
బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించే వార్షిక కార్యక్రమం ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ' చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి కార్యక్రమం ఢిల్లీలోని ఐకానిక్ సుందర్ నర్సరీలో జరుగుతోంది. ఈ ఈవెంట్ ద్వారా విద్యార్థులకు పరీక్షలో ఒత్తిడిని ఎలా జయించాలి, పోషకాహారం ప్రాముఖ్యత తదితర వాటి గురించి ప్రధాని మోదీ తోపాటు పలువురు ప్రముఖులు సూచనలు ఇస్తారు. ఈ ఆదివారం ప్రసారమైన పరీక్షపై చర్చలో బాలీవుడ్ నటులు, విక్రాంత్ మూస్సే, నటి భూమి పడ్నేకర్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడమే గాక విద్యార్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. అవేంటో చూద్దామా..!
2023లో విడుదలైన 12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ మాస్సే ఒక్కసారిగా సెలబ్రిటీ స్టార్‌గా మారిపోయారు. ఆ మూవీ విజయంతో విక్రాంత్ మాస్సే పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు టెలివిజన్‌లో చిన్నపాత్రలతో పరిచయమైన వ్యక్తి ఒక్కసారిగా తనలోని విలక్షణమైన నటుడుని పరిచయం చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆయన ఈ పరీక్ష పే చర్చలో విద్యార్థులను విజువలైజేషన్ పవర్‌పై సాధన చేయమని కోరారు.
మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు వంటి వాటిని దృశ్యమాన రూపంలో ఊహించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుందన్నారు. అలాగే మంచి మార్కులు తెచ్చుకున్నామనే గర్వాన్ని తలకెక్కించుకోవద్దు, ఆలోచనలను మాత్రం ఉన్నతంగా ఉంచుకోండి అని సూచించారు. కేవలం పరీక్షల కోసమే కాదు జీవితంలో ఉత్తీర్ణత సాధించడానికి చదవుకోండని చెప్పారు.
అంచనాలను అందుకోలేకపోతే మరోసారి ప్రయత్నించి సాధించండి అని ప్రోత్సహించారు. ఇక మాస్సే తన అనుభవాలను షేర్ చేస్తూ..తాను మరీ ఇంటిలిజెంట్ విద్యార్థి కాకపోయినా.. మెరుగ్గానే చదివేవాడనని అన్నారు. తనకు ఆటలంటే మహా ఇష్టమని చెప్పారు. పరీక్షలకు కొన్ని రోజుల ముందే పుస్తకాలు తీసే వాడినని, ఆ టైంలో ఇంట్లో కేబుల్ కూడా డిస్‌కనెక్ట్ అయ్యేదని అన్నారు.
దురదృష్టం ఏంటంటే నేటితరానికి ఆటల కంటే ఎక్కువ కాలక్షేపం మొబైల్ ఫోనే అంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే మన దేశానికి అత్యంత ఇష్టమైన క్రీడ క్రికెట్. దానికోసం ఒకరూ ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సంభాషిస్తూ.. వర్తమానం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి బహుమతి దాన్ని వదులుకోకూడదు అని చెప్పారు. అలాగే విక్రాంత్ విద్యార్థులను మీ డ్రీమ్ ఏంటన్నది తల్లిదండ్రులతో పంచుకోవాలని చెప్పారు. మొదట్లో అంగీకరించకపోయినా..వెనకడుగు వేయకుండా మీకు అదే ఎందుకు ఇష్టం అనేది చేతల ద్వారా అందులోని మీ స్కిల్‌ని, అభిరుచుని వ్యక్తపరిచమని సూచించారు. అప్పుడు తల్లిదండ్రులే తప్పక ఒప్పుకుంటారని అన్నారు.
ఇక పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడూ యోధుడిలా బాగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, మెరుగుపెట్టుకోండి(బాగా చదవడం) వంటి మూడు టెక్నిక్‌లు గుర్తించుకోండని అన్నారు.
ఇక బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ..తన తండ్రిని కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వయసులో దాన్ని అర్థం చేసుకునే పరిణితి తనకు లేదని అన్నారు. అలాంటి క్లిష్టమైన సమయంలో మనలోని బలాన్ని గుర్తించాలి, నేర్చుకోవడానికి మార్గాను అన్వేషించాలని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్‌ని కాదని, చదువుకు సంబంధంలేని యాక్టివిటీస్‌లో చురుకుగా ఉండేదాన్ని అన్నారు.
ఆ టైంలోనే తాను నటిని కావాలని ఫిక్స్ అయ్యానని, అలాగే తల్లిలదండ్రులు సంతోషంగా గర్వంగా ఉండేలా తన నటన ఉండాలని భావించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె పరీక్షల సమయంలో 'విరామం' ప్రాముఖ్యతను చెబుతూ ఆ టైంలో మనకు నచ్చింది ఏదైనా చెయ్యమని చెప్పారు. అలాగే ఆ సమయంలో నాణ్యమైన నిద్ర కూడా ఉండాలని అన్నారు.
ఇక పరీక్షల ఒత్తిడిని జయించేలా యోధుడిలా ఉండడి తప్ప చింతించే వ్యక్తిగా ఉండొద్దని చెప్పారామె. యోగా వంటి వాటితో ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా సులభంగా ఒత్తిడిని జయించగలుగుతారని అన్నారు. కాగా ఇంతకుమునుపు సెషన్‌లో బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మికవేత్త సద్గురు, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే వంటి ప్రముఖులు కూడా విద్యార్థులతో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
(చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..)
Comments
Please login to add a commentAdd a comment