women harassments
-
‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?. ..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు. -
అసలు వీడు తండ్రేనా?.. డీఎన్ఏ టెస్ట్‌లో షాకింగ్ నిజాలు
గుంటూరు లీగల్: కూతురి ఆత్మహత్యకు కారకుడైన తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన మహంకాళి నాగరాజుకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురిపై కన్నేసిన నాగరాజు ఆమెను కాపురానికి పంపకుండా తన వద్దే ఉంచుకున్నాడు. ఆమెపై లైంగిక దాడి చేసేందుకు పథకం రచించాడు. అడ్డుగా ఉన్న తన భార్యను కొట్టి ఖమ్మంలోని పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె 2017 మార్చి 22న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెకు మానసిక స్థితి సక్రమంగా లేక ఆత్మహత్య చేసుకుందని నాగరాజు తప్పుడు ప్రచారం చేశాడు. పోలీసులకూ అలాగే ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టంలో బయడపడ్డ నిజాలు బాధితురాలి ఆత్మహత్య అనంతరం పోస్టుమార్టంలో అనేక విషయాలు బయటకొచ్చాయి. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించారు. ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చడానికి కారకులు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. తన భార్యతో తాను ఎప్పుడూ ఉండలేదని ఆమె భర్త స్పష్టం చేశాడు. ఈ క్రమంలో మృతురాలి అమ్మమ్మ నాగరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎన్ఏ టెస్ట్‌లో తేలింది.. మృతురాలి భర్తకు, తండ్రికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భం దాల్చడానికి తండ్రే కారణమని తేలింది. విషయం తెలుసుకున్న మహంకాళి నాగరాజు పరారయ్యాడు. రెండున్నరేళ్ల అనంతరం అప్పటి డీఎస్పీ సుప్రజ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున ఏపీపీ శ్యామలా కేసు వాదించారు. -
కీచక తండ్రి.. తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి కూతురుపై..
నాగోలు: కుమార్తెపై కన్న తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కుషాయిగూడలో శుక్రవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 27 కాప్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీటీమ్స్ పోలీసులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ , ఈవ్ టీజింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశం అనంతరం అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక తండ్రి లైంగిక వేధింపుల గుర్తించి షీ టీమ్స్ దృష్టికి తీసుకెళ్లింది. తన తల్లి కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకు నిద్ర కోసం మాత్రలు ఇచ్చేవారని తెలిపింది. ఆమె నిద్రలోకి వెళ్లగానే తండ్రి ప్రశాంత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. రెండేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్న అతను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో బాలికపై ట్యూషన్ మాస్టర్ వేధింపులు ఎల్బీనగర్లో నివాసం ఉండే బాలిక 10 వ తరగతి చదువుతుంది.ఆమె అదే ప్రాంతానికి చెందిన మాచవరం వెంకట శ్రీకాంత్ కుమార్ వద్ద ట్యూషన్‌కు వెళ్లేది. బాలికతో సన్నిహితంగా ఉంటున్న అతను ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకర మెసేజ్‌లు పంపేవాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు మహిళలు ఎక్కడ వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టిమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చని రాచకొండ షీ టీమ్స్ ఇన్‌ఛార్జి అదనపు డీసీపీ షేక్ సలీమా అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయం వద్ద 111 మంది ఆకతాయికు వారి కుటుంబ సభ్యల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గత 4 వారాల్లో షీ టీమ్స్ 111 మంది ఈవ్ టీజర్లు పట్టుబడారు. వారిలో 41 మంది మేజర్లు, 70 మైనర్లు ఉన్నారు. పట్టుబడిన వారికి భూమిక విమెన్స్ కలెక్టివ్ నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మొత్తం 79 కేసుల్లో 29 ఎఫ్ఐఆర్, 28 పెట్టి కేసులు, 22 సాధారణ కౌన్సెలింగ్ ఉన్నాయి. మైనర్లకు సైకియాట్రిస్ట్ డాక్టర్ వాసవి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురైన మహిళలలు డయల్ 100, వాట్సాప్ కంట్రోల్ నెం. 9490617111 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ సూచించారు. -
‘కీచకుల పార్టీగా టీడీపీ.. మహిళలపై అకృత్యాలకు బాబు సమాధానం చెప్పాలి’
తనకల్లు : మహిళలపై టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో టీడీపీ నేత వేధింపులకు బలైన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులను ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సంధ్యారాణి తల్లిదండ్రులు శ్రీనివాసులు, రాధమ్మలకు భరోసా ఇచ్చారు. సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌కు ఆ పార్టీ నాయకులు అండగా నిలవాలని చూడడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, వేధింపులను ప్రజలు మరచిపోలేదన్నారు. టీడీపీ కీచకుల పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ నాయకులు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త కుమార్తెను ఆ పార్టీ నాయకుడే కాలయముడిగా మారి ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యాడని, అలాంటి దుర్మార్గుడిని రక్షించాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబును పోతుల సునీత ప్రశ్నించారు. -
మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన
మధురపూడి (తూర్పుగోదావరి): మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తీరు భరించలేక ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోరుకొండ ఎస్ఐ తెలిపిన వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి (27) తన స్నేహితురాలితో కలిసి సోమవారం రాత్రి మంజీరా ఫంక్షన్ హాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. అక్కడ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ఆతిథ్యం ఇస్తానంటూ తన కారులో ఇద్దరినీ కోరుకొండ మండలం గాడాలలోని తమ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ, భోజనాలు చేస్తున్న సమయంలో ఆ యువతిపట్ల శ్రీరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ అతను తన తీరు మార్చుకోకపోవడంతో ఆమె ఎదురుతిరిగింది. దీంతో అతను దౌర్జన్యానికి పాల్పడే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే బాధితురాలు అక్కడనుంచి బయటపడేందుకు యత్నిస్తుండగా శ్రీరాజ్ ఆమెను అనుసరించి తన కారులో దింపుతానని నమ్మించాడు. అలా వారు కారులో కొంతదూరం ప్రయాణించాక హర్షకుమార్ తనయుడు మరోసారి వెకిలిచేష్టలకు బరితెగించాడు. ఒకచేత్తో కారును డ్రైవ్ చేస్తూ, మరో చేత్తో ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా ఆమె ప్రతిఘటిస్తూనే ఉంది. చివరకు భరించలేక, మధురపూడి ఎయిర్‌పోర్టు రోడ్డులో కారు దిగిపోయింది. అక్కడ నుండే 100 ఫోన్ నెంబర్‌కు కాల్చేసి, జరిగిన విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో కోరుకొండ, రాజానగరం పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి, జరిగిన ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం.. వేధింపులకు గురిచేయడం వంటి నేరాలపై 354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని కోరుకొండ ఎస్పై శారదా సతీష్ తెలిపారు. గతంలోనూ శ్రీరాజ్‌పై కేసులు ఇక శ్రీరాజ్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయి. 2019 ఎన్నికల సమయంలో అనుమతిలేకుండా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే సమయంలో జరిగిన అల్లర్లలో శ్రీరాజ్‌పై కోరుకొండ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా.. యువతిపై అసభ్యకర ప్రవర్తన కేసు రెండోది. అలాగే రాజమహేంద్రవరంలో కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య -
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని..
-
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని..
ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి.. వారిని మోసం చేస్తున్న నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. శివశంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది. కాగా, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో శివశంకర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్‌బాబు(33) మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్ చేస్తాడు. అనంతరం, వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె.. భర్తకు రూ. 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివశంకర్ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో, అనుమానం వచ్చిన.. భార్య అతడి గురించి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యపెళ్లికొడుకు శివశంకర్ బాబును అరెస్ట్ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
దారుణం: కోడలిని చంపే ప్రయత్నం.. అత్తామామ ఏం చేశారంటే..?
దేశంలో మహిళలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కోడలిని అత్తామామ కలిసి.. బిల్డింగ్ బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. వివరాల ప్రకారం.. మయూర్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ(30)ను శనివారం తెల్లవారుజామున తమ అత్తామామలు వారి బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఆమె కింద పడటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. दिल्ली के मयूर विहार में 30 साल की महिला को सुबह 3 बजे उसके ससुराल वालों ने छत से फेंका। उसके भाई ने 181 पे कॉल कर हमको ये विडीओ भेजी है। लड़की की हालत बहुत नाज़ुक है। मैं दिल्ली पुलिस को नोटिस इशू कर रही हूँ FIR दर्ज करने, अरेस्ट करने और MM के सामने लड़की के बयान करवाने के लिए! pic.twitter.com/XuX6kdsfJf — Swati Maliwal (@SwatiJaiHind) June 18, 2022 మరోవైపు.. తన సోదరిని అత్తింటి వారే భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలి సోదరడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులకు అందజేశాడు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా పంపించాడు. దీంతో ఆ సంస్థ అధికారిని స్వాతి మలివాల్ స్పందించి.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు. -
మనోళ్లే కదా అని నమ్మి ఆమెను వారితో పంపిస్తే.. అక్కడ బైక్ ఆపి..
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని పొరుగు గ్రామంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఓ పెళ్లికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారి ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ రూట్లో వస్తున్న తమ గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్ మీద వచ్చారు. దీంతో వారిని ఆపి.. తన కూతురును ఇంటి వద్ద డ్రాప్ చేయాలని మైనర్ తండ్రి కోరాడు. తర్వాత, గ్రామానికి వెళుతున్న క్రమంలో బాధితురాలని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె పేరెంట్స్ ఇంటికి వచ్చాక.. కన్నీరుపెట్టుకుని జరిగిన విషయం వారికి చెప్పింది. ఈ విషయం వారు గ్రామ పెద్దలకు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహంతో నిందితులను చితకబాదారు. నిందితులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ నిందితుడు అక్కడే కాలిన గాయాలతో మరణించగా.. మరో వ్యక్తి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. -
మహిళా వేధింపులపై షీ టీమ్ ట్వీట్
-
పీడకలపై పిడికిలి మీ టూ
లైంగిక పీడనకు వ్యతిరేకంగా మహిళలు పిడికిలి బిగిస్తున్నారు.సామాజిక మాధ్యమాలే వేదికగా తమ గళం వినిపిస్తున్నారు.‘మీ టూ’ ఉద్యమం ధాటికి ఎందరో ‘మగా’నుభావులు అదిరిపడుతున్నారు. ‘మీ టూ’ పెనుగాలుల తాకిడికి ఒక్కొక్కరి ముసుగులే తొలగిపోతున్నాయి.ఇప్పటికే కొందరు ప్రముఖుల పేర్లు బజారునపడ్డాయి... రానున్న రోజుల్లో ఇంకెందరి అసలు రంగులు బయటపడతాయో చూడాల్సిందే! ‘నేను సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు. తమకు జరిగిన లైంగిక వేధింపులపై ‘మీ టూ’ అంటూ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డబ్బు, అధికారం, పలుకుబడి కలిగి సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న పురుషపుంగవుల అసలు రంగును బట్టబయలు చేస్తున్నారు. ‘మీ టూ’ సోషల్ మీడియాలో ఒక అక్టోబర్ విప్లవం. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్ వరకు ‘మీ టూ’ సెగలు వ్యాపించాయి. ‘మీ టూ’ దెబ్బకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల బాగోతాలు బజారున పడ్డాయి. ‘మీ టూ’ ధాటికి బజారున పడ్డవారిలో ఆర్థికరంగ ప్రముఖులు, మతగురువులు, క్రీడా ప్రముఖులు, సంగీత ప్రముఖులు, వైద్య ప్రముఖులు, సైనిక ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తాజాగా ‘మీ టూ’ మంటలు మీడియాకూ వ్యాపించాయి. సమాజానికి సుద్దులు చెప్పే పలువురు ప్రముఖ పాత్రికేయుల అసలు రంగులు ప్రపంచానికి తేటతెల్లమైపోతున్నాయి. ‘మీ టూ’ పెనుగాలులకు రానున్న రోజుల్లో ఎందరు పెద్దమనుషుల నిజస్వరూపాలు బయటపడతాయో వేచిచూడాల్సిందే. సోషల్ మీడియాలో నిప్పురవ్వలా మొదలైన ‘మీ టూ’ ఉద్యమం అనతికాలంలోనే దావానలంలా మారింది. హాలీవుడ్ నటి అలీసా మిలానో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై గత ఏడాది అక్టోబర్ 15న ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘ట్విట్టర్’లో ఒక పోస్టు పెట్టింది. ఆ రోజు గడిచేలోగానే ‘ట్విట్టర్’లో రెండులక్షల మందికి పైగా యూజర్లు ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో తాము ఎదుర్కొన్న అనుభవాలను ఏకరువు పెడుతూ ‘ట్విట్టర్’ను హోరెత్తించారు. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ మొదలైన తొలి ఇరవైనాలుగు గంటల్లో ‘ఫేస్బుక్’లోనైతే ఏకంగా 47 లక్షల మందికి పైగా యూజర్లు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై దాదాపు 1.20 కోట్ల పోస్టులు పెట్టారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తొలి ఇరవైనాలుగు గంటల్లో మార్మోగిన ట్వీట్లు, పోస్టుల్లో దాదాపు 45 శాతం అమెరికా నుంచే వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ప్రతిరోజూ వేలాదిగా ‘మీ టూ’ పోస్టులు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ‘మీ టూ’ పోస్టుల ఆధారంగా పత్రికల్లో, టీవీ చానళ్లలో దాదాపు ప్రతిరోజూ కథనాలు వెలువడుతున్నాయి. పన్నెండేళ్ల కిందటే ‘మీ టూ’ మూలాలు సోషల్ మీడియాలో ‘మీ టూ’ కథనాలు వైరల్ కావడం మొదలై ఏడాదవుతోంది. అయితే, పన్నెండేళ్ల కిందటే సోషల్ మీడియాలో ‘మీ టూ’ మూలాలు ఏర్పడ్డాయి. ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ సామాజిక కార్యకర్త తరానా బుర్కే తొలిసారిగా ‘మీ టూ’ పదబంధంతో తనకు తారసపడిన ఒక పదమూడేళ్ల బాలిక కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మై స్పేస్’ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో అంతగా వైరల్ కాలేదు. అమెరికాలో నల్లజాతి బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగిస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకోవడంతో బుర్కే ఇదే పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. న్యాయ వ్యవస్థపైనా మరకలు ‘మీ టూ’ ఉద్యమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ‘మీ టూ’ కథనాల్లో చాలావరకు చట్టపరమైన ఫిర్యాదుల వరకు వెళ్లడం లేదు. కేవలం అఘాయిత్యాలకు పాల్పడిన ‘పెద్దమనుషుల’ పేర్లు బయటపెట్టడానికే పరిమితమవుతున్నాయి. ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందినవారు, మత గురువులు అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.లైంగిక వేధింపుల బాధితులు తమకు చట్టబద్ధంగా న్యాయం దక్కాలనుకుంటే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థపై కూడా మరకలు ఉండటం గమనార్హం. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వ్యాపించడానికి కొన్నేళ్ల ముందే, 2013లో ఒక మహిళ తన బ్లాగులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరిపై ఆయన పేరు బయటపెట్టకుండానే ఆరోపణలు ఎక్కుపెట్టారు. బ్లాగులో రాసిన విషయంపై మీడియా కథనాలు న్యాయవ్యవస్థలో కలకలం రేపాయి. మీడియా కథనాలు వెలువడిన తర్వాత ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సదరు న్యాయమూర్తి పేరును బయటపెట్టారు. న్యాయమూర్తి పేరు కూడా బయటకు రావడంతో ఈ విషయమై విచారణ కోసం హడావుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీని దోషిగా తేల్చింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టం అదే ఏడాది అమలులోకి వచ్చింది. చట్టం ఏం చెబుతోందంటే... పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వైధింపులను నిరోధించడానికి 2013లో అమలులోకి వచ్చిన చట్టం లైంగిక వేధింపులకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ‘అవతలి వ్యక్తి నుంచి అభ్యంతరం వచ్చినప్పటికీ, పనిచేసే చోట మహిళలను తాకడం, సెక్స్ కోరడం, పోర్నోగ్రఫీ చూపించడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం వంటి చర్యలను లైంగిక వేధింపులుగానే పరిగణించాలి’ అని ఈ చట్టం చెబుతోంది.ఈ చట్ట ప్రకారం పని ప్రదేశంలో మహిళలను ఉద్దేశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అశ్లీల వ్యాఖ్యలు చేసినా, మహిళల ఆమోదం లేకుండా అనవసరంగా తాకినా, లైంగికవాంఛ తీర్చాలని ప్రాధేయపడినా లేదా డిమాండ్ చేసినా, మాటల ద్వారా లేదా చేతల ద్వారా లైంగిక ఉద్దేశాన్ని బయటపెట్టేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా, మహిళలను వెంబడించినా, అశ్లీల చిత్రాలను వారికి చూపించినా, సెల్ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా వాటిని పంపినా అలాంటి చర్యలను నేరంగానే పరిగణించడం జరుగుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఒక మహిళపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఎవరు నిర్ధారించాలనే దానిపై కూడా ఈ చట్టం తగిన నిబంధనలను రూపొందించింది. పదిమంది కంటే ఎక్కువ మంది సిబ్బంది కలిగిన ప్రతి సంస్థా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నాయకత్వం వహించాలి. కమిటీలో సగానికి పైగా మహిళా సభ్యులే ఉండాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా ఈ కమిటీలో సభ్యత్వం ఉండాలి. పదిమంది కంటే తక్కువ మంది సిబ్బంది ఉన్న సంస్థల్లో మహిళా ఉద్యోగులు ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనట్లయితే, వారు జిల్లా స్థాయి కమిటీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై కమిటీలు విచారణ జరిపి అవి నిజమో, కాదో నిర్ధారిస్తాయి. ఒకవేళ ఫిర్యాదు నిజమేనని విచారణలో రుజువైతే అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా అనే విషయాన్ని కూడా ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. అలాగే, అబద్ధపు ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఈ కమిటీలకే ఉంటుంది. మహిళా పాత్రికేయులకు బాసటగా ‘సిస్టర్హుడ్’ ఉద్యమం సోషల్ మీడియాలో ‘మీ టూ’కు తోడుగా ‘సిస్టర్హుడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం మొదలైంది. మహిళా పాత్రికేయులకు బాసటగా రుతుపర్ణ ఛటర్జీ అనే పాత్రికేయురాలు ‘ట్విట్టర్’ వేదికగా ‘సిస్టర్హుడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం ప్రారంభించారు. ‘సిస్టర్హుడ్’ క్యాంపెయిన్ ద్వారా తన సమస్యకు పరిష్కారం దొరికిందని దీప్శిఖ అనే పాత్రికేయురాలు వెల్లడించారు. వేధింపుల సమస్యల నుంచి గట్టెక్కడానికి తగిన అనుభవజ్ఞుల సలహాలు ‘సిస్టర్హుడ్’ క్యాంపెయిన్‌లో లభిస్తున్నాయని, ఇది మహిళా పాత్రికేయులకు చాలా ఉపయోగకరంగా ఉంటోందని రాజేశ్వరీ గణేశన్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ చెబుతున్నారు. మీ టూ కంటే ముందే... సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలోనే, ‘మీ టూ’ ఉద్యమం ఏమిటో తెలియని కాలంలోనే చాలామంది ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. పాప్ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా చలామణీ అయిన మైకేల్ జాక్సన్ ఒక పదమూడేళ్ల బాలుడిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 1993లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ బాలుడి తల్లి స్వయంగా మైకేల్ జాక్సన్‌కు వ్యతిరేకంగా మీడియాకెక్కింది. బాలుడి కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించిన మైకేల్ జాక్సన్ ఆ వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నాడు. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ ఒక అత్యాచారం కేసులో 1992లో దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవించాడు. ఇంగ్లిష్ సంగీతకారుడు గ్యారీ గ్లిట్టర్ బాలలపై అఘాయిత్యాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో 1999, 2006 సంవత్సరాల్లో జైలు శిక్ష పొందాడు. హాలీవుడ్ నటుడు జెఫ్రీ జోన్స్‌కు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. సోషల్ మీడియా పెద్దగా పరిచయం లేని రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల కిందట పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు. రూపన్దేవల్ బజాజ్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె సాగించిన న్యాయపోరాట ఫలితంగా గిల్‌కు శిక్ష పడింది. ఇన్ఫోసిస్ డైరెక్టర్లలో ఒకరైన ఫణీష్‌మూర్తి 2002లో లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తనపై ఫణీష్‌మూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన వద్ద ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేసే మహిళ ఫిర్యాదు చేశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఫణీష్‌మూర్తి ఆమెకు 30 లక్షల డాలర్లు (రూ.22 కోట్లు) పరిహారంగా చెల్లించి, వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నారు. మీడియా రంగంలో సంచలన పాత్రికేయుడిగా పేరుపొందిన ‘తెహల్కా’ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ లైంగికదాడి కేసులో న్యాయవిచారణ ఎదుర్కొంటున్నారు. తెహల్కాలోనే పనిచేసే ఒక మహిళా ఉద్యోగి 2013లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లెక్కలేనంతగా జరుగుతున్న సంఘటనల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వివిధ రంగాల్లో ఇలాంటి వివాదాలు చాలానే ఉంటున్నా, చాలామంది ప్రముఖుల పేర్లు వార్తాకథనాల్లో బయటకు వస్తున్నా, వారికి శిక్షలు పడ్డ సందర్భాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. వేధింపులు ఈనాటివి కావు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఈనాటివి కావు. నాగరికత మొదలైన నాటి నుంచే మహిళలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. మహిళలపై అణచివేతకు ఫలితంగానే మాతృస్వామ్య వ్యవస్థ అంతరించి, పితృస్వామ్య వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించి మన పురాణాల్లోనే కొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడే వారిని ఇప్పటి ఆధునిక ప్రసారసాధనాలు సైతం కీచకుడితో పోలుస్తుంటాయి. ఇంతకూ కీచకుడికి ఎందుకు అంతటి బరితెగింపు, బలుపు అంటారా..? కీచకుడు స్వయంగా ఏ రాజ్యానికీ రాజు కాడు.మత్స్య దేశాన్ని ఏలే విరాటరాజుకు బావమరిది. అమిత బలసంపన్నుడు. ‘సింహబలుడు’ అనేది అతగాడి ముద్దుపేరు. అంతటి బలవంతుడు బావమరిది అయినందుకు సంబరపడ్డ విరాటరాజు అతగాడికి సర్వసేనాధిపతిగా పట్టంకట్టాడు. కీచకుడు సర్వసేనాని అయిన తర్వాత విరాటరాజు కేవలం ఉత్సవవిగ్రహంగా మాత్రమే మిగిలాడు. రాజ్యంలో కీచకుడే పెత్తనం చలాయించేవాడు. కంటికి నదరుగా కనిపించే స్త్రీలను చెరచడం అతగాడికి ఆటవిడుపుగా ఉండేది. విరాటరాజ్యంలో పరిస్థితులు ఇలా ఉన్న రోజుల్లోనే పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు మారువేషాల్లో అతడి పంచన చేరుతారు.రకరకాల ఉద్యోగాల్లో కుదురుకుంటారు. విరాటుని భార్య సుధేష్ణ వద్ద ద్రౌపది ‘సైరంధ్రి’గా కుదురుకుంటుంది. ఆమెపై కన్నేసిన కీచకుడు ఆమెను లోబరచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు.నిండు సభ వరకు ఆమెను వెంటాడతాడు. ద్రౌపదిని తరుముతూ కీచకుడు సభలోకి రావడం చూసి వలలుడి పేరుతో వంటవాడిగా ఉన్న భీముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. సభలో అతడిని ఏమీ చేయలేక, ద్రౌపదితో కలసి ఉపాయం పన్నుతాడు. కీచకుడిని రాత్రివేళ నర్తనశాలకు రప్పించి, అతడిని అంతం చేస్తాడు. ‘మహాభారతం’ పుణ్యాన మహిళలను వెంటాడి వేధించే దుర్మార్గులకు ‘కీచకుడు’ పర్యాయపదంగా మారిపోయాడు. అలాగని పురాణాల్లో కీచకుడొక్కడే మహిళల పాలిటి దుర్మార్గుడనుకోవడానికి వీల్లేదు. దుర్యోధనుడి ప్రోద్బలంతో ద్రౌపదిని నిండుసభలోకి జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి, ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్నించిన దుశ్శాసనుడు సైతం కీచకుడికి ఏమీ తీసిపోడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నకాలంలో వారు ఉండే పర్ణశాలలో ఎవరూ లేనప్పుడు చొరబడిన సైంధవుడు ద్రౌపదిపై అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. సైంధవుడి దురాగతాన్ని దూరం నుంచి గమనించిన భీముడు ఒక్క ఉదుటన అక్కడకు చేరుకుని, వాడితో తలపడ్డాడు. అతడిని అక్కడికక్కడే చంపబోయిన భీముడిని ధర్మరాజు వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, అతడిని విడిచిపెడతారు. సైంధవుడి అసలుపేరు జయద్రథుడు. నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సలకు భర్త. నిజానికి ద్రౌపది అతడికి వరుసకు సోదరి అవుతుంది. అయినా వావివరుసలు చూసుకోకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డ నీచుడు అతడు. కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడు భీముడి చేతిలోను, సైంధవుడు అర్జునుడి చేతిలోను మరణిస్తారు. మహిళలపై దారుణాలు సాగించిన పురాణపురుషుల్లో నరకాసురుడి గురించి తప్పక చెప్పుకోవాల్సిందే. ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకుడు తొలిరోజుల్లో మంచిగానే ఉండేవాడు. తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకునేవాడు. నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించేవాడు. కొన్నాళ్లకు అతడికి పొరుగు రాజ్యమైన శోణితపురాన్ని ఏలే బాణాసురుడితో స్నేహం కుదిరింది. బాణాసురుడి దృష్టిలో స్త్రీ భోగవస్తువు మాత్రమే. మహిళలను తల్లిలా భావించడాన్ని అతడు హేళన చేసేవాడు. నరకుడు నెమ్మదిగా బాణుడి ప్రభావంలో పడ్డాడు. అమ్మవారి పూజలు నిలిపివేశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలపై దండెత్తి నచ్చిన యువతులందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి బంధించేవాడు. అలా పదహారువేల మంది రాకుమార్తెలను చెరబట్టాడు. చివరకు శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యాడు. -
ఆమె.. అనుకూలమేనా?
ఏరి కోరి నియమించుకున్న పీఏ. అర్హతలు లేకపోయినా ఈ నియామకం మూడేళ్లుగా చెల్లుబాటు అవుతోంది. పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా.. మంత్రి అండదండల నేపథ్యంలో ఆ వ్యక్తి ముదిరిపోయాడు. ఎంతలా అంటే.. మంత్రిదేముంది, ఆమె కుమారునిదేముంది అంతా నేనే అనే స్థాయికి వ్యవహారం చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మహిళలు శాఖాపరమైన సమస్యతో ఆయన్ను ఆశ్రయిస్తే.. నాకేంటి అనే ధోరణి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఆయన తెరచాటు బాగోతాలకు అద్దం పట్టింది. డబ్బుదేముంది.. మరో రూపంలో తనను మెప్పించాలని ఓ ‘మధ్యవర్తి’తో సాగించిన సంభాషణ మంత్రి చుట్టూ చేరిన అనధికార వ్యక్తుల అసలు రూపం ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం సిటీ: జిల్లాలో ఓ మంత్రి వద్ద సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి తీరు వివాదాస్పదమవుతోంది. పలు సమస్యలతో మంత్రి వద్దకు వచ్చే వారంతా అతగాడి చేతులు తడపాల్సిందే. అదే మహిళలు అయితే కాసులు ముట్టడు. తన కామవాంఛ తీర్చమంటాడు. మంత్రిని కలిసిననా చివరకు పని చేయాల్సింది తామే కాబట్టి.. తాము చెప్పినట్టు వింటే అన్నీ సాఫీగా జరిగిపోతాయంటూ నమ్మబలికి లోబరుచుకుంటున్నాడు. ఇందుకు తోటి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నాడు. ఇతగాడి చేష్టలతో విసిగిపోయిన పలువురు మహిళలు ఆ మంత్రి గడప తొక్కడమే మానేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని అన్ని విధాలా వాడుకునేందుకు కుట్రలు పన్నుతున్న ప్రబుద్ధిడి గురించి మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ.. తమ సామాజిక వర్గానికి చెందినవాడని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ♦ అర్హతలు లేకపోయినా మంత్రి వద్ద పీఏగా చలామణి అవుతున్న ఆ ఉద్యోగి వ్యవహారం గతంలో పెద్ద దుమారమే రేగింది. ఏకంగా ఛైర్మన్ స్థాయి నేతకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి పాలకవర్గం కోపాగ్నికి ఆ శాఖ ఉద్యోగుల ముందు అబాసుపాలయ్యాడు. ఇలా చెబుతూ పోతే అతగాడి పాపాల చిట్టా పుట్టలా పెరిగిపోతుంది. ఇటీవల సొంత శాఖకు చెందిన మహిళా ఉద్యోగి మధ్యవర్తి ద్వారా అతగాడిని ఆశ్రయించింది. సహోద్యోగితో ఫోన్లో ‘పీఏ’ సాగించిన ‘లైంగిక కోర్కెల’ సంభాషణ ఆడియో టేపు ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. సంభాషణ సాగిందిలా.. సన్నిహితుడు: సార్ నమస్తే. ఆ పల్లెకు చెందిన మహిళా ఉద్యోగి మీ కోసం వచ్చింది. తన పని చేసిపెట్టమని అడుగుతోంది. ఏం చేయమంటారు? పీఏ: ఆ.. నిన్న వచ్చింది. నాతో ఏవో తన సమస్యలన్నీ చెప్పింది. పని చేసి పెట్టామప్ప..ఏం హ్యాపీనా?! సన్నిహితుడు: ఆ.. హ్యాపీనే సార్. పీఏ: ఇంతకీ ఏంటి ఆమె క్యారెక్టర్? సన్నిహితుడు: మంచిదే...పాపం ఎవరూ ‘తోడు’ లేరు. పీఏ: అదికాదయ్యా.. నేనడిగేది...! ‘ఏంటి ఆ..మె పరిస్థితి’ అని? సన్నిహితుడు:చిన్నగా ‘పర్వాలేదు..సార్’ అంటుండగానే పీఏ: ఏమయ్యా గట్టిగా మాట్లాడు. ఎక్కడున్నావ్ సన్నిహితుడు: జెడ్పీ క్యాంటిన్లో టిఫిన్‌కు వచ్చా సార్. పీఏ: సరే అక్కడి నుంచి పక్కకు రా? సన్నిహితుడు: వచ్చాను సార్. పీఏ: ఏంటి ఆమె ఎలాంటిది.. పర్వాలేదా.. అని అడుగుతున్నా? గట్టిగా సమాధానం చెప్పు. సన్నిహితుడు: భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటోంది. పీఏ:ఆఆ..పర్వాలేదా? సన్నిహితుడు: ఊ పర్లేదు సార్? పీఏ: అంటే ఎలాంటిది అని అడుగుతున్నా? సన్నిహితుడు: అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నా రా? పీఏ: అవును... డిబ్యాచ్లరా? సన్నిహితుడు: క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్ కాదు సార్.. భర్తకు దూరంగా ఉంటోందంట సార్! పీఏ: అవునా...సరే ఆమె పని చేసిపెట్టాలంటే ఖర్చులుంటాయప్ప. అవెవరూ భరించరు. మేమే చేతినుంచి పెట్టుకుని చేయాలి. ఈ విషయం చెప్పావా? సన్నిహితుడు: సరే లక్ష దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాస్తవంగా మంత్రి, ఆమె కుమారుడిని కలవాలని చాలా ప్రయత్నించింది. వారు సమయానికి దొరకలేదు. పీఏ: వారిని కలసినా మాకే ఆ పని అప్పగిస్తారు. వాళ్లేం డబ్బు ఇవ్వరు. ఎవరికి చెప్పినా చివరికి పని చేయాల్సింది నేనే. సన్నిహితుడు: మీరు మంత్రి దగ్గర పీఏగా ఉన్న విషయాన్ని తెలుసుకుని మన డిపార్టు మెంటతనే కదా అని నా వద్దకు వచ్చింది. నన్నడిగితే మీకు చెప్పి మంత్రి ఇంటి వద్దకు పంపుదామనుకున్నా. మీరు మధ్యలోనే కలసి ఫోన్లోనే ‘పని’ చేసి పెట్టారని చెప్పింది. పీఏ: ఇప్పుడేమంటోంది. హ్యాపీనా ఆమె... సన్నిహితుడు: ఆ హ్యాపీనే సార్. పీఏ: కాకపోతే ఆమె లక్ష ఇస్తానంటోంది కదా.. డబ్బు రూపంగా కాకుండా ‘మరోలా సహకరించమని’ చెప్పు. -
నిర్భయ చట్టం తెచ్చినా.. మృగాళ్లు మారలేదు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులు, మహిళలపై నేరాలు పెరిగిపోతుండటం పట్ల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శిశువులపై కూడా లైంగిక దాడులకు వెనకాడటం లేదని, మనిషి నైతిక విలువలు పాతాళానికి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. నిర్భయ చట్టం తర్వాతైనా మానవ రూపంలో ఉన్న మృగాల తీరులో మార్పు వస్తుందని అందరూ ఆశించారని, అయితే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు మరింత పెరిగాయని తెలిపింది. ఇలా మళ్లీ మళ్లీ దాడులు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి మానవ మృగాలకు కఠిన శిక్షలు పడేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లేనిపక్షంలో ఈ దేశంలో మహిళలకు, పిల్లలకు రక్షణ ఉండదని పేర్కొంది. సమాజంలో బలహీనులపై నేరాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే దిశగా ఆయా ప్రభుత్వ యంత్రాంగాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారిని దారుణంగా చిదిమేసిన ఈ మానవ మృగానికి కింది కోర్టు మరణశిక్ష విధించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. కింది కోర్టు ఇచ్చిన శిక్షను పెంచే విషయంలో నోటీసులు ఇవ్వాలనే దిశగా ఆలోచన చేసినా, ఘటన జరిగి, కింది కోర్టు శిక్ష విధించి సుదీర్ఘ కాలం అయిన నేపథ్యంలో ఆ పని చేయకుండా తమ ను తాము నియంత్రించుకుంటున్నామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. దేవుడి ప్రతిరూపంగా భావించే చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక వాంఛను పెంచుకున్నాడన్న ఆలోచనే తమకు భరింప సాధ్యం కాకుండా ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఇటీవల ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై దేశం మొత్తం తీవ్రంగా స్పందిస్తున్న సమయంలోనే ఈ తీరు వెలువడటం గమనార్హం. కేసు పూర్వాపరాలివీ.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్‌లో నివసించే గడ్డమీది భిక్షపతి ఓ హత్య కేసులో జైలుకెళ్లాడు. అతడిని విడిపించేందుకు తండ్రి తమ రెండెకరాల పొలాన్ని గొల్ల పెంటయ్య, నాగుల నాగభూషణంలకు అమ్మేశారు. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన భిక్షపతి.. భూముల విలువలు బాగా పెరిగిన నేపథ్యంలో తాము అమ్మిన భూమికి మరికొంత మొత్తాన్ని ఇవ్వాలని గొల్ల పెంటయ్యను డిమాండ్ చేశాడు. అయితే ఇందుకు పెంటయ్య నిరాకరించడంతో అతనిపై భిక్షపతి కక్ష పెంచుకున్నాడు. ఇందుకు పథక రచన చేసిన భిక్షపతి.. అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఆశజూపి పెంటయ్య పొలం సమీపానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేశాడు. మృతదేహాన్ని పెంటయ్య పొలంలో పడేశాడు. చిన్నారిని తీసుకెళ్లడం చూసిన కొందరు గ్రామస్తులు భిక్షపతిని నిలదీశారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన భిక్షపతి, తర్వాత పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడు. పెంటయ్య పొలంలో ఆ చిన్నారి మృతదేహాన్ని పడేసింది తానేనని, చిన్నారి హత్య కేసు పెంటయ్యపై నెట్టేందుకే అలా చేశానని చెప్పాడు. చిన్నారిపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. 2011 జూలై 11న జరిగిన ఈ ఘటనపై తూప్రాన్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై సిద్దిపేట ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. హత్య, అత్యాచారం, అపహరణ నేరాలకు భిక్షపతికి జీవితఖైదు విధిస్తూ 2012లో తీర్పు వెలువరించింది. దురుద్దేశంతోనే హత్య కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ బిక్షపతి అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. ఈ అప్పీల్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం.. లైంగిక వాంఛతోనే ఆ చిన్నారిని భిక్షపతి చంపాడని, ఇందుకు సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారని తెలిపింది. ఆ చిన్నారి హత్య విషయంలో భిక్షపతికి దురుద్దేశాలున్నాయని స్పష్టం చేసింది. భిక్షపతి చేసిన అనాగరిక దారుణానికి కింది కోర్టు మరణ దండన విధించి ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఏ రకంగా చూసినా కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంటూ భిక్షపతి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. -
బయటకు ఈడ్చుకొచ్చి.. చెప్పుతో కొట్టి..
సాక్షి, ప్యాపిలి: తోటి ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు చితకబాదారు. కర్నూలు జిల్లా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్, గత కొంత కాలంగా కలచట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బుధవారం బాధిత ఉద్యోగినితో పాటు దాదాపు 20 మంది గ్రామస్తులు ఒక్కసారిగా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చొరబడి జనార్దన్‌ను ఈడ్చుకొచ్చారు. తోటి ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి సిగ్గు లేదా అంటూ పలువురు మహిళలు జనార్దన్‌పై చెప్పులతో దాడి చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు..జనార్దన్‌ను స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు చేరేవరకు దారి పొడవునా అతనిపై దాడి చేసేందుకు యత్నించారు. జనార్దన్ తనకు రెండు నెలలుగా సెల్ఫోన్లో మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలా మెసేజ్‌లు పెట్టవద్దని మర్యాద పూర్వకంగా చెప్పినా అతనిలో మార్పు రాలేదని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా.. తనపై దాడి చేసిన వారిమీద జనార్దన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
బాబు దుష్ట పాలన.. మహిళ రోదన
► స్త్రీల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ► అధికారం అండగా పేట్రేగుతున్న టీడీపీ నేతలు ► ప్రశ్నిస్తే చాలు దాడులతో విరుచుకుపడుతున్న వైనం ► నిందితులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు ‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు’ అన్న సామెత చంద్రబాబు ఆయన అనుచర గణానికి అచ్చం అతికినట్లు సరిపోతుంది. ‘ఆకాశంలో సగం.. అన్నింటా అందలం’ అంటూ ఓ వైపు ఆర్భాటంగా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తూ, మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు సర్కారు వాస్తవంగా వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. పచ్చ నేతల దౌర్జన్యకాండతో రాష్ట్రంలోని మహిళా అధికారులు, సామాన్య మహిళలకు భద్రత కరువైంది. సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా ఘటనల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలే నిందితులు కాగా, మిగతా ఘటనల్లో నిందితులకు వత్తాసు పలుకుతోందీ ఆ పార్టీ నేతలే. ఏ ఘటనలోనూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జనం ఉద్యమించి గోల చేస్తే తూతూ మంత్రంగా చర్యలతో మమ అనిపిస్తూ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయన శిష్యగణం వల్ల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య ఘటనలను పరిశీలిస్తే రాష్ట్రంలో మహిళలు ఏ రీతిన అన్యాయాలకు, అకృత్యాలకు గురవుతున్నారో తేటతెల్లమవుతోంది. ర్యాగింగ్ రక్కసికి మద్దతా? నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మొండి రిషితేశ్వరి(18) ర్యాగింగ్ రక్కసికి బలైపోయిన ఘటనలో సర్కారు తీరుపై ఎంతగా విమర్శలు వచ్చినా మొద్దు నిద్ర వీడలేదు. వర్సిటీలో చదువు నరకప్రాయంగా మారిందని, ప్రేమించాలంటూ బలవంతం చేస్తున్నారని, ర్యాగింగ్ పేరుతో వేధింపులు ఆపాలని జూలై 14, 2015న ఆమె సూసైడ్‌నోట్ రాసి వసతి గృహంలో చున్నీతో ఉరి వేసుకుంది. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహార శైలిని తప్పుపట్టింది. ఈ ఘటనకు ఆయనే కారకుడని, ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావును, దోషులను కాపాడటానికి టీడీపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేసిందో రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలుసు. అడ్డుకోవడమే పాపమైపోయింది.. ఇసుక మాఫియాను అడ్డుకున్నారని కృష్ణా జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని గ్యాంగ్ తాహసీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడి చేయడం మహిళా అధికారుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని పెంచింది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద జూలై 8, 2015న తమ్మిలేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి ఇదేమిటని ఇసుకాసురులను ప్రశ్నించింది. అక్రమ రవాణా సాగడానికి వీల్లేదని ఆమె దారికి అడ్డంగా కూర్చోగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన మద్దతుదారులు వనజాక్షిపై దౌర్జన్యానికి దిగి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారు. ఇసుక క్వారీలోనే ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పరిధి దాటి వ్యవహరించినందున తహసీల్దార్ వనజాక్షిదే తప్పు అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇదే చింతమనేని గత ఏడాది డిసెంబర్ 21న.. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజనం మహిళ కార్మికుల వద్దకు వచ్చి నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. నడిరోడ్డుపై దుశ్శాసనపర్వం అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు సుధమ్మ అనే ఒంటరి మహిళను నడిరోడ్డులో చెప్పు కాళ్లతో ఈడ్చి కొడుతుంటే విడిపించే దిక్కులేకుండా పోయింది. ఈ నెల 2వ తేదీన కూడేరు మండలం జల్లిపల్లిలో తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్రలు ఆమెపై దాడి చేసిన దృశ్యాలు టీవీ చానళ్లలో వీక్షించిన జనం ‘ఇదేమి రాజ్యం.. ఇదేం పాలన’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇంటి ఎదుట కాకుండా, కొంచెం పక్కన నీటి తొట్టె నిర్మించుకోండని చెప్పడమే పాపమైపోయింది. న్యాయం చేయండయ్యా అని పోలీస్‌స్టేషన్ కెళ్లిన ఆమె కళ్లెదుటే పోలీసులు.. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం నివ్వెరపరిచింది. పేద మహిళలను చెరబట్టిన కాల్‌నాగులు విజయవాడలో అధికార పార్టీ నేతల అండతో కాల్‌మనీ గ్యాంగులు పేద మహిళలను చెరబట్టాయి. అధిక వడ్డీకి అప్పులివ్వడం, చెల్లించలేని వారి ఆస్తులు తీసుకోవడమే కాక 200 మందికి పైగా మహిళలను లైంగికంగా దోచుకుని ఆకృత్యాలకు పాల్పడ్డాయి. వీడియో చిత్రీకరణలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ‘పచ్చ కాల నాగులు’ సాగించిన దురాగతాలు చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు కొలువు తీరిన విజయవాడలో సభ్య సమాజం తల దించుకునే స్థాయిలో కాల్ మనీ పేరుతో సెక్స్ రాకెట్ సాగించిన తీరు సిగ్గు చేటు అని మహిళా లోకం నినదించినా బాబు సర్కారు మాత్రం నిస్సిగ్గుగా తుడిచేసుకుంది. బాధితులు ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం పలుకుబడిని ఉపయోగించి ఈ వ్యవహారం పెద్దది కాకుండా చూసింది. ఆక్వాఫుడ్ పార్క్ వద్దన్నందుకు హత్య కేసా? పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ కాలుష్యం వల్ల తమ బతుకులు తెల్లారిపోతాయన్న ఆరేటి సత్యవతిపై బాబు ప్రభుత్వం హత్యానేరం కేసు పెట్టించి రిమాండ్‌కు పంపింది. ఈ పార్కు ఏర్పాటు వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని, తమకు ఉపాధి కరువవుతుందని చెప్పిన స్థానికులపై టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనుచరులు దాడికి దిగారు. గత ఏడాది నవంబర్ 29న జన చైతన్యయాత్ర పేరుతో నరసాపురం మండలం కే. బేతపూడి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సమక్షంలోనే టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బయోత్పాతం సృష్టించారు. ఆ దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా దివీస్ మందుల ఫ్యాక్టరీ కాలుష్యంతో వేలాది మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, హేచరీలపై ప్రభావం పడుతుందని ఉద్యమించిన మహిళలపై కూడా ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తోంది. సీఎంను విమర్శించారని గిరిజన ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసినందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన గిరిజన నియోజకవర్గం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు దేశద్రోహం కింద 2015 డిసెంబర్ 18న కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై హైకోరు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు చట్టాన్ని వాడుకోరాదని స్పష్టం చేసింది. దేశద్రోహం కింద పోలీసులతో ఇలా కేసులు పెట్టించడం అధికార దుర్వినియోగమే అవుతుందని అభిప్రాయపడింది. మంత్రి రావెల తనయుడి కీచకపర్వం బాధితులకు అండగా ఉండి న్యాయం జరిపించాల్సిన మంత్రి తనయుడే ఓ యువతి పట్ట కీచకుడిగా వ్యవహరించాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 18 అంబేడ్కర్‌నగర్ బస్తీలో నివసించే ఫాతిమా బేగం అనే టీచర్ గత ఏడాది మార్చి 4న ఇంటికి వెళుతుండగా మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ వెంబడించాడు. తన డ్రైవర్‌తో కలసి నంబర్ ప్లేట్ లేని కారులో వెంటపడి ఆమె చెయ్యి పటుకుని కారు ఎక్కాల్సిందిగా బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసేందుకు యత్నించాడు. ఆమె భయంతో అరవడంతో చుట్టు పక్కల ఉన్నవారు గమనించి సుశీల్‌ను చితకబాదారు. మంత్రి, ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి బాధితులపైనే ఎదురు కేసు బనాయించారు. జిల్లా ప్రథమ మహిళకే అన్యాయం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేస్తూ మీడియా ఎదుట బోరున విలపించడం చూసి ప్రజానీకం విస్తుపోయింది. తాను చేసిన సిఫార్సులను మంత్రి బుట్టదాఖలు చేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మంత్రి మనుషులను తన ఇంటిపైకి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని గత డిసెంబరు 28న ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించాలని గుంటూరు రూరల్ ఎస్పీకి వినతి పత్రం సమర్పించింది. ఇంత జరిగినా సదరు మంత్రిపై మఖ్యమంత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సినిమాను తలపించిన ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్ ప్రొఫెసర్ వేధింపులతో గుంటూరు జీజీహెచ్‌లో గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్యహత్య చేసుకున్న ఘటనలో నిందితురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయకుండా సర్కారు సాగించిన హైడ్రామా సినిమాను తలపించింది. తనను ప్రొఫెసర్ లక్ష్మి తీవ్రంగా వేధిస్తోందని, ఇక భరించడం తన వల్ల కాదని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితురాలి భర్త టీడీపీ మద్దతుదారుడు కావడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి అన్ని విధాలా సహకరించారు. ఎంపీ కుమార్తెకే దిక్కులేదు.. సామాన్యులే కాదు.. ఏకంగా చిత్తూరు టీడీపీ ఎంపీ కుమార్తెపై దౌర్జన్యం చేసినా ఈ సర్కారు స్పందించ లేదు. ఈ నెల 8న ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత తిరుపతిలో కారులో వెళ్తుండగా ఒక కారు రోడ్డుకు అడ్డంగా కనిపించింది. దానిని పక్కకు తీయాలని ఆమె కారు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉంచిన కారు యజమాని, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బంధువు నరేంద్రకు చెప్పాడు. అతను, అతని అనుచరులు డ్రైవర్‌ను, డాక్టర్ మాధవీ లతపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారు. న్యాయం కోసం ఆమె నాలుగు గంటల పాటు రోడుపై బైఠాయించింది. ‘ఈ ప్రభుత్వంలో ఎంపీ కుమార్తెకే న్యాయం జరగదా?’ అని బాధితురాలు వాపోయారు. ► అధికార టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి గత ఏడాది అక్టోబర్ 20న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ► విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గత ఏడాది మే 14న ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే విమానంలో పక్క సీట్లో కూర్చొన్న ఓ మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తెలుగుజాతి పరువు తీశారు. ► గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని సాక్షాత్తు డీజీపీనే ప్రకటించారు. దేశంలో మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నలుగురు మంత్రుల్లో ఇద్దరు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు. ► కర్నూలు జిల్లా ఆర్.కొంతలపాడులో డిసెంబర్ 18న టీడీపీకి చెందిన ముగ్గురు అత్యాచారం చేస్తే.. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ► ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం నేతల చెరువు ఆక్రమణలను అడ్డుకోబోయిన చిన్నగొట్టికల్లు తహసీల్దార్ నారాయణమ్మపై రంగన్నగారిగడ్డ పంచాయతీ టీడీపీ నేత, సర్పంచ్ రమణారెడ్డి, మరికొందరు దుర్భాషలాడారు. ► వేతనాల పెంపు జీవోను విడుదల చేయాలని అంగన్వాడీ మహిళలు 2015 డిసెంబర్18న విజయవాడలో ఆందోళనకు దిగితే చంద్రబాబు సర్కారు పోలీసుల ద్వారా వారిపై దాడి చేయించింది. మగ పోలీసులు చీరలు లాగి, జుట్టు పట్టి ఈడ్చిపారేశారు. 60 మంది మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. -
బాబు దుష్ట పాలన.. మహిళ రోదన
-
స్త్రీ విముక్తి కోసం పోరుబాట
మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలని గత ఏడాదిలో ఐరాస పిలుపునిచ్చింది. కాని కాశ్మీర్ ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృధా ప్రయాసే. స్త్రీ శ్రమశక్తికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. పురుషులతోపాటు తమ శ్రమశక్తిని సమానంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ అమెరికా, రష్యాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సార్వత్రిక సమ్మెలలో పాల్గొని పోరాటాలు చేశారు. వీటిని గమనంలో ఉంచుకుని మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆ విధంగా గత 104 సంవత్సరాలుగా మార్చి 8న స్త్రీ-పురుష సమాన హక్కుల పోరాటానికి సంకేతంగా, మహిళా విముక్తి సంకల్ప దినంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకుంటున్నారు. మన ఇరుగుపొరుగు దేశాలు ఈ రోజును సెలవు దినంగా ప్రకటించి అమలుపరుస్తున్నప్పటికీ భారతదేశంలోని రాజకీయపార్టీల నేతలకు మహిళల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు ఇటీవలే 15వ లోక్‌సభ పదవీ కాలం ముగిసినప్పటికీ మహిళలకు 33వ శాతం రిజర్వేషన్ బిల్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మార్క్స్ నేతృత్వం కార్ల్ మార్క్స్ నాయకత్వాన 1864లో ప్రారంభించిన మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్త్రీ శ్రమశక్తి సామాజిక గుర్తింపు పొందడానికి, పారిశ్రామిక ఉత్పత్తిలో వారి భాగస్వామ్యం పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. 1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో తొలి అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన శ్రామిక మహిళలతో సమన్వయ సంఘం ఏర్పరచి మహిళలందరికీ ఓటు హక్కు డిమాండ్ చేసింది. తర్వాత లెనిన్ చొరవతో రెండవ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా ప్రకటించింది. అనంతరం 1911 మార్చి 8న మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు దేశాలలో జరుపుకున్నారు. అన్నింటా అణచివేతే ప్రపంచీకరణ యుగంలో మహిళా శ్రమశక్తిని అనేకమంది పారిశ్రామికవేత్తలు కొల్లగొడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం ద్వారా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ పద్ధతిలో మహిళలను, పిల్లలను తీసుకుని వారికి శ్రమకు తగినవిధంగా వేతనం చెల్లించని పరిస్థితులు ఉన్నాయి. బీడీ రంగంతోపాటు నిర్మాణ పనులు, సేవా రంగం, అసంఘటిత రంగాలలో అధిక సంఖ్యలో మహిళా శ్రామికులను వినియోగిస్తున్నారు. చదువులు, కుటుంబ నిర్వహణ, సామాజిక ఉత్పత్తి రంగాల్లో ఎంతో ప్రావీణ్యత కలిగినా మహిళలను అన్ని కీలక రంగాల నుంచి తప్పిస్తున్నారు. కొన్ని రంగాలలో పురుషాధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో కూడా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు తమ మేధస్సుతో, పట్టుదలతో దూసుకుపోతున్నారు. పితృస్వామ్య భావజాలానికి ఎదురీది స్వతంత్ర ధోరణితో ఎదిగి రాజకీయ రంగంలో స్థిరపడిన వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్ పార్లమెంట్లో మహిళా ఎంపీల సంఖ్య 11 శాతానికి మించదు. ఈ విషయంలో మనం పొరుగున ఉన్న పాకిస్థాన్ కన్నా వెనుకబడి ఉన్నామని చెపితే విస్మయం కలుగుతుంది. 1975-85 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దిగా ప్రకటించింది. స్త్రీలపై అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరుకు కంకణబద్ధులు కావాలంటూ గత ఏడాదిలో పిలుపునిచ్చింది. కాని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా పోలీసు, సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృథా ప్రయాసే అవుతుంది. ఈచట్టాలను ఎత్తివేయాలని స్త్రీలు నగ్నంగా నిరసన తెలుపుతున్నా, మణిపూర్‌లో గత 14 ఏళ్లుగా షర్మిల చాను అనే మహిళ ఉక్కు సంకల్పంతో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ పాలకులకు చీమ కుట్టిన ట్లయినా లేదు. అందువల్ల వ్యవస్థీకృతమైన అణచివేత, దోపిడీ, వివక్షలను రూపుమాపడానికి మహిళలు ఇతర పీడిత వర్గాలతో భుజం, భుజం కలిపి పోరాడవలసి ఉంది. సంక్షేమ పథకాల తాయిలాలతో సంతృప్తిపడకుండా అన్ని రంగాల్లో సగభాగం వాటా చెందాలన్న సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ సమసమాజ స్థాపన దిశగా సాగాలి. ఆకాశంలో మేము సగమంటున్న మహిళల నినాదం నిజం కావడానికి సంఘర్షిద్దాం. (రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం) అమర్ (జనశక్తి)