
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టాలీవుడ్ క్లబ్ పబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లో శుక్రవారం అర్థరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
టాలీవుడ్ క్లబ్ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడవడమే కాక.. సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అర్ధనగ్న నృత్యాలు, డీజే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి, నోటీసులు జారీ చేశారు. అయినప్పటికి పబ్ యాజమాన్యం తన తీరు మార్చుకోవడం లేదు.
చదవండి:
పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్
బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది
Comments
Please login to add a commentAdd a comment