పూజా, కిరణ్ (ఫైల్)
మండ్య: జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్త అంతలోనే దూరం కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్త అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (30), పూజా (22)లకు 11 నెలల క్రితమే వివాహం జరిగింది. బొమ్మనహళ్లిలోనే కాపురం ఉన్నారు.
కిరణ్ గుండెజబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం చనిపోయాడు. బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పూజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతలోనే మరో దారుణంతో ఇరు కుటుంబాలు నిశ్చేష్టులయ్యాయి. కొంతసేపటికి ఆమె మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment