
చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు అందజేస్తున్న శ్రీరెడ్డి
హైదరాబాద్ : సినీ రంగంలో మహళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నటి శ్రీరెడ్డి వివిధ మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నంకు శుక్రవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు చేస్తానన్నారు.
మహిళా ఆర్టిస్ట్‌లకు ఉపాధి, భద్రత కల్పించాలని.. దళారీ వ్యవస్థను నివారించాలని కోరారు. తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే కొనసాగుతోందని, దీంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించడం లేదని మహిళా సంఘం నాయకురాలు సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీరంగ పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసా ్తనని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment