Man Molested His Own Brother’s Daughter in Mandya Got Arrested - Sakshi
Sakshi News home page

Mandya: సొంత అన్న కూతురిపైనే లైంగిక దాడి చేసి..

Published Fri, Sep 3 2021 7:29 AM

Karnataka: Man Molested Own Brother Daughter In Mandya Arrested - Sakshi

మండ్య/కర్ణాటక: మైసూరు దుస్సంఘటనను ప్రజలు మరువక ముందే మండ్య నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. సల్మాన్‌ (32) అనే కామాంధుడు సొంత అన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. గురువారం బాలికను పాఠశాలకు తీసుకెళ్లిన నిందితుడు మధ్యలో నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ముఖంపై గాయాలు చేశాడు. సాయంత్రం బాలికను చూసిన తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా బాబాయ్‌ ఘాతుకాన్ని వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి  సల్మాన్‌ను అరెస్టు చేశారు.  

అత్యాచారాల్ని ఆపండి 
కోలారు: మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతి పర మహిళా సంçఘాల కార్యకర్తలు రోడ్డెక్కారు. గురువారం మెక్కె సర్కిల్‌లో బ్యాడ్జీలు ధరించి ప్రతిఘటన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ విఆర్‌ సుదర్శన్‌ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. దుండగులకు కఠిన శిక్షలు విధించి గట్టి సందేశం పంపాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.   

చదవండి: మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు!

Advertisement
 
Advertisement
 
Advertisement