quarries
-
కోట్లు కొల్లగొట్టి అక్రమాల్లో ఘనా'పాటి'
అక్రమాల్లో ఆయన ఘనాపాటి. అవినీతి పనులకు పెట్టింది పేరు. ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టడంలో దిట్ట. ఆయనే బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని క్వారీల నుంచి అక్రమంగా గ్రానైట్ తరలించి కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి దానినుంచి బయటపడేందుకు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. ఈ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. వందలకోట్ల మేర అక్రమ రవాణా జరిగినట్టు నిర్ధారణ అయింది. రూ. 275కోట్ల అపరాథ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని ఎలా ఎగ్గొట్టాలా అని ఇప్పుడు చూస్తున్నారు. ఆది నుంచి అవినీతిలో ఆరితేరి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారంటూ గొట్టిపాటిపై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఆయన తమ్ముడు కిశోర్‌రెడ్డితో మంతనాలు చేసి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే లోకేశ్‌ను కలిసి అక్రమ రవాణా వ్యవహారంపై ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గొట్టిపాటి అక్రమాల చిట్టా... ♦ ఎమ్మెల్యే గొట్టిపాటికి సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 20 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆరు క్వారీలు ఉన్నాయి. ఇవికాక బినామీలతో మరికొన్నింటిని నడుపుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ప్రాంతంలోనే కాక ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన గొట్టిపాటి టీడీపీలో చేరాక పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేసినట్లు ఆధారాలతో సహా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ విభాగం నిర్థారించింది. ♦ బల్లికురవ మండలం కొణిదెలలో కిశోర్ స్లాబ్ అండ్ టైల్స్ పేరుతో 6.4 హెక్టార్లలో గ్రానైట్ క్వారీ ఉండగా 2019 నవంబర్ 23న తనిఖీలు నిర్వహించి 42,676 క్యూబిక్ మీటర్ల మేర రా యిని అనుమతి లేకుండా విక్రయించినట్లు ని ర్థారించి రూ.87.45 కోట్ల జరిమానా వేసింది. ♦అదే గ్రామంలో అంకమచౌదరి పేరుతో సర్వేనంబర్ 103లో 4 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్వారీలో 43,865 క్యూబిక్ మీటర్ల రాయిని కూడా అక్రమంగా తరలించినట్టు గుర్తించిన విజిలెన్స్ బృందం తనిఖీలు చేసి రూ .54. 23 కోట్లు జరిమానా వేసింది. ♦ఇదే గ్రామ పరిధిలో కిశోర్ గ్రానైట్స్ పేరుతో 3.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో కూడా 42,056 క్యూబిక్ మీటర్ల అక్రమ తవ్వకాలు చేయడంతో రూ.87.30 కోట్లు జరిమానా వేశారు. ♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద కిశోర్‡ గ్రానైట్స్ పేరుతో గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉండగా 19,752 క్యూబిక్ మీటర్ల మేర తరలించినట్లు గుర్తించిన విజిలెన్స్ రూ.45.68 కోట్లు అపరాధ రుసుం వి ధించింది. మొత్తంగా రూ.274.66 కోట్ల ప న్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ♦ఆయన ఎటువంటి పన్నులు, జరిమానాలను చెల్లించకపోవడంతో చాలా క్వారీల లీజులను రద్దు చేసింది. దీంతో గొట్టిపాటి ఈ అంశంపై హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు. -
ఏపీ: అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: అనకాపల్లి ప్రాంతంలో బడా కంపెనీలు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం విరుచుకుపడింది. రాష్ట్రంలోని అన్ని విజిలెన్స్ బృందాలు అక్కడకు చేరుకుని మూడురోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో నవయుగ కన్స్ట్రక్షన్స్, మధుకాన్, వాణి గ్రానైట్స్ కంపెనీల అరాచకాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 15 రోడ్ మెటల్ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అందులో 10 నవయుగ కంపెనీవే. అనకాపల్లి మండలం ఊడేరు సర్వే నంబరు 211లో నవయుగ కంపెనీకి 10 క్వారీలున్నాయి. వీటికి సంబంధించి 35 హెక్టార్లలో తవ్వకాలు జరుపుతున్నారు. 2 జెయింట్ క్రషర్స్‌తో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్నారని అధికారులు గుర్తించారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ తవ్వకానికి రాయల్టీ కట్టారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారో లెక్కిస్తున్నారు. రాయల్టీ కట్టిన దానికంటె ఎక్కువగా పెద్దస్థాయిలో తవ్వినట్లు తేలింది. ఈ క్వారీల్లో ఇంకా అనేక ఉల్లంఘనలను నిర్ధారించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీకి అనకాపల్లి మండలం మార్టూరులో సర్వే నంబర్ 1లో ఉన్న 3 క్వారీల్లో అక్రమాలు గుర్తించారు. ఈ క్వారీల్లో 50 అడుగుల లోతువరకు నీళ్లు ఉండడంతో ఎంత మెటల్ తవ్వారో కొలవడం ఇబ్బందికరంగా మారింది. అనుమతి లేకుండా చాలాలోతు నుంచి పేలుళ్లు జరిపి తవ్వకాలు జరపడంతో భారీగోతులు ఏర్పడ్డాయి. ఇలాంటిచోట ఎంత మెటల్ తవ్వారో లెక్కించడానికి బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ ప్రాసెస్ స్టేషన్ (ఈపీఎస్) పరికరంతో తవ్వకాలను కొలుస్తారు. డీజీపీఎస్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. కానీ మధుకాన్ క్వారీల్లో వాటితో కొలతలు వేయడానికి వీల్లేని స్థాయిలో తవ్వకాలు జరపడంతో సముద్రంలో ఇసుక డ్రెడ్జింగ్ సమయంలో ఉపయోగించే బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం సర్వే నంబరు 109లో వాణి గ్రానైట్స్ తనకున్న రెండు క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ 15 క్వారీల్లో డ్రోన్ సర్వే కూడా చేయనున్నారు. మొత్తం 25 క్వారీలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మొదట ఈ 15 క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. 2, 3 రోజుల్లో వీటిలో తనిఖీలు పూర్తిచేసి అక్రమాలను రికార్డు చేసి జరిమానా విధించనున్నారు. ఉల్లంఘనలు మరీ శృతిమించితే అనుమతుల రద్దుకు సిఫారసు చేసే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. అధికారుల సహాయ నిరాకరణ వైఎస్సార్ కడప–చిత్తూరు, కర్నూలు–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు–గుంటూరు, కృష్ణా–తూర్పు–పశ్చిమగోదావరి,విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మైనింగ్ విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వాటికి నేతృత్వం వహించిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వారం, పదిరోజులు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తనిఖీలు ఆపేందుకు ఆయా కంపెనీలు స్థానిక రాజకీయ నాయకుల నుంచి విజిలెన్స్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. స్థానిక మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం. ఫైళ్లు ఇవ్వకపోవడంతోపాటు విజిలెన్స్ బృందాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలిసింది. అక్రమార్కులను వదలం గనుల్లో అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరపాలి. ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఉత్తరాంధ్రలో మైనింగ్ తవ్వకాలు చాలాచోట్ల ఇష్టారీతిన జరుగుతున్నాయి. విజిలెన్స్ బృందాల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమార్కులు అందరినీ బయటకులాగి చర్యలు తీసుకుంటాం. – వి.జి.వెంకటరెడ్డి, మైనింగ్ డైరెక్టర్ -
హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు
సాక్షి, మడకశిర: ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్ నిర్వహిస్తున్న మెటల్ క్వారీలపై బుధవారం కర్నూలుకు చెందిన గనుల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గనుల శాఖ డీడీ రాజశేఖర్ అదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు కొండారెడ్డి, వెంకటకృష్ణప్రసాద్‌లు మడకశిర మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సర్వే నంబర్ 622లోని ఎమ్మెల్సీ సోదరుల క్వారీల్లో తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ సోదరులు హద్దులు దాటి భారీగా తవ్వకాలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధరుసుం వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. నియోజవర్గంలోని అన్ని మెటల్, గ్రానైట్ క్వారీలను తనిఖీ చేస్తామన్నారు. రాయల్టీ చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతున్న క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
గుండెల్లో పేలుళ్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: భారీ పేలుళ్లు.. అడ్డగోలుగా యంత్రాలతో తవ్వకాలు.. రేయింబవళ్లు దూసుకెళుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లతో క్వారీల ప్రాంతాల్లో ప్రజల గుండెలు అదురుతున్నాయి. అనుమతి నుంచి బ్లాస్టింగ్ చేసే వరకు క్వారీల నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. కూలీల రక్షణను గాలికి వదిలేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు రాలేదు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన భారీ యంత్రాలను సీజ్ చేయడంగానీ, మందు గుండు సామగ్రి సరఫరాపై చర్యలుగానీ తీసుకోలేదు. వణుకు పుట్టిస్తున్న బ్లాస్టింగ్స్ పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల్లో పేలుడు పదార్థాలతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి. మైనింగ్ లీజు ఉన్న కొంత మందిని అడ్డు పెట్టుకుని.. పేలుడు పదార్థాలను వారి పేరు మీద తీసుకుంటున్నారు. శిక్షణలేని కార్మికులతో 20 అడుగుల లోతులో బ్లాస్టింగ్ చేయిస్తున్నారు. నాలుగేళ్లలో సుమారుగా లక్ష మెట్రిక్ టన్నుల తెల్లరాయి తవ్వేశారు. దీనికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాల్లో 295 క్వారీలు, 60 గ్రానైట్, 7 మోజాక్, 17 గ్రావెల్, 102 స్టోన్‌క్రషర్స్ ఉన్నాయి. జిల్లా మొత్తంలో ఆరుగురికి మాత్రమే బ్లాస్టింగ్ అనుమతి లైసెన్సులు ఉన్నట్టు సమాచారం. అడ్డదారుల్లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్లను తీసుకొచ్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ ఊసే లేదు కార్మికులకు మైన్స్ సేఫ్టీ నిబంధనల ప్రకారం గ్రూపు ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది ఎక్కడా అమలు కావడం లేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రీమియం ఎక్కువగా ఉందని చాలామంది కార్మికులకు లీజుదారులు బీమా చేయడం లేదు. అమ్మోనియా వాడకానికి ప్రాధాన్యం డిటోనేటర్‌లో లెడ్ ఆక్సైడ్ అనే పేలుడు పదార్థం ఉంటుంది. దాన్ని కేవలం చేతితో రాపిడి చేస్తే పేలుతుంది. జిలెటిన్ స్టిక్స్ వైర్లు కలిపి పేల్చాలి. ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యంతోపాటు శ్రమతో కూడు కున్నది. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ పొడిని రంధ్రాల్లో కూర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ మంది క్వారీ యజమానులు ఈ పద్ధతికి అలవాటు పడా ్డరు. పిడుగురాళ్లకు చెందిన ఇసాక్ అనే వ్యా పారి తెలంగాణాలోని నల్లగొండ వైపుగా అ డ్డదారుల్లో అమ్మోనియాను జిల్లాకు తరలిం చి వ్యానులో యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా ? ఫిరంగిపురం మండలం గొల్లపాలెం క్వారీలో గత ఏడాది మే 27న బ్లాస్టింగ్ కోసం ప్రయత్నిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ సమయంలో ఉపయోగించిన పేలుడు పదార్థాలకు అనుమతులు లేవు. అప్పటి నుంచి మందు గుండు సామగ్రి రవాణా, నిల్వలపై ఆరా తీసిన వారు లేరు. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాక్.. మైనింగ్ క్వారీలు సీజ్
సాక్షి, చీరాల : టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. పలు మైనింగ్, ఇసుక క్వారీలను సీజ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, అధికార టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారంటూ పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలో ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ ఇటీవల అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి వర్గీయులు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి. అంతేకాదు అదే పార్టీకి చెందిన పలువురు నేతలను సైతం బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు నేతలు సైతం ఆమంచి క్వారీయింగ్‌పై పలు ఆరోపణలు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ మైనింగ్‌పై దృష్టిపెట్టారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు. ఈదాడుల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. -
దొనబండ క్వారీలో విషాదం
విజయవాడ : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ క్వారీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తున్న ఇద్దరు కార్మీకులు 100 అడుగులపై నుంచి కిందపడ్డారు. దీంతో రూబెన్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచర కార్మికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టు మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొండలు కరిగించి..కోట్లు కొల్లగొట్టి..
క్వారీల్లో బినామీల కాసుల వేట యంత్ర పరికరాలు సీజ్ చేసిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అక్రమార్కుల యత్నాలు రంపచోడవరం :అమాయక గిజనుల పేరిట లీజులు సంపాదిస్తున్న బడాబాబులు అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తూ దర్జాగా కాసుల వేట సాగిస్తున్నారు. కొండలు కరిగించేసి దర్జాగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదంతా నిజమేనని నిర్ధారిస్తున్న అధికారులు కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అడ్డతీగల మండలం పులిగోగులపాడు పరిసరాల్లో సర్వే నంబర్-24లో ఉన్న నల్ల మెటల్ క్వారీయే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ క్వారీ నిర్వహణకు లీజు మంజూరైంది. కానీ దీనిని బినామీలు నడుపుతూ, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని గత ఏడాది ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి రంపచోడవరం సబ్‌కలెక్టర్ గంధం చంద్రుడు ఈ క్వారీని తనిఖీ చేశారు. బినామీల ఆధ్వర్యంలోనే క్వారీ నడుస్తున్నట్లు తేల్చి, క్వారీ లీజు రద్దు చెయ్యాలని సూచిస్తూ మైనింగ్ శాఖకు నివేదిక పంపించారు. కొద్ది రోజులు పనులు నిలిపివేసిన బినామీదారులు క్వారీని తిరిగి ప్రారంభించారు. దీనిపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గనుల శాఖ డెరైక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లీజు పొందిన ప్రాంతంతోపాటు అనుమతి లేని ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరుపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆరు నెలల క్రితం తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలు వాస్తవమేనని తేల్చారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులను మేనేజ్ చేసుకుని ఈ క్వారీలో నల్లమెటల్ను బినామీదారులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ జీవీ సత్యవాణి నాలుగు రోజుల క్రితం క్వారీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నల్లమెటల్ సేకరణకు వాడుతున్న యంత్ర పరికరాలను సీజ్ చేశారు. కాగా బినామీదారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, క్వారీని యథాతథంగా నడుపుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలియవచ్చింది. -
టోకరా!
నిర్ధారించిన భూగర్భ వనరుల శాఖ 10 కంపెనీలకు రూ.2.59 కోట్ల జరిమానా చెల్లించినవి.. రూ.66 లక్షలు చెల్లించాల్సింది.. రూ.1.93 కోట్లు చెల్లింపులపై కంపెనీల దాటవేత వరంగల్ : ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం, నిమ్మానగర్లో ఎర్రమట్టి గనులు ఉన్నాయి. అనుమతి పొందిన సంస్థల యజమానులు క్వారీలు నిర్వహిస్తున్నారు. తమ పరిధిని దాటి అనుమతి ఇవ్వని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. ఈ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో భూగర్భ వనరుల శాఖ అధికారులు ఎర్రమట్టి క్వారీలపై సర్వే నిర్వహించారు. అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న 10 సంస్థల యజమానులకు 2012లో దశలవారీగా నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థలకు అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు రూ.2.59 కోట్లు జరిమానా విధించారు. మూడు సంస్థలు చెల్లింపులు పూర్తి చేశాయి. మరో మూడు సంస్థలు చెల్లించలేదు. మరో నాలుగు సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. చెల్లింపుల విషయంలో దశలవారీగా పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తి మేరకు భూగర్భ వనరుల శాఖ రాష్ట్ర కార్యాలయం అనుమతి ఇచ్చింది. అయినా ఇప్పటివరకు ఈ చెల్లింపులు పూర్తి కాలేదు. రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వంలోని గనుల శాఖను ఆశ్రయించగా.. మరో రెండు హైకోర్టును ఆశ్రయించాయి. మరో రెండు కొంత మొత్తాన్ని చెల్లించి ఆగిపోయాయి. ఏడు సంస్థల నుంచి ఇంకా రూ.1.93 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా చెల్లింపు అంశం ఎప్పుడు తేలుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ఇసుక బంగారుమాయె
ఎక్కడి పనులు అక్కడే... స్తంభించిన నిర్మాణ రంగం పస్తులుంటున్న కూలీలు లారీ ఇసుక రూ. 32వేలు ! విజయవాడ : ఇసుక దొరక్క జిల్లాలో ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఓ పక్క నిర్మాణరంగం స్తంభించిపోగా, మరో వైపు పనులు లేక లక్షలాది మంది తాపీ కార్మికులు అగచాట్లు పడుతున్నారు. ఫలితంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచి పోతున్నాయి. పట్టణాలు గ్రామాల్లో ఇళ్లు, భవన నిర్మాణాలు చతికల పడ్డాయి. ప్రభుత్వ కట్టడాలకు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా ఇసుక కొరత కారణంగా నిలిచిపోయాయి. ఇంటి నిర్మాణానికి ప్రధానంగా అవసరమైన ఇసుక రేటు మూడు రెట్లు పైగా పెరిగింది. మూడు మాసాల క్రితం లారీ ఇసుక రూ. 12వేలు ఉండగా ప్రస్తుతం రూ. 32 వేలకు కూడా దొరకడం లేదు. ఓ సాధారణమైన మూడు గదుల ఇల్లు నిర్మించేందుకు మూడు లారీల ఇసుక అవసరం అవుతోంది. దాని విలువ దాదాపు రూ. 1లక్ష ఖర్చుఅవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం పెనుభారంగా మారడంతో నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇనుము రేటు కంటే అధికంగా ఉన్న ఇసుకను కొనుగోలు చేయటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని ప్రజానీకం వాపోతున్నారు. జిల్లాలో దాదాపు లక్షన్నర మంది టాఫీ కార్మికులుగా పనిచేస్తున్నారు. మరో 50 వేల మంది వరకు నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఇటుక బట్టీలు, పెయింటింగ్, రాడ్‌బెండింగ్, కార్పెంటర్ , మార్బుల్స్, తదితర వృత్తుల్లో పని చేస్తున్నారు. అవి కూడా మూత పడ్డాయి. విజయవాడ నగరంతో పాటు జిల్లాలో ప్రధాన పట్టణాలైన మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేటలో నిర్మాణ రంగం పనులు చతికిల పడ్డాయి. ఏడాదిగా మూతపడిన క్వారీలు ... గత ఏడాది కాలంగా జిల్లాలో ఉన్న 72 ఇసుక క్వారీలు మూతపడ్డాయి. దాంతో ఇసుక కొరత తీవ్రమయ్యింది. కొంత కాలం దొంగచాటుగా క్వారీలు నిర్వహించారు. ఇసుక క్వారీల్లో మిషనరీలతో తవ్వవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతకు ముందు జిల్లా అంతటా మిషన్లతో కాంట్రాక్టర్లు, సిండికేట్ అయి ఇష్టారాజ్యంగా తవ్వేసి ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండికొట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మిషన్లతో తవ్వవద్దని ఆదేశించడంతో క్వారీలు మూతపడ్డాయి. కొద్ది రోజులుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు ఇసుక లారీలు వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి చాటుమాటుగా ఇసుక రావడంతో అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కొత్త పాలసీ అమలు ఎప్పుడో... కాగా ప్రభుత్వం ఇసుక తవ్వకాలను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పే కొత్త పాలసీని ప్రకటించింది. కొత్త చట్టం జిల్లాలో ఎప్పటి నుంచి అమలవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. డ్వాక్రా సంఘాల ముసుగులో కాంట్రాక్టర్లు రంగ ప్రవేశమయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇసుక క్వారీలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు హడావుడి పడుతున్నట్లు సమాచారం. పొలిటికల్ మాఫియా తయారవుతుంది : సీఐటీయూ కాగా టీడీపీ ప్రభుత్వం కొత్తగా రూపొందించే డ్వాక్రా సంఘాలకు ఇసుక అమ్మకాలు అప్పగిస్తే పొలిటికల్ మాఫియా పెరుగుతుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వి. కృష్ణ అన్నారు. గతంలో కంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి ఇసుక తవ్వకాలు సాగించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టరని చెప్పారు. డ్వాక్రా సంఘాల ముసుగులో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.