శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ | Sale of infants gang arrested | Sakshi
Sakshi News home page

శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Published Wed, Dec 20 2017 3:33 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Sale of infants gang arrested

హైదరాబాద్ : శిశు విక్రయాలు జరుపుతున్న ఓ ముఠాను బాలల హక్కుల సంఘం అధికారులు, ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం నిందితులను సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు  ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు  బాలల హక్కుల సంఘం అధికారులకు తెలియడంతో, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు.

ఈ ముఠా వద్ద నుంచి రూ.80 వేల నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ లిమిట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణలో మరి కొందరు ముఠా సభ్యులు బయట పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement