సాధారణంగా మీరు క్యాబ్‌ని (cab) బుక్ చేసుకుని ఎక్కగానే ఎంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటామా అని ఆలోచిస్తారు. కానీ ఢిల్లీలోని అబ్దుల్ ఖదీర్ ఉబెర్ (Uber) క్యాబ్‌లోకి అడుగు పెడితే రైడ్ ముగియాలని కోరుకోకపోవచ్చు! ఎందుకంటే స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్‌లు, మందులు, హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్‌లు, టిష్యూలు, శానిటైజర్‌లు, యాష్‌ట్రే ఒకటేమిటి అన్నీ సౌకర్యాలు ఈ క్యాబ్‌లోనే ఉన్నాయి. దీనిపై రెడ్డిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.
అబ్దుల్ ఖదీర్ కేవలం రైడ్ మాత్రమే అందించడం లేదు. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో (business class flight) ఉండే లాంటి లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాడు. పైగా క్యాబ్‌లో అతడు అందిస్తున్న ప్రతిదీ ఉచితం. ఇది సాధారణ టాక్సీ కంటే విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. తన క్యాబ్ ఫోటోను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు.. "విమానాల కంటే క్యాబ్ సౌకర్యాలు మెరుగ్గా దొరికాయి!" అని చమత్కరించాడు.
క్యాబ్‌లో ప్రయాణికులకు ఖదీర్ అందిస్తున్న విశిష్ట కస్టమర్ సేవలపై సోషల్ మీడియా యూజర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఖదీర్‌కు ఉన్న శ్రద్ధ అతనిని ఎంతగానో పాపులర్ చేసింది. ఎప్పుడు క్యాబ్ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్ చేసుకుంటామంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే ఖదీర్ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు.
Comments
Please login to add a commentAdd a comment