తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.
హీరోయిన్ కోసమే సినిమా చూశా..
కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్‌గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.
సన్నబడింది.. కానీ!
అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్‌ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్‌లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు.
పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు.
(చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)
20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
హీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.
ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్
రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు.
Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRao
It’s a wrong example to set & we should have been cautious to avoid it
Trinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,
We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025
Comments
Please login to add a commentAdd a comment