సికింద్రాబాద్‌లో నకిలీ బాబా అరెస్టు | fake baba arrested in secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో నకిలీ బాబా అరెస్టు

Published Sat, Dec 23 2017 3:25 PM | Last Updated on Sat, Dec 23 2017 7:06 PM

fake baba arrested in secunderabad

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న బంగారానికి పూజలు చేస్తే రోగాలు నయమవుతాయంటూ పలువురి బంగారాన్ని కాజేసినట్టు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నకిలీబాబాపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కిలోన్నర బంగారం, రూ. 3 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబాగా చెలామణి అవుతున్న నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఇస్మాయిల్‌గా గుర్తించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement