కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ
అల్లిపురం (విశాఖ దక్షిణ)/ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లా, చౌడువాడకు చెందిన రాములమ్మ, ఆమె సోదరి, సోదరి కుమారుడిని సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ పి.వి.సుధాకర్‌ను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందుతోందని, ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.
ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు
మహిళలు పనిచేసే ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. సోమవారం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment