Aliya
-
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. గురువారం ముంబయిలో జరిగిన ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు మెరిశారు. ఈ ఫంక్షన్లో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్ హాజరయ్యారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ( ఇది చదవండి: చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!) కాగా.. ఆలియా కశ్యప్.. తన ప్రియుడైన షేన్ గ్రెగోయిర్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఆలియా యూట్యూబర్‌గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా. ఇంతకుముందే ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమెకు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసినట్లు ఆలియా వెల్లడించింది. ఈ వేడుకలో అనురాగ్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ తన బేబీ, భర్తతో సహా హాజరైంది. ( ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) -
మూడేళ్లు డిప్రెషన్లో, ఇంతలో గుండెపోటు: స్టార్ డైరెక్టర్
స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒకానొక సమయంలో ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాడట. తన కూతురి గురించి ఆందోళనపడి మూడున్నరేళ్ల పాటు డిప్రెషన్లో ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నామీద, నా కుటుంబం మీద ఎంతో ద్వేషం చూపించారు. నా కూతుర్ని అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల ఆమె ఎంతో ఒత్తిడికి లోనయ్యేది. ఇంత నెగెటివిటీ భరించలేక ట్విటర్ నుంచి వైదొలిగాను. పోర్చుగల్ వెళ్లిపోయాను. కొంతకాలానికి ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండటంతో భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. నా కూతురు ఆలియా కశ్యప్ ఏదున్నా బయటకు మాట్లాడేస్తుంది. కానీ ఆమె లోలోపల పడే ఆందోళన నన్ను ఎంతగానో బాధపెట్టింది. సోషల్ మీడియాలో మొదలైన బెదిరింపుల వల్ల ఆమె చాలా డిస్టర్బ్ అయింది. తన కోసమే నేను అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాను. ప్రతిదానికీ ఆలియా కంగారుపడిపోతుంది, అదొక్కటే నన్ను టెన్షన్ పెడుతుంది. దాదాపు మూడేళ్లు డిప్రెషన్లో ఉన్నాను. గతేడాది గుండెపోటు వచ్చి ఆస్పత్రిపాలయ్యాను. కానీ కోలుకున్న వెంటనే తిరిగి సినిమాలు మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. కాగా అనురాగ్ డైరెక్ట్ చేసిన ప్యార్ విత్ డీజే మొహబ్బత్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు నిహారికతో బ్రేకప్.. సింగర్ క్లారిటీ -
బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే.. రెచ్చిపోయిన డైరెక్టర్ కూతురు!
Aaliyah Kashyap With Boyfriend Shane: ‘‘నా ప్రియమైన సఖుడా.. 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు! ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్ తన ప్రేమికుడు షేన్ గ్రెగోయిర్కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా అతడితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం అనురాగ్, అలియాను ఉద్దేశించి విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు అలియా? మీ నాన్న తీసే సినిమాలు బాగానే చూస్తున్నట్టున్నావు. అందుకే ఇలా తయారయ్యావు. ఆ ఫొటోలేంటి? దేనికైనా హద్దులు ఉంటాయి. అభిమానులతో అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందంటావా? అనురాగ్ నువ్వేనా కాస్త చెప్పొచ్చు కదా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఆమె ఫాలోవర్లు మాత్రం.. ‘‘మీ జోడీ క్యూట్ ఉంది అలియా. ఎవరేమన్నా ఇలాగే ఉండండి. కలకాలం కలిసి ఉండండి’’ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. కాగా డేటింగ్ యాప్‌లో పరిచయమైన షేన్‌తో ప్రేమలో పడిన అలియా ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. చదవండి: అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు! గతంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేనే ముందడుగు వేశాను. తన కోసం ఎంతగానో పరితపించిపోయాను. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశాను. తను నన్ను ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని ఎదురుచూశాను. అయితే, తను మాత్రం కాస్త సందేహించాడు. అందుకే, మాట్లాడుతుండగానే నేనే ధైర్యం చేసి ముద్దుపెట్టేశాను. తను అంటే నాకు అంతగా ఇష్టం ఏర్పడిపోయింది’’ అంటూ ప్రియుడిపై ప్రేమను చాటుకుంది. తండ్రితో అలియా కశ్యప్ ఇక గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, బాంబే వెల్వెట్, మన్మర్జియాన్ వంటి పలు సినిమాల్లో భాగమైన అనురాగ్ కశ్యప్.. లస్ట్ స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాడు. మొదటి భార్య ఆర్తీ బజాజ్ ద్వారా అతడికి కూతురు అలియా కశ్యప్ జన్మించింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొన్నాళ్లుగా అనురాగ్ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్, వివాహానికి ముందే శృంగారం వంటి పలు అంశాల గురించి ఈ తండ్రికూతుళ్లు సంభాషించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: ‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) -
కుమార్తెకి గబ్బర్ భావోద్వేగ ట్వీట్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ శనివారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. మరో వైపు శిఖర్ ధావన్‌కు మాత్రం ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే మే 5 తన కుమార్తె అలియా పుట్టిన రోజు. అయితే తన కూతురు పుట్టిన రోజున అమె పక్కన లేకపోవడంతో ఎంతో బాధపడుతున్నట్టు గబ్బర్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ట్విటర్ ద్వారా అలియాకు విషెస్ చెబుతూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశాడు. `హ్యాపీ బర్త్‌డే మై ఏంజెల్. నీలాంటి మంచి మనస్తత్వమున్న కూతురు ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నీ బర్త్‌డే రోజు మనం కలిసి సెలబ్రేట్ చేసుకోలేకపోవడం చాలా బాధగా ఉంది. నేనెక్కడ ఉన్నా నా మనసెప్పుడూ నీ దగ్గరే ఉంటుందని’ ధావన్ ట్వీట్ చేశాడు. Happy birthday my angel Aliyah. You are a great soul and we are always proud of you. Have a great day! Sad we are not able to celebrate it together. But our heart is alwys there with u. Love u lots.😍😍🎂🎂👏🏼👏🏼😘😘 pic.twitter.com/6Y798g3tyc — Shikhar Dhawan (@SDhawan25) May 5, 2018 -
కూతురుకి శిఖర్ ధావన్ భావోద్వేగ ట్వీట్
-
పబ్‌లో ఫైట్!
బాలీవుడ్లో తారలే కాదు... వారి పరివారం కూడా ఎప్పుడూ ఏదో ఒక హడావుడి చేసి వార్తల్లో వేడి పుట్టిస్తుంటారు. పూజాబేడీ కుమార్తె అలియా ఫర్నిచర్‌వాలా... దర్శకుడు రామానంద్‌సాగర్ ముని మనవరాలు సాక్షి పబ్‌లో ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారట. ట్రిస్ట్ పబ్‌లో జరిగిన ఈ ట్విస్టింగ్ సీన్‌కు అక్కడున్నవారంతా షాకయ్యారట. ఇద్దరి బ్యాచ్‌లూ వేరువేరుగా పార్టీ చేసుకుంటుండగా, మత్తు తలకెక్కిన అలియా గ్రూప్... సాక్షి గుంపుపై పడిందట. వారూ అదే మత్తులో ఊగుతున్నారేమో... దిమ్మ ‘తిరిగేలా’ రియాక్టయ్యారట. చివరకు పోలీస్ స్టేషన్లో పూజాబేడీ... సాక్షి తల్లి మీనాక్షిలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారనేది ఓ స్థానిక పత్రిక కథనం.