Aamir Khan Kiran Rao Divorce: నెట్టింట రచ్చ చేస్తున్న ఐరా ఖాన్‌ పోస్ట్‌ - Sakshi
Sakshi News home page

Aamir Khan Kiran Rao Divorce: నెట్టింట రచ్చ చేస్తున్న ఐరా ఖాన్‌ పోస్ట్‌

Published Mon, Jul 5 2021 5:37 PM | Last Updated on Mon, Jul 5 2021 10:18 PM

Aamir Khan Kiran Rao Divorce Announcement Ira Khans First Post - Sakshi

Aamir Khan Kiran Rao Divorce: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు రెండు రోజులు క్రితం ప్రకటించినప్పటి నుంచి .. ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. నెట్టింట సెటైర్లు, ట్రోలింగ్‌లతో ఈ విషయంపై రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. తాజాగా అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌ తన తండ్రి విడాకులపై స్పందించింది.

15ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్‌ రావ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విడాకులకు సంబంధించి అమీర్‌ ఖాన్‌కు యంగ్‌ హీరోయిన్‌ ఫాతిమాకు ఎఫైర్‌ ఉన్న కారణంగానే, వాళ్లిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లు వీరిపై ట్రోలింగ్‌, మీమ్స్‌తో విపరీతంగా ఆటాడేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమీర్‌ కూతురు ఐరా ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

ఐరా పరోక్షంగా తన తండ్రి అమీర్ విడాకులపై స్పందిస్తూ పోస్ట్‌ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఆ పోస్ట్‌లో... రేపు తదుపరి సమీక్ష, ఏమి జరగబోతుందో మరి?... అంటూ కామెంట్ చేశారు. అమీర్ విడాకులు అనంతరం ఈ తరహా ఫోటో పోస్ట్‌ చేయడంతో ఐరా తన తండ్రిని ఉద్దేశించే ఇలాంటి సెటైరికల్ కామెంట్ చేశారని కొందరు భావిస్తున్నారు. ఐరా ఖాన్ అమీర్ మొదటి భార్య రీనా దత్త కూతురు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement