west zone task force
-
టాలీవుడ్ క్లబ్‌పై దాడులు.. అర్ధనగ్న నృత్యాలు, వికృత చేష్టలు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టాలీవుడ్ క్లబ్ పబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లో శుక్రవారం అర్థరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ క్లబ్ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడవడమే కాక.. సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అర్ధనగ్న నృత్యాలు, డీజే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి, నోటీసులు జారీ చేశారు. అయినప్పటికి పబ్ యాజమాన్యం తన తీరు మార్చుకోవడం లేదు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది -
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కండరాల బలం కోసం స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్ సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న జుబైర్.. విదేశాల నుండి స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఏ 1 సప్లమెంట్ స్టోర్స్ పేరుతో స్టెరాయిడ్స్ విక్రయాలు జరుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి మొత్తం రూ. 14 లక్షలు విలువ చేసే స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. -
జూబ్లీహిల్స్‌లో కోడిపందాలు: కోళ్లు, నగదు స్వాధీనం
-
జూబ్లీహిల్స్‌లో కోడిపందాలు: 20 కోళ్లు, నగదు స్వాధీనం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అత్యంత ప్రముఖులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్‌లోనూ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కోడి పందాల స్థావరాలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా 20 పందెం కోళ్ళను స్వాధీనం చేసుకుని 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 25 సెల్ఫోన్లు, రూ.70 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు. -
అతీత శక్తుల పేరుతో నకిలీ బాబా మోసం
-
సికింద్రాబాద్‌లో నకిలీ బాబా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయంటూ పలువురి బంగారాన్ని కాజేసినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీబాబాపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కిలోన్నర బంగారం, రూ. 3 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబాగా చెలామణి అవుతున్న నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఇస్మాయిల్‌గా గుర్తించారు. -
నకిలీ చెక్కులతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరు అరెస్ట్
నగరంలోని జ్యూయలరీ షాపుల్లో పలు మోసాలకు పాల్పడుతున్న హరికృష్ణ, శ్రీనివాసులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ చెక్కు బుక్కులు, క్రెడిట్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యూయలరీ షాపుల్లో బంగారం కొనుగోలు చేసి, అనంతరం నకిలీ చెక్కులతో జ్యూయలరీ షాపు యజమానులను బురిడి కొట్టిస్తున్నారు. దాంతో జ్యూయలరీ షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.