![Father Assassination His Daughter At Chandanagar Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/car.jpg.webp?itok=YSSRVNG7)
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కూతురిని తండ్రి కిరాతకంగా చంపాడు. స్కూల్‌లో ఉన్న పాపను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన తండ్రి చంద్రశేఖర్.. పెన్సిల్ బ్లేడ్‌తో కూతురు మోక్షజ(5) గొంతుకోశాడు.
పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఓఆర్‌ఆర్‌లో కారుకు ప్రమాదం కావడంతో హత్యా ఉదంతం బయటపడింది. చంద్రశేఖర్, హిమ అనే దంపతులు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి 8 ఏండ్ల కూతురు మోక్షజ. అయితే భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కాగా గతేడాది చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్, హిమ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో కొద్ది రోజుల క్రితం తన పాపను తీసుకుని హిమ తన పుట్టింటి వెళ్లిపోయింది.
చదవండి: అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం..
తనకు భార్య దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో.. ఆ తండ్రి తన కన్న కూతుర్ని గొంతు కోసి చంపాడు. అనంతరం డెడ్‌బాడీని తన కారులో అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వైపు తీసుకెళ్లి.. చెట్లలో విసిరేయాలనుకున్నాడు. కానీ అంతలోనే కారు ప్రమాదానికి గురైంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ కారు వద్దకు వెళ్లగా.. వెనుక సీట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment