అమ్మకానికి ఆడపిల్ల | A Sale of baby girl! | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆడపిల్ల

Published Wed, Aug 3 2016 6:32 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

అమ్మకానికి ఆడపిల్ల

అమ్మకానికి ఆడపిల్ల

కన్నవారికి పదివేలిచ్చి రూ.50 వేలకు అమ్ముకున్న మధ్యవర్తి
యాచారం: కళ్లు తెరిచి లోకాన్ని చూడకుండానే పసిపాప అమ్మకానికి గురైంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మధ్యవర్తి రూ.10 వేలిచ్చి, ఆ పసికందును రూ.50 వేలకు అమ్ముకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సర్దార్‌తండాకు చెందిన శిరీష, రవిలకు ఇద్దరు ఆడపిల్లలు. 4 రోజుల క్రితం శిరీష దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరికి బంధువైన కేతావత్ చక్రి అనే మహిళ హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉంటోంది.

శిరీష, రవిలకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని అమ్మకానికి ఒప్పించింది. సోమవారం రాత్రి 4 రోజుల పసిపాపను తల్లిదండ్రుల నుంచి తీసుకుని రూ. 50 వేలకు వేరే వారికి అమ్మేసింది. పాప తల్లిదండ్రులకు మాత్రం రూ.10 వేలే ఇచ్చింది. అనంతరం పాపతోపాటు ఆమెను కొన్నవారితో ఓ ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు బయల్దేరింది. విషయం బయటపడ టంతో పోలీసులు సాగర్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. చక్రితోపాటు పాపను కొనుగోలు చేసిన సునీత, ధనలక్ష్మి, రవికిరణ్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. పసికందును శిశువిహార్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement