గోరెంట్ల(అనంతపురం జిల్లా): అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలోని కమ్మలవాండ్లపల్లి గుట్ట వద్ద ఈ దాడులు శుక్రవారం జరిగాయి. అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది.
దీంతో క్వారీపై దాడి చేసి అధికారులు దానిని సీజ్ చేశారు. ఇటాచీ, క్రైన్, కంప్రెసర్‌లను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.