అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అంతులేని అక్రమాలు
వైఎస్సార్‌సీపీ విధేయుడినంటూ గతంలో అబద్ధాలు
పచ్చపార్టీ అధికారంలోకి రాగానే ఫిరాయింపు
గ్రానైట్ అక్రమ తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టిన నేత
తవ్వకాలపై రూ.275 కోట్ల పన్నుల ఎగనామం
అక్రమాల్లో ఆయన ఘనాపాటి. అవినీతి పనులకు పెట్టింది పేరు. ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టడంలో దిట్ట. ఆయనే బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని క్వారీల నుంచి అక్రమంగా గ్రానైట్ తరలించి కోట్లు కొల్లగొట్టారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి దానినుంచి బయటపడేందుకు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. ఈ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. వందలకోట్ల మేర అక్రమ రవాణా జరిగినట్టు నిర్ధారణ అయింది. రూ. 275కోట్ల అపరాథ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని ఎలా ఎగ్గొట్టాలా అని ఇప్పుడు చూస్తున్నారు.
ఆది నుంచి అవినీతిలో ఆరితేరి
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారంటూ గొట్టిపాటిపై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఆయన తమ్ముడు కిశోర్‌రెడ్డితో మంతనాలు చేసి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే లోకేశ్‌ను కలిసి అక్రమ రవాణా వ్యవహారంపై ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు.
గొట్టిపాటి అక్రమాల చిట్టా...
♦ ఎమ్మెల్యే గొట్టిపాటికి సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 20 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆరు క్వారీలు ఉన్నాయి. ఇవికాక బినామీలతో మరికొన్నింటిని నడుపుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ప్రాంతంలోనే కాక ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
♦ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన గొట్టిపాటి టీడీపీలో చేరాక పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేసినట్లు ఆధారాలతో సహా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మైనింగ్ విభాగం నిర్థారించింది.
♦ బల్లికురవ మండలం కొణిదెలలో కిశోర్ స్లాబ్ అండ్ టైల్స్ పేరుతో 6.4 హెక్టార్లలో గ్రానైట్ క్వారీ ఉండగా 2019 నవంబర్ 23న తనిఖీలు నిర్వహించి 42,676 క్యూబిక్ మీటర్ల మేర రా యిని అనుమతి లేకుండా విక్రయించినట్లు ని ర్థారించి రూ.87.45 కోట్ల జరిమానా వేసింది.
♦అదే గ్రామంలో అంకమచౌదరి పేరుతో సర్వేనంబర్ 103లో 4 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్వారీలో 43,865 క్యూబిక్ మీటర్ల రాయిని కూడా అక్రమంగా తరలించినట్టు గుర్తించిన విజిలెన్స్ బృందం తనిఖీలు చేసి రూ .54. 23 కోట్లు జరిమానా వేసింది.
♦ఇదే గ్రామ పరిధిలో కిశోర్ గ్రానైట్స్ పేరుతో 3.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో కూడా 42,056 క్యూబిక్ మీటర్ల అక్రమ తవ్వకాలు చేయడంతో రూ.87.30 కోట్లు జరిమానా వేశారు.
♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద కిశోర్‡ గ్రానైట్స్ పేరుతో గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉండగా 19,752 క్యూబిక్ మీటర్ల మేర తరలించినట్లు గుర్తించిన విజిలెన్స్ రూ.45.68 కోట్లు అపరాధ రుసుం వి ధించింది. మొత్తంగా రూ.274.66 కోట్ల ప న్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.
♦ఆయన ఎటువంటి పన్నులు, జరిమానాలను చెల్లించకపోవడంతో చాలా క్వారీల లీజులను రద్దు చేసింది. దీంతో గొట్టిపాటి ఈ అంశంపై హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment