Mumbai: RRR Movie Pre Release Event Has No Telecast - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులకు చేదువార్త.. అక్కడ నో టెలికాస్ట్‌

Published Sun, Dec 19 2021 3:57 PM | Last Updated on Sun, Dec 19 2021 4:14 PM

RRR Movie Pre Release Event Has No Telecast In Mumbai - Sakshi

RRR Movie Pre Release Event Has No Telecast In Mumbai: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషనల్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 భాషల్లో తెరకెక్కుతున్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం' (RRR). పాటలు, వీడియోలతో ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్స్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్‌, ముంబై, బెంగళూరులో సందడి చేసి ఆకట్టుకున్నారు. అలాగే ఈ నెల 19న ముంబైలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఇదివరకు  ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే ఆదివారం (డిసెంబర్‌ 19) ముంబైలో జరిగే ఈ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేయట్లేదని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌ను మరో రోజు టెలికాస్ట్‌ చేస్తామని తెలిపింది. అలాగే మరికొన్ని నగరాల్లో  #RoarofRRR ఈవెంట్స్‌ ఉన్నాయని, వాటిని లైవ్‌ ఇస్తామని పేర్కొంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ట్విటర్‌లో  వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి డ్యాన్స్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. 

ఇదీ చదవండి:  అలియా భట్‌ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్‌ వీడియో వైరల్

ఇదీ చదవండి: పెళ్లిళ్లు అయ్యాయి.. అయినా అదేపని.. తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్, గట్టిగా గిల్లిన ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement