ప్రేమజంటపై పెద్దల దాష్టీకం.. పెళ్లైన రెండు రోజులకే.. | Karnataka: Newly Married Couple Attack By Girl Parents | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై పెద్దల దాష్టీకం.. పెళ్లైన రెండు రోజులకే..

Published Thu, Mar 31 2022 7:54 AM | Last Updated on Thu, Mar 31 2022 8:04 AM

Karnataka: Newly Married Couple Attack By Girl Parents - Sakshi

మైసూరు(బెంగళూరు): రెండేళ్లపాటు ప్రేమించుకున్న ప్రేమ జంట పెళ్ళి జరిపించాలని పెద్దలను కోరగా ససేమిరా అన్నారు. దీంతో ఆ జంట పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకోగా పెద్దలు వచ్చి విడదీశారు. హుణసూరులో ఈ సంఘటన జరిగింది. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్, చోళెనహళ్లివాసి అనన్య ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు. దాంతో హుణసూరు పోలీసులను సంప్రదించి మంగళవారం ఒక ఆలయంలో మూడుముళ్లు వేసుకున్నారు. ఇది తెలిసి అనన్య తల్లిదండ్రులు, బంధువులు బుధవారం మైసూరులో ఆ జంట ఒక కెఫేలో ఉండగా దాడి చేసి కొట్టారు. అనన్యను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో భర్త హుణసూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   

మరో ఘటనలో..

మహిళ ఆత్మహత్య 
హోసూరు: మతి స్థితిమితం కోల్పోయిన మహిళ ఉరివేసుకొన్న ఘటన మంగళవారం రాత్రి బాగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని జి.మంగలం గ్రామానికి చెందిన తోపయ్య భార్య శశికళ (55) ఆరు నెలలుగా మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో ఉండేది. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బాగలూరు పోలీసులు శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: Extramarital Affair: పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement