తెలుగు డైరెక్టర్‌ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు: నటి | Telugu Filmmaker Tried To Block Me From Leaving His Room: Mita Vashisht: | Sakshi
Sakshi News home page

Mita Vashisht: గదికి గడియ పెట్టాడు.. రెండు నెలలు తనతో ఉంటే హీరోయిన్‌గా ఛాన్స్‌..!

Published Fri, Aug 2 2024 8:59 AM | Last Updated on Fri, Aug 2 2024 9:16 AM

Telugu Filmmaker Tried To Block Me From Leaving His Room: Mita Vashisht:

ఓ తెలుగు డైరెక్టర్‌ వల్ల తాను ఇబ్బందిపడ్డానంటోంది నటి మీఠా వశిష్ట్‌. సినిమాలో హీరోయిన్‌గా ఛాన్సిస్తానని ఆశ చూపి తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి భయంకర సంఘటనను గుర్తు చేసుకుంది. మీఠా మాట్లాడుతూ.. ఓ తెలుగు దర్శకుడు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) తన సినిమాలో ప్రధాన పాత్ర ఆఫర్‌ చేశాడు. 

కండీషన్‌
అంతకుముందు ఆయన సినిమాలో నటించిన హీరోయిన్‌కు జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు నాకు హీరోయిన్‌ ఆఫర్‌ ఇవ్వగానే సంతోషపడ్డాను. కానీ ఆ ఆనందం ఇట్టే ఆవిరైంది. తనతో రెండు నెలలపాటు కలిసుండాలని కండీషన్‌ పెట్టాడు. సినిమా గురించి కలిసి జర్నీ చేయాలంటున్నాడేమో.. తన ఇంగ్లీష్‌ అర్థం కాక నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమే! అని భ్రమపడ్డాను.

ఆఫర్‌ రిజెక్ట్‌
దీంతో అతడు మరోసారి.. రెండు నెలలదాకా తనతోనే కలసి జీవించాలని స్పష్టంగా చెప్పాడు. అది కుదరదని ముఖం మీదే చెప్పాను. ఆఫర్‌ రిజెక్ట్‌ చేసి బయటకు వస్తుంటే గదికి గడియ పెట్టి నన్ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. అయినా తన నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటకు వచ్చేశాను. తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురవలేదు. 

స్పష్టంగా చెప్పేశా
ఎందుకంటే.. అవకాశాల కోసం దిగజారలేనని అందరికీ స్పష్టంగా చెప్పాను. నా నిర్ణయాన్ని కొందరు దర్శకులు గౌరవించి మూవీ ఆఫర్స్‌ ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. మీఠా వశిష్ట్‌.. ఇడియట్‌, ఇంగ్లీష్‌ ఆగస్ట్‌, డ్రోహ్‌కాల్‌, ల్‌ సే, తాల్‌, మాయ, కుచ్‌ ఖట్టి కుచ్‌ మీఠి, ఊప్స్‌, కాగజ్‌, రహస్య, గంగూభాయ్‌,గుడ్‌ లక్‌ జెర్రీ వంటి హిందీ చిత్రాల్లో నటించింది.

చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement