patrol attack
-
బాధితురాలికి అండగా ప్రభుత్వం
అల్లిపురం (విశాఖ దక్షిణ)/ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లా, చౌడువాడకు చెందిన రాములమ్మ, ఆమె సోదరి, సోదరి కుమారుడిని సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ పి.వి.సుధాకర్‌ను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందుతోందని, ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు మహిళలు పనిచేసే ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. సోమవారం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. -
పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు, 13 మంది మృతి
మెక్సికో: సెంట్రల్ మెక్సికోలోని పోలీసు కాన్వాయ్‌పై క్రిమినల్ గ్యాంగ్ విరుచుకుపడింది. మెక్సికో రాష్ట్రంలోని కోటెపెక్ హరినాస్ మునిసిపాలిటీలో లానో గ్రాండే జిల్లాలో భద్రతా మంత్రిత్వ శాఖ, మెక్సికో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన కాన్వాయ్‌పై గురువారం రాత్రి ఓ క్రిమినల్ గ్రూప్ ఆకస్మికంగా దాడికి తెగబడింది. పోలీసుల కాన్వాయ్‌పై నేరస్తుల ముఠా జరిపిన ఈ దాడుల్లో 13 మంది మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది పోలీసులు, అయిదుగురు విచారణాధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ కాల్పుల దాడిని అధికారులు ఖండించారు. మరోవైపు దాడికి కారణమైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. చదవండి: కోవిడ్–19: మహిళలపై తీవ్రమైన వేధింపులు -
లెక్చరర్‌కు నిప్పంటించాడు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్ఘాట్లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్ వద్ద అడ్డగించిన వికేశ్.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్ ప్రకటించారు. బాధితురాలు, నిందితుడు వికేశ్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని ఇన్స్పెక్టర్ సత్యవీర్ తెలిపారు. వికేశ్కు 9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్ తెలిపారు. -
పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 12 గంటల సమయంలో గొడవ పడుతున్న నలుగురు యువకులను పెట్రోలింగ్ పోలీసులు మందలించి పంపించేశారు. గంట తర్వాత తిరిగి వారు అక్కడకు చేరుకోగా, రాకేశ్ అనే వ్యక్తిపై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.