Sale baby
-
కడుపులో ఉండగానే.. బిడ్డ అమ్మకానికి ఒప్పందం?
నిజామాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది. అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్‌కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు. -
రంగారెడ్డిలో శిశు విక్రయం
-
రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు
కంటోన్మెంట్: ఆరు నెలల బాలుడిని అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బోయిన్పల్లి పోలీసులు బాధిత బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు... నిజామాబాద్ జిల్లా వార్షి మండలం, మున్సాపూర్‌కు చెందిన సీహెచ్. ప్రసాద్ (40) నగరంలోని లంగర్ హౌజ్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఉండగా, కొడుకు కావాలన్న కోరికతో ఉన్నాడు. శనివారం రాత్రి నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రసాద్, మద్యం తాగి రాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో నిద్రించాడు. మరుసటి ఉదయం బస్టాండ్ ఆవరణలోని యాచకుల ఆధీనంలో కొందరు చిన్నారులు ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న ఆరు నెలల బాబును తనకు ఇవ్వాల్సిందిగా యాచకురాలిని అడగ్గా, రూ.10 వేలు ఇస్తే బాబును ఇస్తానని ఆమె తెలిపింది. చివరకు రూ.4వేలు యాచకురాలికి ఇచ్చిన ప్రసాద్ బాబును తీసుకుని నగరానికి బయలుదేరాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు న్యూబోయిన్‌పల్లి బస్టాప్‌లో దిగిన ప్రసాద్ అనుమానాస్పద కదలికలను గమనించిన బోయిన్పల్లి ఏఎస్ఐ వీరయ్య అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించారు. బాలుడిని యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించిన పోలీసులు, ప్రసాద్‌పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రసాద్‌కు బాలుడిని అమ్మిన యాచకురాలి కోసం గాలిస్తున్నారు. -
శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : శిశు విక్రయాలు జరుపుతున్న ఓ ముఠాను బాలల హక్కుల సంఘం అధికారులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం నిందితులను సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు బాలల హక్కుల సంఘం అధికారులకు తెలియడంతో, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ ముఠా వద్ద నుంచి రూ.80 వేల నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ లిమిట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణలో మరి కొందరు ముఠా సభ్యులు బయట పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మకానికి ఆడపిల్ల
కన్నవారికి పదివేలిచ్చి రూ.50 వేలకు అమ్ముకున్న మధ్యవర్తి యాచారం: కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే పసిపాప అమ్మకానికి గురైంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మధ్యవర్తి రూ.10 వేలిచ్చి, ఆ పసికందును రూ.50 వేలకు అమ్ముకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సర్దార్‌తండాకు చెందిన శిరీష, రవిలకు ఇద్దరు ఆడపిల్లలు. 4 రోజుల క్రితం శిరీష దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరికి బంధువైన కేతావత్ చక్రి అనే మహిళ హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉంటోంది. శిరీష, రవిలకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని అమ్మకానికి ఒప్పించింది. సోమవారం రాత్రి 4 రోజుల పసిపాపను తల్లిదండ్రుల నుంచి తీసుకుని రూ. 50 వేలకు వేరే వారికి అమ్మేసింది. పాప తల్లిదండ్రులకు మాత్రం రూ.10 వేలే ఇచ్చింది. అనంతరం పాపతోపాటు ఆమెను కొన్నవారితో ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. విషయం బయటపడ టంతో పోలీసులు సాగర్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. చక్రితోపాటు పాపను కొనుగోలు చేసిన సునీత, ధనలక్ష్మి, రవికిరణ్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పసికందును శిశువిహార్‌కు తరలించారు.