సాధారణంగా కెమెరామెన్‌ల కన్ను మైదానంలోనే ఆట, ఆటగాళ్ల మీదే కాదు.. చుట్టుపక్కల జరిగే వాటి మీద కూడా పడుతుంది. వెరైటీగా అనిపించేవాటితో పాటు అందంగా కనిపించే ఆడవాళ్లను కూడా బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటారు. ఆ టైంలో స్క్రీన్ మీద కనిపించే వాళ్ల రూపాల్ని చూసి మురిసిపోతుంటారు కూడా. అయితే అలాంటి ఘటనే ఒకటి వీడియో ఇప్పడు వైరల్ అవుతుండగా.. రకరకాల రియాక్షన్లు వ్యక్తం అవుతున్నాయి.
ఆడియెన్స్ గ్యాలరీలో కాళ్లు ముడుచుకుని కూర్చున్న ఓ అమ్మాయిని, ఆమె అందాల్ని పదే పదే జూమ్ చేస్తూ ఉండిపోయాడు కెమెరామెన్. అది గమనించిన కామెంటేటర్.. ఆ కెమెరామెన్ టైమింగ్‌కు తగ్గట్లే ఓ పాట పాడాడు. అలా ఒక్కసారి కాదు.. జూమ్ వేస్తూ చాలాసార్లు ఫోకస్ చేశాడు. ఇక ఆ చేష్టల్ని చూయింగ్ గమ్ నములుతూ ఆ అమ్మాయి కూడా అంతే లైట్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ ద్వారా వైరల్ అయ్యింది.
ఈ వీడియో ఏ మ్యాచ్ సందర్భంగా జరిగిందో తెలియదు. పాతదో కొత్తదో లేదంటే ఎడిట్ చేసిందో క్లారిటీ లేదు. కానీ, @hfussbaIl అనే ట్విటర్ అకౌంట్ నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆ కెమెరామెన్‌ను, మరికొందరు పాటపాడిన ఆ కామెంటేటర్ తీరును తప్పుబడుతూ తిట్లు తిడుతున్నారు. నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకొందరి బాధేంటంటే.. ఆ వ్యక్తి పాడిన పాటకి అర్థం తెలుసుకోవాలనే ప్రయత్నం. దీంతో ఓ వ్యక్తి అది అరబ్ పాట అని చెబుతూ.. ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశాడు. ఆ అందానికి గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లు అయ్యిందని, జీవితాంతం ఆమె పాదాల దగ్గర పడి ఉండాలని ఉంద’ని ఆ పాట సారాంశం అని సదరు వ్యక్తి బదులిచ్చాడు.
చదవండి: హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా?
Comments
Please login to add a commentAdd a comment