నాగోలు: కుమార్తెపై కన్న తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కుషాయిగూడలో శుక్రవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 27 కాప్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీటీమ్స్ పోలీసులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ , ఈవ్ టీజింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశం అనంతరం అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక తండ్రి లైంగిక వేధింపుల గుర్తించి షీ టీమ్స్ దృష్టికి తీసుకెళ్లింది.
తన తల్లి కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకు నిద్ర కోసం మాత్రలు ఇచ్చేవారని తెలిపింది. ఆమె నిద్రలోకి వెళ్లగానే తండ్రి ప్రశాంత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. రెండేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్న అతను ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో బాలికపై ట్యూషన్ మాస్టర్ వేధింపులు
ఎల్‌బీనగర్‌లో నివాసం ఉండే బాలిక 10 వ తరగతి చదువుతుంది.ఆమె అదే ప్రాంతానికి చెందిన మాచవరం వెంకట శ్రీకాంత్ కుమార్ వద్ద ట్యూషన్‌కు వెళ్లేది. బాలికతో సన్నిహితంగా ఉంటున్న అతను ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకర మెసేజ్‌లు పంపేవాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
మహిళలు ఎక్కడ వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టిమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చని రాచకొండ షీ టీమ్స్ ఇన్‌ఛార్జి అదనపు డీసీపీ షేక్ సలీమా అన్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయం వద్ద 111 మంది ఆకతాయికు వారి కుటుంబ సభ్యల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గత 4 వారాల్లో షీ టీమ్స్ 111 మంది ఈవ్ టీజర్లు పట్టుబడారు. వారిలో 41 మంది మేజర్లు, 70 మైనర్లు ఉన్నారు. పట్టుబడిన వారికి భూమిక విమెన్స్ కలెక్టివ్ నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మొత్తం 79 కేసుల్లో 29 ఎఫ్‌ఐఆర్, 28 పెట్టి కేసులు, 22 సాధారణ కౌన్సెలింగ్ ఉన్నాయి. మైనర్లకు సైకియాట్రిస్ట్ డాక్టర్ వాసవి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురైన మహిళలలు డయల్ 100, వాట్సాప్ కంట్రోల్ నెం. 9490617111 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment