రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా ఘటనల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలే నిందితులు కాగా, మిగతా ఘటనల్లో నిందితులకు వత్తాసు పలుకుతోందీ ఆ పార్టీ నేతలే. ఏ ఘటనలోనూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జనం ఉద్యమించి గోల చేస్తే తూతూ మంత్రంగా చర్యలతో మమ అనిపిస్తూ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయన శిష్యగణం వల్ల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య ఘటనలను పరిశీలిస్తే రాష్ట్రంలో మహిళలు ఏ రీతిన అన్యాయాలకు, అకృత్యాలకు గురవుతున్నారో తేటతెల్లమవుతోంది.
Published Sun, Feb 12 2017 10:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement