suffers
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
ఆ వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు..
Ira Khan Reveals How She Suffers With Anxiety: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. ఆమె రిలేషన్షిప్, విజయాలు, సినిమా విషయాలు, ఫ్యామిలీతో ఉండే అఫెక్షన్ వంటి తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా తనకున్న మానసిక ఆరోగ్య సమస్య గురించి ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది. 'నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను. దీనివల్ల హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరి కూడా సరిగా తీసుకోలేను. పదేపదే ఏడుపొస్తుంది. యాంగ్జైటీ లక్షణాలు పెరిగి పెద్దగా ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో నిత్యం డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది ఐరా ఖాన్. కాగా ఐరా ఖాన్ సినిమాల్లోకి రావడం లేదని ఇటీవల పేర్కొన్ని విషయం తెలిసిందే. చదవండి: నేను సినిమాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన స్టార్ హీరో కూతురు -
అయ్యో.. చిన్నారికి ఎంత కష్టం..
సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఈ పిల్లాడు ఆస్పత్రి బెడ్డుపై బిక్కుబిక్కుమంటున్నాడు. గుండెకు రంధ్రం పడి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బిడ్డడిని చూస్తూ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన బందారపు లింగేశ్వర్, శైలజ దంపతుల ఎనిమిది నెలల బాబు మోక్షిత్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగు నెలల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పుట్టుకతోనే హృదయానికి రంధ్రం ఉందని అక్కడి వైద్యులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు సిఫారసు చేయగా..పరీక్షించిన పెద్ద డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.12 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాకపోవడంతో పెయింటింగ్ వర్కర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న లింగేశ్వర్.. ఇప్పటి దాకా రూ.3 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాడు. ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డడిని చూస్తూ.. చేతిలో డబ్బులు లేక కుమిలిపోతున్న ఆ అమ్మానాన్నల హృదయ వేదన అంతాఇంతా కాదు. దాతలు సాయం చేయాలి.. వైద్య సౌకర్యం ఉన్న ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలో లేకపోవడంతో మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని, తమ బిడ్డ మోక్షిత్ ఆపరేషన్‌కు దాతలు సాయం చేయాలని లింగేశ్వర్, శైలజ కోరుతున్నారు. దయార్థ్ర హృదయులు స్పందించాలని వేడుకుంటున్నారు. సెల్ నంబర్ 8179913499కు కాల్ చేసి కానీ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కానీ..ఆర్థిక సాయం చేసి, ఆపరేషన్‌కు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. -
Covid: జీవితాన్ని కడగండ్లపాలు చేస్తున్న కొత్త జబ్బులు..
సాక్షి, బనశంకరి (కర్ణాటక): జీవితాన్ని కడగండ్లపాలు చేసే ఇతర జబ్బులకు కూడా కోవిడ్ రక్కసి కారణమవుతోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 59, 632 మంది డయాబెటిస్, రక్తపోటు (బీపీ) రోగాల బారినపడినట్లు జాతీయ డయాబెటిస్ నియంత్రణ కార్యక్రమంలో వెల్లడైంది. కొత్తగా షుగర్ జబ్బు కనబడిన రోగుల్లో 35 నుంచి 40 శాతం మంది కోవిడ్‌కు గురైనవారిగా తేలింది. జీవనంలో మార్పులకు తోడు కోవిడ్ సోకడం వల్ల షుగర్, బీపీ ప్రమాదం పెరిగింది. తీవ్రమైన కోవిడ్ బారినపడినవారికి చికిత్సలో స్టెరాయిడ్స్ ఔషధాలను ఇస్తారు. దీంతో దేహంలో షుగర్ భారీగా పెరిగి మధుమేహానికి దారి తీస్తోందని నిపుణులు తెలిపారు. కొత్త ప్రమాదాలు.. ఇప్పటికే కర్ణాటకలో లక్షలాది మంది మధుమేహ, బీపీ రోగులు ఉన్నారు. కొత్తగా వచ్చినవారు వీరికి అదనం. నగర ప్రదేశాలకు పరిమితం కాదని, పల్లెల్లోని వారు, అక్కడి నుంచి వలస వచ్చిన వారిలో కూడా బీపీ, షుగర్ కనిపించాయి. కోవిడ్ రోగుల్లో 30 నుంచి 40 శాతం మందిలో మధుమేహం, బీపీ కనపించినట్లు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకినప్పటికీ తీవ్రం కాకుండా సత్వర చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకర జీవన రీతులతో షుగర్, బీపీ రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. -
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్‌కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్‌కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
అక్కడికెళితే... అంతే సంగతులు!
సాక్షి, రాయచోటి: నిత్యం కరవుతో అల్లాడుతున్న వైఎస్సార్ జిల్లా ప్రజలు జీవనోపాధికోసం వలసలు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళితే మంచి ఉపాధితో పాటు మూడుపూటలా భోజనం వారే ఏర్పాటుచేస్తారని దీంతో మీరు లక్షాధికారులు కావచ్చని ఆశ చూపి, ఇక్కడి మహిళలను విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మహిళలు అష్ట కష్టాలు పడుతూ కనీసం బతికున్నారా... లేదా అనే సమాచారం కూడా తెలియపర్చలేని దుస్థితిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం గరుగుపల్లికి చెందిన లక్ష్మిదేవమ్మ అనే మహిళ తొమ్మిది నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఆమె గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూలి పనులు చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మిదేవమ్మ తన ముగ్గురు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పరచాలనే ఉద్ధేశ్యంతో అప్పోసప్పో చేసి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ ఏజెంట్ ను ఆశ్రయించింది. నెలకు 18 వేలు జీతం, మూడు పూటలా భోజనం ఇస్తారని ఒక ఇంట్లో ఇంటి పని చేయాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పడంతో గల్ఫ్ బాట పట్టింది. అక్కడికెళ్ళిన లక్ష్మిదేవమ్మకు ఒక పూట మాత్రమే భోజనం ఇచ్చి, నెలకు 13 వేలు చొప్పున మూడు నెలల పాటు రెండు ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడించేందుకు అనుమతికూడా ఇవ్వలేదు. 9 నెలలు పనిచేసిన లక్ష్మిదేవమ్మకు 3 నెలలు మాత్రమే జీతం ఇచ్చారు. అధిక ఒత్తిడిని తట్టుకోలేని లక్ష్మిదేవమ్మ తాను స్వదేశానికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఏజెంట్ కు పెట్టిన డబ్బులు చెల్లించి వెళ్ళిపోవచ్చని లక్ష్మిదేవమ్మ యజమానులు డిమాండ్ చేశారు. లక్ష్మిదేవమ్మ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక్కడ స్థానికులు రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. -
పాండ్యాకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ప్రముఖ నటి, ఎంపీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ (49) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెరిబ్రల్ ఎటాక్ రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆమెను వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తనకు తలనొప్పిగా ఉందని, కళ్లు కూడా సరిగా కనిపించడం లేదని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జాయ్ ప్రకాశ్ మజుందార్ తెలిపారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లోని ఏఎంఆర్ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్న విషయాన్ని వైద్యులు ఇంకా చెప్పలేదని ప్రకాశ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకత్తాకు సమీపంలోని కళ్యాణిలో జన్మించిన రూపా గంగూలీ పలు చిత్రాల్లో బాలనటిగా తన కరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ పౌరాణిక టీవీ మెగా సీరియల్ 'మహాభారత్' ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ద్రౌపది పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు సినిమాల్లో నటించిన ఆమె 2015లో బీజేపీ చేరి మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమెను బీజేపీ అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేసింది. -
జయలలిత త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ట్వీట్లు
-
గడపగడపలో సమస్యలు
-
విమానాలకు పక్షుల బెడద!
భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షుల బెడద వీడటంలేదు. ఎప్పుడు ఏ పక్షి ఢీ కొడుతుందో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గురువారం ఉదయం ఢిల్లీకి బయల్దేరిన గో ఎయిర్ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. అయితే అదృష్టం కొద్దీ ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో విమానంలోని వందమంది వరకు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. వందమంది ప్రయాణీకులతో బయల్దేరిన ఢిల్లీ-భువనేశ్వర్ గో ఎయిర్ ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పినట్లు అధికారులు వెల్లడించారు. సిబ్బందితోపాటు ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (బిపిఐఏ) అధికారి వెల్లడించారు. పక్షి ఢీకొట్టిన తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశామని, అనంతరం విమాన ప్రధాన భాగంలో పక్షి అవశేషాలతోపాటు రక్తం మరకలను కనుగొన్నామని తెలిపారు. దీంతో భువనేశ్వర్ నుంచి బయల్దేరాల్సిన G8-162 గో ఎయిర్ విమానం 50 నిమిషాలు ఆలస్యం అయినట్లు తెలిపారు. అధికారులు పూర్తిశాతం తనిఖీలు నిర్వహించిన అనంతరం చివరకు ఉదయం 9.20 నిమిషాలకు టేకాఫ్ అయినట్లు గో ఎయిర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో పక్షులు ఢీకొట్టడం కొత్తేమీ కాదని, 2011 లో సుమారు 19, 2012 లో 18 పక్షులు ఢీకొన్నాయని, అలాగే 2013, 2014 రెండు సంవత్సరాల్లో పది చొప్పున పక్షులు విమానాలనుఢీకొన్నట్లు బీపీఐఏ అధికారులు తెలిపారు. 2015 సంవత్సరంలో నవంబర్ 6 నాటికి 11 పక్షులు విమానాలను ఢీకొట్టినట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. అయితే ఈ పక్షుల బెడద నివారించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా బీపీఐఏ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. -
ఓ మహిళ కన్నీటి కథ