
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు సోషల్‌మీడియాలో చుక్కెదురైంది. ఫ్యామిలీతో జాలీగా గడుపుతున్న ఫోటోలను సోషల్‌మీడియాలోని తమ అభిమానులతో పంచుకోవడం సెలబ్రెటీలకు అలవాటే. అయితే అవి అందరికీ నచ్చవు. నెగటివ్‌గా కామెంట్ చేసే వారు కూడా ఉంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఆమిర్‌కు కూడా ఎదురైంది.
తాజాగా ఆమిర్ కూతురు ఇరా,తన తండ్రిపై కూర్చొని ఉన్న ఫోటోను ఆమిర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటీ? అని ఒకరు కామెంట్ చేస్తే... మీరంటే నాకు ఇష్టం. మీ నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ నుంచి ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని మరొకరు... వయసొచ్చిన కూతురుతో ఇలా ఏంటీ అని ఇంకొకరు రకరకాల కామెంట్లతో వారి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు మాత్రం... ఆమీర్‌కు సపోర్ట్‌గా... అక్కడ అమ్మాయి ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు.. అదే అబ్బాయి ఉంటే ఇలానే అనే వారా?... పవిత్రమైన తండ్రీ కూతుళ్ల బంధాన్ని ఇలా విమర్శించవద్దంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. ఈ విషయంలోకి మతాన్ని లాగొద్దంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment