణం ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. దీంతో శరీరంలో సర్వరోగాలకు కారణమయ్యే డయాబెటీస్‌ను దూరం చేసుకోవచ్చు. రక్తంలో కేవలం షుగర్‌లో పరిమాణం తగ్గిస్తే ఏ ఇతర శరీరానికి నిరోధకత శక్తి పెరుగుతుంది. దీంతో కాలేయ సయస్యలను కూడా దూరం చేయవచ్చు.