బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. తన సోదరి అలియాను హత్య కేసులో న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది. అలియా మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలి హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉంది. ఎడ్వర్డ్‌కు చెందిన గ్యారేజీకి అలియా నిప్పంటించడంతో వారు చనిపోయారని న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూయార్క్ డైలీ న్యూస్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ తన మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ , అతని స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్‌ల మరణానికి కారణం అలియానే అని అనుమానాలు ఉన్నాయి. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో అనస్తాసియా మధ్య పెరుగుతున్న బంధం పట్ల అలియా అసూయతో ఉన్నట్లు వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే, అసూయతో, ఆమె గ్యారేజీకి నిప్పు పెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. నిప్పు పెట్టిన తర్వాత విష వాయువులు వెలువడటంతో వారు మరణించారు. ఆమె అసూయనే ఇద్దరు వ్యక్తులను చనిపోయేలా చేసిందని అక్కడి మీడియా పేర్కొంటుంది. క్వీన్స్ క్రిమినల్ కోర్టులో విచారణ అనంతరం ఆమెకు బెయిల్ కూడా నిరాకరించబడింది.
ఈ ఘటనపై నర్గీస్ ఫక్రీ తల్లి న్యూయార్క్ డైలీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ' నా కూతురు ఇలాంటి తప్పు చేయదు. ఒకరిని చంపుతుందని నేను అనుకోను. ఆమెకు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే తెలుసు. ఆమె కొద్దిరోజుల క్రితం దంతాలకు సంబంధించి చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె ఓపియాయిడ్లు (మత్తు మందులు) ఎక్కువగా తీసుకుంది. ఆ సమయం నుంచి ఆమెలో కొన్ని మార్పులు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. నర్గీస్ ఫక్రీ బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించింది. అయితే, తెలుగులో హరి హర వీర మల్లు సినిమాలో ఆమె కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment