స్టార్‌డమ్ కోసం నటులు పడే కష్టం అంతా.. ఇంతా కాదు. అయితే బుల్లి తెర నుంచి బాలీవుడ్ వెండితెరపైకి చేరి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విక్రాంత్ మాస్సే. పైగా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన అతని ప్రయాణం స్ఫూర్తిదాకయం కూడా.. అలాంటి వ్యక్తి కెరీర్ మంచి పీక్‌లో ఉండగా.. ఊహకందని నిర్ణయంతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. ఏంటిది అర్థాంతరంగా కెరీర్‌కి బ్రేక్ చెప్పడమనేది సరైనదా..! అనే కదా డౌటు. ఆ నిర్ణయం లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే..
నచ్చినట్లుగా బతకడం అంటే ఇదే అంటూ విక్రాంత్ అనూహ్య నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు మానసిక నిపుణులు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో హీరోగా ఉండే యత్నం చేశాడని అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకుందాం..
👉ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రభావితమవ్వుతూనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతలా నా లైఫ్ నాది అన్నట్లుగా ఉంటున్నట్లు నటించినా..చాలావరకు తన వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే భయంతోనే ఇష్టంలేని నిర్ణయాలను తీసుకునే యత్నం చేస్తారు. అలానే జీవిస్తారు కూడా. కొద్ది మందే వ్యక్తిగతానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ల నిర్ణయాలు ఇలా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
👉కెరీర్ ఎంతో ముఖ్యమో.. జీవితం అంతే ముఖ్యం. కొన్ని కెరీర్‌లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీని కారణంగా మన స్నేహితులు, మనపై ఆధారపడినవాళ్లు చెప్పుకోలేని బాధకు, అభద్రతాభావానికి గురవ్వుతారు.
👉చాలామంది ఇటు కెరీర్‌ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు కూడా. అలాంటప్పుడూ వాళ్లు తీసుకునే సరైన నిర్ణయాలే వారి జీవితాన్ని ఆనందమయంగా చేస్తాయి.
👉ఇక్కడొక వ్యక్తి ఎదుటి వారి ప్రమేయానికి లోను కాకుండా తనకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నప్పుడే..ఇలా అద్భుతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇక్కడ విక్రాంత్ కూడా అదే పనిచేశారు.
👉చెప్పాలంటే విక్రాంత్‌గా హీరో మంచిగా నిలదొక్కుకోవాల్సిన కీలక టైం. అలాగే ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఓ భర్తగా, తండ్రిగా సరికొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన కీలకమైన సమయం. కుటుంబానికి తన అవసరం ఎంతో ఉంది.
👉కానీ ఇక్కడ విక్రాంత్ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందరూ ఇది కరెక్ట్ కాదని వ్యతిరేకించినా..తనకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా తన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసి హాయిగా ఉండాలనుకున్నాడు. అందుకే ఇలాంటి షాకింగ్‌కి గురిచేసే డేరింగ్ నిర్ణయాన్నితీసుకున్నాడు.
👉ఇది చాలా పెద్ద త్యాగంగా అభివర్ణిస్తారు గానీ, ఇది అలాంటిది కాదు తన బాధ్యతలకు, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతే అలాంటి నిర్ణయానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
👉ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి, నచ్చినట్లుగా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎంతో గట్స్ ఉండాలి. అలాంటి వాళ్లే అసలైన హీరోలుగా అందరి మనసులలోనూ నిలిచిపోతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన వ్యక్తిగత జీవితం కోసం లేదా సరికొత్తగా కెరీర్‌లో దూసుకుపోవడానికి అప్పడప్పుడూ ఇలాంటి బ్రేక్ కూడా అవసరమేనని అంటున్నారు నిపుణులు.
👉కొందరికీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉండొచ్చు. అలా అందరికీ సాధ్యం కాదనేది గమనించదగ్గ విషయం. అయితే హీరో విక్రాంత్ త్వరలో తన నిర్ణయం వెనక్కు తీసుకుని మళ్లీ కెరీర్లో దూసుకుపోయే అవకాశం ఉందనేది అంతరంగీక వర్గాల సమాచారం.
(చదవండి: జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?)
Comments
Please login to add a commentAdd a comment