
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి.. తాజాగా తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా కామెంట్లు చేసినవారిని కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆమె తన లాయర్ గోపాలకృష్ణ కళానిధితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మహిళ అని చూడకుండా శ్రీరెడ్డిపై అసభ్య వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టారని, అంతేకాకుండా ఆ వీడియోలపై అసభ్యంగా కామెంట్లు చేశారని, వారందరినీ కోర్టుకు లాగుతామని ఆమె లాయర్ తెలిపారు. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ.. బెదిరిస్తూ కామెంట్లు పెట్టిన వారిపై కేసులు పెట్టబోతున్నామని తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కేసులో మా అసోసియేషన్, జూనియర్ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇలా ఎవరు ఆమెపై కామెంట్ చేసినా వారిపై కేసులు పెడతామని, వారిపై క్రిమినల్, సైబర్ యాక్ట్ కింద అభియోగాలు నమోదుచేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment