విజయపుర (బెంగళూరు గ్రామీణ): మహమ్మారి కరోనా వైరస్ వల్ల వేలాది మంది మృత్యువాత పడగా, వారిపై ఆధారపడిన పిల్లలు, పెద్దలూ ఎందరో రోడ్డు పాలయ్యారు. విజయపుర పట్టణంలో సోనియా (12) అనే చిన్నారి పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు కరోనాతో మరణించగా, తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లేక పెద్దమ్మ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తోంది. పట్టణంలోని చిక్కబళ్లాపుర రోడ్డులో ఉన్న చెరువు కట్ట వద్ద ఉంటూ ద్రాక్ష తోటలపై పక్షులు వాలకుండా పరిచే వలలను అల్లే పని చేస్తోంది.
మొదటి వేవ్‌కు కన్నవారు బలి
చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన అన్సార్ బాషా కొన్నేళ్ల క్రితం ఇదే వలలు అల్లే పని కోసం విజయపురకు వచ్చాడు. తనతో పనిచేసే కె.సరిత అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారి బిడ్డ సోనియా. కరోనా మొదటి వేవ్‌లో బాషా, సరితలు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బలయ్యారు. దాంతో చిన్నారి అనాథ అయ్యింది. పట్టణంలోనే పెద్దమ్మ వద్ద ఉంటూ ఆమెతో కూలీ పనులకు వెళ్తోంది. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చినప్పుడల్లా విలపిస్తుంది. తనకు కూడా చదువుకోవాలని ఉందని, ప్రభుత్వం కానీ, దాతలు కానీ సహాయం చేయాలని బాలిక వేడుకుంది.
(చదవండి: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ )
Comments
Please login to add a commentAdd a comment