
Ira Khan Reacts To User For Asking Amir Khan Is Your Relative: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ (అమీర్ ఖాన్, అతని మాజీ భార్య రీనా దత్తా కుమార్తె) సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకల్లో ఆమె తన తండ్రితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలకు నెటిజన్స్ భిన‍్నంగా, విచిత్రంగా స్పందించారు. ఒక నెటిజన్ ఏకంగా 'అమీర్ ఖాన్ మీకు బంధువా' అని ప్రశ‍్నించాడు. అతనికి సమాధాంగా వారిద్దరూ తండ్రి కూతుళ్లు అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జవాబును కూడా నెటిజన్ నమ్మకుండా 'అతను తండ్రిలా కనపడట్లేదు.' అని కొనసాగించాడు.
ఈ సమాధానానికి మరో యూజర్ ఆమెకు ఆమీర్ ఖాన్ బయోలాజికల్ ఫాదర్ అన‍్న రిప్లైకు కూడా ఆ నెటిజన్ 'గుడ్ జోక్ సర్. అలా అయితే షారుక్ ఖాన్ నా బయోలాజికల్ ఫాదర్' అని నవ్వుతూ ఉన్న ఎమోజీతో బదులిచ్చాడు. ఇదంతా విసుగు చెందిన ఇంకొక యూజర్ 'డూడ్. ఆమె ఆమిర్ ఖాన్ కూతురే. ఒకసారి గూగుల్‌లో చూసి కన్ఫర్మ్ చేసుకో' అని సూచించాడు. గూగుల్ కూడా కొన్నిసార్లు తప్పుగా చూపెడుతుంది అని మరో యూజర్ చెప్పాడు. ఇదంతా చూసిన ఐరా ఖాన్ ఆ యూజర్ కామెంట్లకు స్ట్రాంగ్‌గా స్పందించింది. ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని స్క్రీన్షాట్ తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పెడుతూ 'ఇది కొత్తది. కానీ అవును. గూగుల్‌లో వచ్చే ప్రతి దానిని చదివి నమ్మకూడదు.' అని క్యాప్షన్ ఇచ్చింది ఐరా.
ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment