చెప్పుదెబ్బలు తప్పవు: శ్రీరెడ్డి | Sri Reddy Hits Back On Five Big Families Of Tollywood | Sakshi
Sakshi News home page

చెప్పుదెబ్బలు తప్పవు: శ్రీరెడ్డి

Published Wed, May 9 2018 12:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Sri Reddy Hits Back On Five Big Families Of Tollywood - Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌ను గుప్పిట్లో పెట్టుకుని అంతులేని అక్రమాలకు పాల్పడుతున్న సినీ పెద్దలకు చెప్పుదెబ్బలు తప్పవని నటి శ్రీరెడ్డి హెచ్చరించారు. 24 క్రాఫ్ట్స్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాలకు వ్యతిరేకంగా తాను పోరాడుతూనే ఉంటానని, ఈ క్రమంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కితగ్గబోనని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటలుగా ఈ మేరకు వరుస పోస్టులు పెట్టారామె.

‘‘స్డుడియోల మీద ఎంతెంత సంపాదిస్తున్నారో, డిస్ట్రిబ్యూషన్‌లపై పెత్తనాలు, బడా నిర్మాతల కొడుకుల అకృత్యాలు.. అన్నిటికి అన్ని వ్యవహారాలపై న్యాయపోరాటం చేస్తాం. యూఎఫ్‌ఓ క్యూబ్‌ పేరుతో చిన్న నిర్మాతలు, నటులు, దర్శకుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్న వైనాన్ని బట్టబయలుచేస్తాం. బయటి రాష్ట్రాల వాళ్లకు పరమాన్నం పెడుతూ, స్థానికులను అన్యాయానికి గురిచేస్తున్నారు. మీడియా నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్న తీరును ప్రపంచానికి చాటుతాం. ఇండస్ట్రీ పెద్దలు మారాలి. లేకుంటే వీలైనంత తొందర్లోనే నా చెప్పుదెబ్బలకు రెడీ అవ్వండి. మీలాంటి కుక్కలను కోర్టు బోనులో నిలబెడతాం. ఎన్ని బెదిరింపులు, సెటిల్మెంట్‌ ఆఫర్లు ఇచ్చినా నేను లొంగను. 85 ఏళ్ల ఈ తెలుగు సినిమా పరిశ్రమకు స్వాతంత్ర్యం కల్పించడంలో అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement