నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం | bollywood audience away from movies | Sakshi
Sakshi News home page

నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం

Published Sun, Sep 18 2016 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం - Sakshi

నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం

అవలోకనం
ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న బాలీవుడ్ సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆశ్చర్యకరం. మౌలిక వసతుల సమస్య ప్రధాన కారణం కాగా కొత్తగా పుట్టుకొస్తున్న మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ల ధర మధ్యతరగతి కుటుంబాలు భరించలేనంత అధికంగా ఉంటోంది. స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయడానికే పరిమితమవడంతో మన ప్రేక్షకులకు చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. ప్రముఖ స్టార్లు పరిమిత సంఖ్యలో ఉండటమే బాలీవుడ్ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తోంది.
 
తాను నిర్మిస్తున్న సినిమాలకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా బాలీవుడ్ కొన్ని సంవత్సరాల క్రితం కోరింది. ఆ సమయంలో సినీ నిర్మాతలకు రుణ సహాయం చేయడానికి బ్యాంకులను అనుమతించేవారు కాదు. సినీ కథలు, నటుల తేదీలు వంటివి పరస్పర సంబంధంతో కూడినవిగా గుర్తించకపోవడమే దీనికి కారణం కావచ్చు. అంటే సినీ నిర్మాతలు తరచుగా ఇతర వనరుల నుంచి డబ్బును సేకరించేవారు, కొన్ని సందర్భాల్లో మాఫియాతో కూడా వీరు సంబం ధాలు పెట్టుకునేవారు. 20 ఏళ్ల క్రితం సినీ నటులు, నిర్మాతలు నేరస్థులతో సన్ని హితంగా ఉంటున్నారని వచ్చే వార్తలను చదవటం సర్వసాధారణ విషయంగా ఉండేది. ఇటీవలికాలంలో ఇది నిలిచిపోయినట్లుంది. పైగా ఈ రోజుల్లో ధన సేక రణకు సంబంధించి సినీనిర్మాతలకు ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. బాలీవుడ్ ఇప్పుడు కీలక పరిశ్రమగా మారిందని, ఇదివరకటికంటే వేగంగా అది ఎదుగు తోందని ఇది సూచిస్తోంది. కానీ వాస్తవం మాత్రం భిన్నంగానే ఉంది.
 
కొన్ని వారాల క్రితం, సినిమా వ్యాపారంపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ని ఇంటర్వ్యూ చేశారు. భారత్‌లో సినిమాలు చూసే వారి సంఖ్య వాస్తవానికి ప్రతి సంవత్సరం తగ్గుముఖం పడుతోందని చాలాకాలం నుంచి సినీపరిశ్రమలో ఇన్ సైడర్లకు తెలుసని కరణ్ తెలిపారు. ఇందుకు కారణాలలో మౌలిక వసతుల సమస్య ఒకటి. భారత్‌లో నేటికీ లక్షమంది జనాభాకి ఒక హాల్ మాత్రమే ఉంటోంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశ్రమ అయిన అమెరికాలో 12 థియే టర్లు, హాంకాంగ్‌తో కలసి ప్రపంచంలో రెండో అతిపెద్ద పరిశ్రమ అయిన చైనాలో లక్షమందికి 2.5 థియేటర్లు ఉన్నాయి.
 
భారతీయ నగరాలు పాత సినిమాహాళ్లను కూల్చివేసి, మాల్స్‌ను నిర్మించడం ప్రారంభించడంతో దేశంలో థియేటర్ల సంఖ్య మరింత పడిపోనుంది. మరొక సమస్య ఏమిటంటే, కొత్త మాల్స్‌లోని మల్టీప్లెక్స్ తెరలు చాలామంది మధ్య తరగతి కుటుంబాలకు భరించలేనివిగా ఉన్నాయి. వీటిలో ఒక్క టిక్కెట్ ధర రూ. 250ల వరకు ఉంటోంది. కుటుంబం మొత్తాన్ని సినిమాకు తీసుకెళ్లాలంటే అది కుటుంబ ఆదాయాన్నే మింగేస్తుంది. దీనికితోడు సేవా పన్ను, వినోద పన్ను రేట్లు అధికంగా ఉంటున్నాయి. ఈ స్థితిలో టిక్కెట్ల ధరలు తగ్గించడానికి పెద్దగా అవ కాశం లేదు. అలా అని సినీ నిర్మాతలు, స్టూడియోలు మరీ దురాశాపరులు కావ టంవల్లే ఇలా జరుగుతోందని చెప్పలేం. వాస్తవానికి, భారీ నష్టాలను ఎదుర్కొం టున్నందువల్ల, బాలీవుడ్ సినీ నిర్మాణ వ్యాపారం నుంచి వైదొలుగుతాయని ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ ఇటీవల ఒక ప్రకటన చేసింది.
 
సినీ ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి గల కారణాలలో సినీ పరిశ్రమ కూడా ఒక భాగమై ఉంది. బాలీవుడ్ బడా స్టార్ హీరోలు తగినన్ని సినిమాలను నిర్మించ కపోవడం వల్ల ప్రేక్షకులకు చూడటానికి సినిమాలు లేకుండా పోయాయని నా మిత్రుడొకరు చెప్పారు. అమీర్, షారుఖ్, సల్మాన్‌లు ఇప్పుడు ఏటా ఒక సిని మాలో మాత్రమే నటిస్తున్నారు. ప్రకటనలు, టీవీల ద్వారా వీరు ఆర్జిస్తున్నారు. కాగా, సినిమా కోసం వెచ్చించగలిగినంత డబ్బు ఉండి సినిమాకు వెళ్లాలనుకుని పలువురు భావిస్తున్నప్పటికీ తరచుగా వీరికి చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. హలీవుడ్, హాంకాంగ్‌తోపాటు ప్రపంచంలోని మూడు అతిపెద్ద సినీ పరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. వీటిలో ప్రతి దానికీ స్టార్ వ్యవస్థ ఉంది. జనంలో గుర్తింపు పొందిన ప్రముఖ నటులు సినిమాకు గ్యారంటీ విజయాన్ని కల్పించగల రని, వీరు తగిన సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలరని దీనర్థం.
 
సమస్య ఎక్కడుందంటే బాలీవుడ్ ప్రతి ఏటా చాలా సినిమాలను నిర్మిస్తున్న ప్పటికీ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో తీస్తున్న సినిమాలను కూడా కలుపుకున్నట్లయితే) పరిమిత సంఖ్యలోనే ప్రముఖ స్టార్లను కలిగి ఉండటమే. అదే హాలీవుడ్‌లో అయితే ఒక పెద్ద సినిమాలో నటిం  చేందుకు అనేకమంది స్టార్లు అందుబాటులో ఉంటున్నారు. మరొక సమస్య ఏమి టంటే..  హాంకాంగ్ సినిమాల్లాగా, బాలీవుడ్ సినిమాలు సార్వత్రికమైనవి కావు. నేనెందుకిలా చెబుతున్నానంటే.. హాంకాంగ్ చిత్రపరిశ్రమ తీస్తున్న మార్షల్ ఆర్ట్స్ సినిమాలు వస్తుగతమైనవి. బ్రూస్‌లీ, జాకీచాన్ వంటి హాంకాంగ్ స్టార్లు అమె రికాలోనూ, ఇండియాలో కూడా ప్రముఖ హీరోలుగా మారారు. హాంకాంగ్ సిని మాలు యాక్షన్ స్వభావంతో కూడుకున్నవి కావడంతో డబ్బింగ్ చేసేటప్పుడు కూడా వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
 
భారతీయ సినిమాలు యాక్షన్‌తో కూడినవి కాదు. పైగా హాంకాంగ్ సినిమా ల్లాగ బాలీవుడ్ సినిమాల యాక్షన్ నాణ్యత అంత ఉన్నతంగా ఉండదు. బాలీవుడ్ సినిమాల్లో సంగీతం, నాట్యం ఉంటున్నందున వీటిని డబ్బింగ్ చేయడం అంత సులభం కాదు, నాణ్యత కోల్పోవడం కాస్త అధికంగానే ఉంటుంది. దీనివల్లే హాలీవుడ్, హాంకాంగ్ సినిమాలతో పోలిస్తే భారతీయ సినిమాల విదేశీ ఆదా యాలు చాలా తక్కువ. విదేశాల్లో మన సినిమాలను చూసేది చాలావరకు దక్షిణా సియా సంతతి ప్రజలే కావడం విశేషం.
 
దీంట్లో కూడా ప్రేక్షకుల సంఖ్య తక్కువే. పాకిస్తాన్‌లోని మల్టీప్లెక్స్‌లలో భార తీయ సినిమాలకు అధిక మార్కెట్ ఉంది. అయితే పైరసీ కారణంగా దశాబ్దాలుగా ఇక్కడి ఆదాయాన్ని బాలీవుడ్ కోల్పోయింది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో అధికారికంగానే బాలీవుడ్ సినిమాల ప్రదర్శనను అనుమతించారు. దీంతో ఇరు దేశాలూ లబ్ధిపొందాయి. ఈ రోజు బాలీవుడ్‌లో నిర్మిస్తున్న అన్ని సిని మాలను పాకిస్తాన్‌లో ప్రదర్శిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు క్షీణిస్తున్నందున ముషారఫ్ గతంలో తీసుకున్న తెలివైన నిర్ణయాన్ని కూడా వెనక్కు మళ్లిస్తే మనం ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ అన్ని కారణాల వ ల్లే, బాలీవుడ్‌కు అధిక సామర్థ్యం ఉన్నప్పటికీ అది ఎదగలేకపోతోంది. వాగ్దానాలను గుప్పించడమే తప్ప, వాటిని అమలు చేయడంలో విఫలమౌతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే బాలీవుడ్ ప్రయాణిస్తున్నట్లుంది.

 ఆకార్ పటేల్
 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement