నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్‌ | Geetu Royal in Tears After Losing Her Pet Cat Oreo | Sakshi
Sakshi News home page

నా బిడ్డను చంపేశారంటూ రోదించిన గీతూ రాయల్‌.. వాళ్ల నిర్లక్ష్యం వల్లే..!

Aug 2 2024 7:16 AM | Updated on Aug 2 2024 8:57 AM

Geetu Royal in Tears After Losing Her Pet Cat Oreo

బిగ్‌బాస్‌ ఫేమ్‌ గీతూ రాయల్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన పెంపుడు పిల్లి ఓరియో చనిపోయిందని, ఈ బాధను తట్టుకోలేకపోతున్నానంటూ బోరున విలపించింది. ఓరియో బంగారం.. నా బిడ్డ లేదు.. ఐ లవ్యూ.. అంటూ చివరిసారి తనను సమాధి చేస్తూ ఏడ్చేసింది. తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఆరోజు ఇంటికి రాలేదు
2021, డిసెంబర్‌ 13న ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్లిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది. దీనికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదు. రోజూలాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయట వీధిలోకి వెళ్లింది. 5.30 కల్లా ఇంటికి తిరిగొచ్చేది. కానీ ఆరోజు రాలేదు. సాయంత్రం నాలుగు వరకు వెతుకుతూనే ఉన్నాం.

నా బిడ్డను చంపేశాయి
చివరికి అది చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలకు వచ్చాయి. నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత భయపడిపోయిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం.. దాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నాను. 

బొచ్చు కావాలన్న గీతూ
ఓరియో నాన్న... వీలైతే తిరిగొచ్చేయు బంగారుకొండ.. మమ్మా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది అని రాసుకొచ్చింది. గీతూకు ఓరియో అంటే ఎంతిష్టమో చాలాసార్లు చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడగడం అప్పట్లో తెగ వైరలయింది.

 

 

చదవండి: బన్నీ... హనీ... భారీ ఫైట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement