హైదరాబాద్: తనపై వస్తోన్న విమర్శలకు ఘాటుగా బదులిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో బాణం విసిరారు. ఇప్పటివరకు ఆయా వ్యక్తుల పేర్లు వెల్లడిస్తూ ఎదురుదాడి చేసిన ఆమె.. ఇప్పుడు ఏ ఒక్కరి పేరునూ ప్రస్తావించకుండా చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘ఇది ఖచ్చితంగా పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్(పీపీడీ) అనే మానసిక వ్యాధి’ అని, ‘ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్తుడినని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంద’ని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి అంటూ ఆరు పాయింట్లు రాసుకొచ్చారు.
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన శ్రీరెడ్డి ఆక్రమంలో ఫిలిం చాంబర్ ఎదుట చేపట్టిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పలు మహిళా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగించిన శ్రీరెడ్డి ప్రస్తుతం చట్టపరంగా ముందుకు వెళ్ళే యోచనలో ఉన్నారు. శ్రీరెడ్డి నిరసన తర్వాత దఫదఫాలుగా స్పందించిన సినీ పెద్దలు.. ఇండస్ట్రీలో లైంగిక దాడులను అరికట్టే దిశగా కమిటీలు వేయనున్నట్లు పేర్కొనడం విదితమే.
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ ఇది..
Comments
Please login to add a commentAdd a comment