లక్నో: ఉత్తరప్రదేశ్ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని దీని పరిణామాలే అత్యాచారాలకు దారి తీస్తాయన్నారు. ఆలీఘర్‌లో మహిళలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా అమ్మాయిలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని ఆమె ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొదట అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతారు ఆ తరువాత వారితో పారిపోతారన్నారు. కాగా రాష్ట్రంలో అత్యాచారం కేసులు గణనీయంగా పెరిగాయి అనే ప్రశ్నకు సమాధానంగా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మహిళా కమిషన్ మాత్రం మీనా కుమారి వ్యాఖ్యలను సమర్థించలేదు. కమిషన్ ఉపాధ్యక్షుడు అంజు చౌదరి, కుమారి వ్యాఖ్యలు తప్పని, అమ్మాయిలను ఫోన్లకు దూరంగా ఉంచినంత మాత్రాన అత్యాచారాలకు తగ్గుదలకు ఇవి పరిష్కారం కాదన్నారు.
UP महिला आयोग अध्यक्ष का विवादित बयान, 'फोन पर लंबी बात कर लड़कों के साथ भाग जाती हैं लड़कियां, उन्हें ना दें मोबाइल'#MeenaKumari #UPStateWomenCommission#UPSWC pic.twitter.com/CDccF2kqBx
— NBT Uttar Pradesh (@UPNBT) June 10, 2021
Comments
Please login to add a commentAdd a comment