Womens Commission
-
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.హీరోయిన్ కోసమే సినిమా చూశా..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)20 ఏళ్ల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు. Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRaoIt’s a wrong example to set & we should have been cautious to avoid itTrinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025 చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
సీఎంఆర్ కాలేజీపై మహిళా కమిషన్ సీరియస్
మేడ్చల్ రూరల్: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినులు గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. కళాశాల క్యాంటీన్లో పనిచేసే యువకులు బుధవారం గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో మొబైల్ ఫోన్లు ఉంచి విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం నుంచి ఆందోళన చేపట్టారు.విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలపటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.. కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ కళాశాలలో గురువారం విచారణ జరిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను కూడా కమిషన్ ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం హాస్టల్ బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు హాస్ట ల్ వార్డెన్ ప్రీతిరెడ్డికి తెలిపారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన వార్డెన్.. తమనే తప్పుపడుతూ దురుసుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. వీడియోలు తీయటానికి ప్రయత్నించింది హాస్టల్ మెస్‌లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులే అని తెలుపగా.. మీరే మగవారిని చూసి అలా ప్రవర్తిస్తున్నారని వార్డెన్ దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం బయటకు చెప్తే మీ వీడియోలు కూడా బయటకు వెళ్తాయని వార్డెన్ అనటంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. పరిస్థితి విషమించటంతో వార్డెన్ బుధవారం అర్ధరాత్రే అక్కడి నుండి దొడ్డిదారిన వెళ్లిపోయింది. పోలీసుల అదుపులో వార్డెన్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెస్‌లో పనిచేసే ఐదుగురితోపాటు హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, మెస్ ఇన్చార్జి సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విషయంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించిందని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హాస్టల్ బాత్రూంల సమీపంలోనే మెస్‌లో పనిచేసే 12 మంది కార్మికులకు గదులు కేటాయించడమే ఈ ఘటనకు కారణమని చెప్పారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12 మొబైల్ ఫోన్లలో అభ్యంతరకరమైన ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. డిలీట్ చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఫోన్లను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని జేఎన్టీయూ ఆదేశించింది. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులతో సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి చర్చలు జరిపారు. హాస్టల్ పరిసరాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మహిళా కమిషన్ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కమిషన్‌కు ఏం చెప్పారో వివరణ ఇచ్చారు.కాగా, మహిళలపై వ్యాఖ్యలకు గాను మహిళ కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ ఆఫీసుకు వచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ ముందు కూడా చెప్పాను. కమిషన్ ఎదుట క్షమాపణ కూడా కోరాను. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు జరిగిందని ఒప్పుకోవాలి. అంతేకానీ, మా మీద పడటం, దాడి చేయడం(కాంగ్రెస్ మహిళా నేతలను ఉద్దేశించి) మంచిది కాదన్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని అన్నారు. మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, అదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అనంతరం, కమిషన్ ఆఫీసులోకి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు దూసుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
కేటీఆర్‌కు నిరసన సెగ.. మహిళా కమిషన్ వద్ద ఉద్రికత్త
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసనలు తెలుపుతున్నారు.కాగా, రాష్ట్ర మహిళా కమిషన్(బుద్ధ భవన్) ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేటీఆర్‌ను కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వచ్చిన కేటీఆర్ ఆరోజు ఆఫీసుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, కేటీఆర్ అక్కడికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట, ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా సమాచారం. -
కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పనులపై కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది. Telangana State Commission for Women has issued a notice to Sri K. Taraka Rama Rao, asking him to appear in person on 24 Aug 2024 regarding alleged derogatory remarks about women.@sharadanerella— Telangana State Commission for Women (@SCWTelangana) August 16, 2024 KTR's objectionable comments on womenమహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలుఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్.మనిషికో బస్సు పెట్టండి ...కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్ లు, రికార్డింగ్… pic.twitter.com/Ytv04X4vwc— Congress for Telangana (@Congress4TS) August 15, 2024 -
మహిళా కమిషన్‌కూ వేధింపులు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధంగా నియమితులైన పలు కమిషన్ల చైర్పర్సన్లు, సభ్యులను వేధింపులకు గురి చేస్తోంది. వారికి వేతనాలు, టీఏ, డీఏలు నిలిపివేసింది. కనీసం కార్యాలయ నిర్వహణ ఖర్చులూ ఇవ్వడంలేదు. వేతనాలు, టీఏ, డీఏ, నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని కోరితే రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ అధికారులతో చెప్పిస్తోంది.చివరకు మహిళలకు రక్షణగా నిలిచే మహిళా కమిషన్‌ను సైతం ఇదే విధంగా కక్షపూరితంగా వేధిస్తోంది. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుయుక్తులకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పదవీకాలం 2026 మార్చి వరకు ఉంది. అయితే, గత నాలుగు నెలల వేతన బకాయిలను కోరినా ప్రభుత్వం చెల్లించడంలేదు. సభ్యులకు ఒక నెల వేతనాన్ని నిలిపివేసింది. ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కమిషన్ చైర్పర్సన్, సభ్యులు విశాఖపట్నం, నర్సీపట్నం, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు చేట్టారు. ఈ పర్యటనల టీఏ, డీఏలు విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వహణ ఖర్చులూ నిలిపివేసింది. దీంతో ఆఫీస్ నిర్వహణ, టీఏ, డీఏలు సైతం కమిషన్ చైర్పర్సన్ సొంతంగా పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు గురైన ఘటనల్లో బాధితులను ఆదుకోవలంటూ కమిషన్ ఇస్తున్న ఆదేశాలను సైతం అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు బేఖాతరు చేస్తున్నారు. ఎస్పీలు కనీసం యాక్షన్ టేకెన్ రిపోర్టులు కూడా పంపించడంలేదు.కమిషన్లకు వేతనాలు ఆపాలంటూ సీఎం ఆదేశాలురాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లకు నెలవారీ ఇచ్చే గౌరవ వేతనాలను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్టీఐ కమిషన్ వంటి వాటికి ఈ నెలలో గౌరవ వేతనాలు, టీఏ, డీఏలు ఇవ్వలేదు. ఇలా ఇబ్బందులకు గురిచేసి, రాజకీయంగా వేధించి వారు రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేయాలన్నది చంద్రబాబు సర్కారు ఎత్తుగడగా తేటతెల్లమవుతోంది. న్యాయ పోరాటం చేస్తా: గజ్జల వెంకటలక్ష్మినాకు, తోటి సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సభ్యులకు ఒక నెల వేతనం ఆపేశారు. నాకు 4 నెలల వేతన బకాయిలకు అర్జీ పెట్టుకున్నా చెల్లించలేదు. కనీసం టీఏ, డీఏలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గౌరవ వేతనం అడిగితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అధికారులతో ప్రభుత్వం సలహాలు ఇప్పిస్తోంది. బిల్లులు మంజూరు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌ను అడిగితే మహిళా కమిషన్‌గా మిమ్మల్ని ఉండనివ్వరని, రాజీనామా చేయిస్తారంటూ బెదిరించినట్టు మాట్లాడారు. ఇదే విషయమై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాను. వారు ఏ చర్యలు తీసుకుంటారో చూస్తాను. రాజ్యాంగ బద్దమైన నా పదవి రెండేళ్లపాటు (2026 మార్చి వరకు) ఉంటుంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రభుత్వం తీరు మారకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం. -
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
బండి సంజయ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గుర్రుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళ కమిషన్. ఈ క్రమంలో తాజాగా నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్.. డీజీపీని వ్యక్తిగత విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది కూడా. ఇక ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఊహించని షాక్ తగిలింది. రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. @SCWTelangana has taken cognizance of the matter. Chairperson @sunitavakiti has already written to @TelanganaDGP to personally intervene in the matter. @TelanganaToday @ntdailyonline https://t.co/7k0ygdkxJR — Telangana State Commission for Women (@SCWTelangana) March 11, 2023 జరిగింది ఇది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
మహిళదే ఆ మృతదేహం
సాక్షి, అమరావతి/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం మహిళదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 24న మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం దిమ్మపై ఉన్న గడ్డివాములో మృతదేహం బయటపడింది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం మహిళదా... పురుషుడిదా... అనే విషయంలో పోలీసులు తొలుత నిర్ధారణకు రాలేదు. అయితే, దీనిపై రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి నేతృత్వంలో మండపేట రూరల్ సీఐ శివగణేష్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలించగా, మహిళ తలకు పెట్టుకునే క్లిప్ కాలిన స్థితిలో కనిపించింది. గడ్డివాము సమీపంలో పగిలిన గాజు ముక్కలు, కొద్దిదూరంలో చెప్పులు దొరికాయి. వీటి ఆధారంగా ఆ మృతదేహం మహిళదేనని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలతోనే కేసు చిక్కుముడి వీడాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహం వివరాలతో మిస్సింగ్ కేసులను సరిపోల్చుకుని చూస్తున్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఎటువంటి క్లూ దొరకలేదని సమాచారం. నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయండి : జయశ్రీరెడ్డి మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుధీర్‌బాబుతో మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళ పట్ల అంత కర్కశత్వానికి పాల్పడిన నేరస్తులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని, ప్రత్యేక బృందాలతో విచారణను ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. నేరస్తులను త్వరగా పట్టుకుంటామన్నారు. కేసు సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. -
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు జారీ
-
పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా?. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం ఆక్షేపణీయం. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. -
దారుణం: కోడలిని చంపే ప్రయత్నం.. అత్తామామ ఏం చేశారంటే..?
దేశంలో మహిళలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కోడలిని అత్తామామ కలిసి.. బిల్డింగ్ బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. వివరాల ప్రకారం.. మయూర్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ(30)ను శనివారం తెల్లవారుజామున తమ అత్తామామలు వారి బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఆమె కింద పడటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. दिल्ली के मयूर विहार में 30 साल की महिला को सुबह 3 बजे उसके ससुराल वालों ने छत से फेंका। उसके भाई ने 181 पे कॉल कर हमको ये विडीओ भेजी है। लड़की की हालत बहुत नाज़ुक है। मैं दिल्ली पुलिस को नोटिस इशू कर रही हूँ FIR दर्ज करने, अरेस्ट करने और MM के सामने लड़की के बयान करवाने के लिए! pic.twitter.com/XuX6kdsfJf — Swati Maliwal (@SwatiJaiHind) June 18, 2022 మరోవైపు.. తన సోదరిని అత్తింటి వారే భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలి సోదరడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులకు అందజేశాడు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా పంపించాడు. దీంతో ఆ సంస్థ అధికారిని స్వాతి మలివాల్ స్పందించి.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు. -
జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. -
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్
‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది. తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ మహిళ మనసును తాకే నినాదం. తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ. కమిషనే మహిళ దగ్గరకు మహిళాకమిషన్ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. చైతన్య సమావేశాలు ‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్ల వారీగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం. కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలో రిపోర్ట్ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్ అసోసియేషన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్ లీడర్లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్ యాక్ట్ (పీఓఎస్‌హెచ్) 2013, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె. క్యాంపస్ కాప్స్ కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్ కాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్ బోర్డులో ఉంచాలి. గృహ హింస– గడపదాటని శక్తి రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్. చర్యలు కఠినంగా ఉండక తప్పదు! పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అండగా నిలుద్దాం! సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి. – వాకా మంజులారెడ్డి బాధితుల పక్షాన... పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్ నెంబర్ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం. – జి.నిరీష, జూనియర్ అసిస్టెంట్, గుంటూరు మహిళకు మనోధైర్యం లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. – బి. సుశీల, చైర్ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి చైతన్యవారధి ‘సబల – అఅఅ’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ (ట్రిపుల్ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది. – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ మహిళల బలం సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది. – రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు ‘సబల’ పోటీలు! ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్ చేయడం కూడా అవసరం. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్ -
కోడలికి అత్తింటి నుంచి జీవనభృతి
సాక్షి, అమరావతి: భర్తను కోల్పోయి, అత్తింటి నుంచి ఆదరణ కరువైన మహిళకు చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యంతో న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహమైంది. ఆమె భర్త గతేడాది కోవిడ్‌తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె పోషణ విషయంలో అత్తింటి నుంచి పేచీలు, వేధింపులు తప్పలేదు. దిక్కుతోచని స్థితిలో జాహ్నవి చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మికి కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. దీంతో ఇరుపక్షాలను కమిషన్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. చట్టపరమైన హక్కులతో జాహ్నవికి జరగాల్సిన న్యాయంపై అత్తింటి వారిని ఒప్పించారు. దీంతో అత్తవారింటి నుంచి తన జీవనభృతికి సంబంధించి రావాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో జాహ్నవికి కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. -
ఉద్యోగినులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి/మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగినుల సమస్యలపై కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఏపీఎన్జీవో, సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ దీనికి అధ్యక్షత వహించారు. పద్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ సూచనలతో పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగినులు ఫిర్యాదులు చేయడంలో ముందుంటున్నారని తెలిపారు. కనుసైగ సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు.. గజ్జల వెంకటలక్ష్మి, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శాంతకుమారి, ఏపీ సచివాలయ మహిళా అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ దీపాభవాని, ఏపీ ఎన్జీవో మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగినులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కాగా, టీడీపీ నేతల బూతులు హేయమని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని బూతుల తిట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. -
మృగాళ్లకు ఈ సమాజంలో స్థానం లేదు
సాక్షి,అమరావతి: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ రామకోటినగర్‌లో యువతిపై అమానుషంగా దాడి చేసి, కర్రలతో కొడుతూ హింసించిన ఘటన సీఎం జగన్‌ని చాలా తీవ్రంగా కలచివేసిందన్నారు. విశాఖలో ఇద్దరి బాలికలపై జరిగిన అఘాయిత్యంపై కూడా సీఎం జగన్ స్పందించారని చెప్పారు. ఈ రెండు ఘటనలపై సీఎం స్పందిస్తూ తక్షణం నిందితులను అదుపులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనలపై స్వయంగా బాధితుల పరిస్థితి తెలుసుకున్నానని, పోలీసు అధికారులతో మాట్లాడి, కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనాస్థలాలకు పంపించినట్లు చెప్పారు. -
‘సామాజిక’ అనర్థాలపై ‘ఈ నారీ’ అవగాహన
మంగళగిరి: సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి హోంమంత్రి ఈ నారీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అందులో భాగంగా యూనివర్సిటీలు, కళాశాలల్లోని యువతులకు సామాజిక మాధ్యమ పరిచయాలు–అనర్థాలపై రోజుకు పదివేల మందికి అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ ఈ నారీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రమ్య హత్యను కొందరు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. జాతీయ కమిషన్ ప్రభుత్వ పనితీరుకు 200 మార్కులు ఇచ్చిందని, ప్రతిపక్షపార్టీలకు అది కనిపించలేదా అని ప్రశ్నించారు. మహిళకు ఓ పోలీసును కాపలా పెట్టాలా అని ప్రశ్నించిన చంద్రబాబుకు నేడు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎంత ఉపయోగమో.. అంత అనర్థం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ యువకుడు 200 మంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగిన విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగమో అంత అనర్థం కూడా ఉందని గ్రహించాలని కోరారు. ఇప్పటికే దిశ యాప్, దిశ చట్టంతో రాష్ట్రంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారన్నారు. ప్రతి యువతి, మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక బాధ్యత కొరవడిందని, నడిరోడ్డులో రమ్యపై దాడి జరుగుతుంటే ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజలలో సామాజిక బాధ్యత పెరిగి మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం (నేడు) నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు, యువతులపై దాడుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు వివిధ రంగాల ప్రముఖులతో అన్ని జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ పద్మావతి, డైరెక్టర్ సియాజ్, కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
బాధితురాలికి అండగా ప్రభుత్వం
అల్లిపురం (విశాఖ దక్షిణ)/ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లా, చౌడువాడకు చెందిన రాములమ్మ, ఆమె సోదరి, సోదరి కుమారుడిని సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ పి.వి.సుధాకర్‌ను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందుతోందని, ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు మహిళలు పనిచేసే ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. సోమవారం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. -
అత్యాచార బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్
వైఎస్సార్ కడప: కడప జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు. -
మహిళల ఆరోగ్యానికి భరోసా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వల్ల మహిళల ఆరోగ్యానికి భరోసా లభిస్తోందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలకు ఏ విధంగా భరోసా కల్పించాలనే అంశంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్లతో గురువారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్‌ను దేశ వ్యాప్తంగా 900 మంది గర్భిణులు సహాయం కోరగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 50 మంది ఉన్నారని, వారికి తక్షణ వైద్య సహాయం అందే విధంగా ఏపీ మహిళా కమిషన్ కృషి చేసిందని తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వంతోపాటు మహిళా కమిషన్, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెబినార్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ మాట్లాడుతూ గర్భిణులకు వైద్యసహాయం అందించడంలో హెల్ప్‌లైన్ ద్వారా కృషి చేసిన ఏపీ మహిళా కమిషన్‌ను అభినందించారు. -
‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’
లక్నో: ఉత్తరప్రదేశ్ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని దీని పరిణామాలే అత్యాచారాలకు దారి తీస్తాయన్నారు. ఆలీఘర్‌లో మహిళలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అమ్మాయిలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆమె ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొదట అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతారు ఆ తరువాత వారితో పారిపోతారన్నారు. కాగా రాష్ట్రంలో అత్యాచారం కేసులు గణనీయంగా పెరిగాయి అనే ప్రశ్నకు సమాధానంగా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మహిళా కమిషన్ మాత్రం మీనా కుమారి వ్యాఖ్యలను సమర్థించలేదు. కమిషన్ ఉపాధ్యక్షుడు అంజు చౌదరి, కుమారి వ్యాఖ్యలు తప్పని, అమ్మాయిలను ఫోన్లకు దూరంగా ఉంచినంత మాత్రాన అత్యాచారాలకు తగ్గుదలకు ఇవి పరిష్కారం కాదన్నారు. UP महिला आयोग अध्यक्ष का विवादित बयान, 'फोन पर लंबी बात कर लड़कों के साथ भाग जाती हैं लड़कियां, उन्हें ना दें मोबाइल'#MeenaKumari #UPStateWomenCommission#UPSWC pic.twitter.com/CDccF2kqBx — NBT Uttar Pradesh (@UPNBT) June 10, 2021 చదవండి: ‘‘దేవుడి ఆధార్ కార్డ్ తెస్తేనే.. పంట కొంటాం’’ -
‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం
ఒంగోలు అర్బన్/ఒంగోలు టౌన్: మహిళల భద్రతతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని శుక్రవారం ఒంగోలులో ఆమె ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలిసి మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చ్‌లో దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. ‘రాజమండ్రి ఘటన’పై కౌన్సెలింగ్ రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ తరగతి గదిలో ఇంటర్ చదువుతున్న మైనార్టీ తీరని బాలుడు ఓ బాలికకు తాళి కట్టడం అందరికీ ఒక షాకింగ్‌లా కనపడిందని, ఈ ఘటనపై ఇరుపక్షాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఒంగోలు ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘటనపై అధికారులతో తాను మాట్లాడినట్లు చెప్పారు. రెస్క్యూ చేసి ఆ బాలికను ఒక హోమ్‌లో ఉంచుతామన్నారు. -
భార్య అందంగా ఉందని యాసిడ్ పోసిన భర్త
- బెంగళూరులో దాష్టీకం - బాధితురాలికి రూ.3 లక్షలు అందించిన మహిళా కమిషన్ బనశంకరి (బెంగళూరు): భార్యపై అనుమానంతో ఒక భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డ కిరాతక ఘటన బెంగళూరు కేజీ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నేగౌడ, మంజుల దంపతులు స్థానికంగా నివాసముంటున్నారు. మంజుల గార్మెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉందని భర్త నిత్యం వేధించేవాడు. దీంతో మంజుల 4 రోజుల క్రితం గార్మెంట్స్‌లో ఉద్యోగాన్ని కూడా మానేసింది. తన భార్య అందంగా ఉండటంతో అందరూ తన భార్యను చూస్తున్నారని, ఆమెను కురూపి చేయాలనే దుర్బుద్ధితో శుక్రవారం ఆమెపై యాసిడ్ గుమ్మరించాడు. గాయాలపాలైన ఆమెను తక్షణం స్థానికులు వెంటనే బాధితురాలిని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మంజులకు 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని, ఆమె ఎడమకన్ను పూర్తిగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. బాధితురాలు మంజులను రాష్ట్ర మహిళాకమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి శనివారం ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు. మహిళా కమిషన్ తరఫున రూ.3 లక్షల చెక్‌ను బాధితురాలికి అందజేశారు. ఆమెకు ప్రతినెలా రూ.3 వేల పింఛన్ అందిస్తామని, రూ.20 లక్షల వరకు ఆమెకు వైద్యఖర్చులు భరిస్తామని తెలిపారు.