ఇటీవల ఢిల్లీలో ఓ కస్టమర్‌కు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ షాక్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 లకుపైగా వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్..
టైమ్స్‌నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్ బుక్ చేసుకున్నారు. ఆమె ప్రయాణం పూర్తయి గమ్య స్థానం చేరుకోగానే ఉబర్ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది.
ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు. ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు తేలింది. బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరింది. దీంతో ఇంత మొత్తంలో బిల్లు వచ్చింది. బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది. ఉబెర్ క్యాష్ వాలెట్‌లో రూ.900 రీఫండ్ చేసింది.
ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్!
మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్ తమ సేవల్ని మెరుగుపర్చింది. ఉబర్ రిజర్, పికప్ డైరెక్షన్స్, వాకింగ్ ఈటీఏస్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే..
Comments
Please login to add a commentAdd a comment