
దేశంలో మహిళలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కోడలిని అత్తామామ కలిసి.. బిల్డింగ్ బాల‍్కనీ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు.
వివరాల ప్రకారం.. మయూర్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ(30)ను శనివారం తెల్లవారుజామున తమ అత్తామామలు వారి బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఆమె కింద పడటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
दिल्ली के मयूर विहार में 30 साल की महिला को सुबह 3 बजे उसके ससुराल वालों ने छत से फेंका। उसके भाई ने 181 पे कॉल कर हमको ये विडीओ भेजी है। लड़की की हालत बहुत नाज़ुक है। मैं दिल्ली पुलिस को नोटिस इशू कर रही हूँ FIR दर्ज करने, अरेस्ट करने और MM के सामने लड़की के बयान करवाने के लिए! pic.twitter.com/XuX6kdsfJf
— Swati Maliwal (@SwatiJaiHind) June 18, 2022
మరోవైపు.. తన సోదరిని అత్తింటి వారే భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలి సోదరడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులకు అందజేశాడు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా పంపించాడు. దీంతో ఆ సంస్థ అధికారిని స్వాతి మలివాల్ స్పందించి.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment