
Ira Khan Boyfriend Nupur Shikhare Gets Message From Her Fan: బాలీవుడ్ సూపర్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ తమపై ఒకరిపై ఒకరికున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించడంలో అస్సలు మొహమాటపడరు. గతేడాది వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా తాను నుపుర్ శిఖరేతో రిలేషన్‌లో ఉన్నట్లు అధికారికంగా తెలిపింది ఐరా. ప్రామిస్ డే సందర్భంగా నుపుర్‌తో కలిసి దిగిన ఫొటోలను 'నీతో ప్రామిస్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను; అంటూ షేర్ చేసింది. తర్వాత వీరు దీపావళి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నుపుర్ శిఖరే ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నాడు. అందులో అతనికి ఐరా అభిమాని పంపిన మెస్సెజ్ చూపించాడు. 'ఐరా నా ప్రేమ (నా ప్రేయసీ, ఐరా నాది), తనని తాకొద్దు' అంటూ ఐరా ఫ్యాన్ ఒకరు నుపుర్ శిఖరేకు సందేశం పంపాడు. ఇది చూసిన నుపుర్ కొద్దిసేపు ఆలోచించి పక్కనే పని చేసుకుంటున్న ఐరాను చేతివేలితో తాకుతాడు. అది అంతగా పట్టించుకోదు ఐరా. తర్వాత నుపుర్ వచ్చి ఐరాకు ముద్దు పెడతాడు. ఆ ముద్దుతో ఐరా నవ్వుతుంది. దీంతో ఆ వీడియో పూర్తి అవుతుంది. ఐరాను తాకద్దు అని వార్నింగ్ ఇచ్చిన ఆమె ఫ్యాన్‌కు ఐరాకు ముద్దు పెట్టి బదులిచ్చాడు నుపుర్ శిఖర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఎపిక్ రిప్లై అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
ఇదీ చదవండి: తండ్రిని పట్టుకుని బంధువా అన్నాడు.. ఐరా ఖాన్ స్ట్రాంగ్ రిప్లై
Comments
Please login to add a commentAdd a comment